Vivo x500: స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న వివో మరోసారి ఫ్లాగ్ షిప్ విభాగంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కొత్త ఎక్స్ 500 సిరీస్ తో ప్రీమియం వినియోదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. అతిపెద్ద బ్యాటరీ.. శక్తివంతమైన ప్రాసెసర్.. జీస్ కెమెరా టెక్నాలజీతో ఈ ఫోన్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈనెల 26న భారత మార్కెట్లోకి రాబోతోంది.
వివో ఎక్స్ 500 లో 6.59 అంగుళాల డిస్ ప్లే ఉన్నట్టు తెలుస్తోంది. ఇది 1.5 k Resolution తో పనిచేస్తుంది. 144 హెచ్ జెడ్ రీ ప్రెష్ రేట్ ఉండడంతో స్క్రోలింగ్.. గేమింగ్.. వీడియోలు చూసే సమయంలో మంచి అనుభూతి అందిస్తుంది. అధిక రీ ప్రెష్ రేట్ కారణంగా స్క్రీన్ మీద కదలికలు మరింత స్మూత్ గా కనిపిస్తాయి.
ఈ ఫోన్లో కెమెరా ప్రధాన ఆకర్షణగా కనిపిస్తోంది.. వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 50 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా.. 50 మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరా.. 64 మెగాపిక్సల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఇందులో ప్రధాన కెమెరాలు సోనీ ఎల్ వై టి 828 సెన్సార్ ఉంది. జీస్ ఇమేజింగ్ టెక్నాలజీతో ఫోటోలు.. వీడియోల నాణ్యతను మెరుగుపరిచే విధంగా రూపొందించారు. సెల్ఫీలు.. వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 50 మెగాపిక్సల్ కెమెరా రూపొందించారు. వీడియోల మీద ఆసక్తి ఉన్నవారికి 4k 120 fps రికార్డింగ్, 10 bit Log వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి..
బ్యాటరీ విషయంలో వివో ఎక్స్ 500 తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. ఇందులో 7500 ఎం ఏ హెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీ అందించారు. 90 w ఫాస్ట్ ఛార్జింగ్.. 40 w వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఎక్కువ సమయం ఫోన్ ఉపయోగించేవారికి ఈ బ్యాటరీ సామర్థ్యం ఉపయోగకరంగా ఉంటుంది.
వివో ఎక్స్ 500 లో మీడియా టెక్ డైమన్ సిటీ 9600 M ప్రాసెసర్ ను ఉపయోగించారు. ఇది 3nm తయారీ సాంకేతికత ఆధారంగా రూపొందించిన చిప్ సెట్. గేమింగ్.. మల్టీ టాస్కింగ్.. రోజు వారి ఉపయోగంలో మెరుగైన పనితీరు అందించే విధంగా రూపొందించారు. ఈ ఫోన్లో 12 జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఆర్జిన్ ఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది.
చైనాలో వివో ఎక్స్ 500 ప్రారంభ ధర 5499 యువాన్లు గా ఉంది. మనదేశంలో సుమారు 70 వేల నుంచి 75 వేల వరకు లభిస్తుంది.. ఇక మనదేశంలో ఈ ఫోన్ నవంబర్ 26న విడుదల కాబోతోంది ఈ సిరీస్లో వివో ఎక్స్ 500.. వివో ఎక్స్ 500 ప్రో.. వివో ఎక్స్ 500 ప్రో మాక్స్ మోడల్ అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు వివో వాచ్ జీ టూ, జీస్ టెలిఫోటో కన్వర్టర్ కిట్ కూడా మార్కెట్లోకి రాబోతోంది.
మంచి కెమెరా.. ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం.. వేగవంతమైన డిస్ ప్లే, ప్రీమియం పనితీరు కోరుకునే వారికి వివో ఎక్స్ 500 ఆకర్షణీయమైన ఎంపికగా నిలిచే అవకాశం ఉంది. మన దేశ మార్కెట్లో అధికారిక ధరలు బయటికి వచ్చిన తర్వాత ఈ ఫోన్ విలువ.. ఇతర ఫ్లాగ్ షిప్ ఫోన్లతో అంచనా వేయవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు.