Samsung one UI 9.5 Beta: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ తన గెలాక్సీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు మరో కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. తాజాగా One UI 9.5 బీటా వెర్షన్ ను విడుదల చేసింది. ఇందులో వినియోగదారుల ప్రవేశపెట్టి పెద్ద పీట వేసింది. కొత్త ఫీచర్లని అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా ఈ యాప్ లకు ప్రత్యేక లాక్ పెట్టుకునే అవకాశం కల్పించింది. కెమెరాలు మరిన్ని నియంత్రణలో.. హెల్త్ ట్రాకింగ్ లో కొత్త సదుపాయాలు ఈ అప్డేట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఈ అప్డేట్ లో అందర్నీ ఆకర్షించే ఫీచర్ యాప్ లాక్. సాధారణంగా ఫోన్ కు లాక్ పెట్టుకున్నప్పటికీ ఇతరులకు ఫోన్ ఇచ్చినప్పుడు కొన్ని యాప్లలోని వ్యక్తిగత సమాచారం బయటకి కనిపించే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రతి యాప్ కు విడిగా లాక్ పెట్టుకోవచ్చు. ఫింగర్ ప్రింట్..పిన్.. ప్యాటర్న్..పాస్ వర్డ్.. ద్వారా యాప్ లను భద్రపరచుకోవచ్చు. లాక్ చేసిన యాప్ ల నోటిఫికేషన్లు.. విడ్జెట్ లలోని సమాచారాన్ని కూడా ఇతరులు చూడలేరు.
మరికొన్ని మార్పులు
ఫోటోగ్రఫీ.. వీడియోలపై ఆసక్తి ఉన్నవారికి అప్డేట్ ఉపయోగపడుతుంది. ఇందులో ప్రో.. ప్రో వీడియో మోడ్ లకు మరిన్ని కష్టమైజేషన్ సదుపాయాలను తీసుకొచ్చారు. యూసర్లు తమ అవసరాలకు అనుగుణంగా కెమెరా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. కెమెరాలు జూమ్ బార్ .. కీలకమైన కంట్రోల్ వ్యవస్థలను ఒకే స్క్రీన్ మీద అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనివల్ల ఫోటోలు.. వీడియోలు తీస్తున్నప్పుడు సెట్టింగ్స్ మార్చుకోవడం ఈజీ అవుతుంది.
హెల్త్ ట్రాకింగ్ విషయంలోనూ శాంసంగ్ అనేక రకాలుగా మార్పు తీసుకువచ్చింది. మైండ్ ఫుల్ నోట్ అనే ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఆలోచనలను.. భావాలను రాసుకోవచ్చు. ఇందులో కొన్ని గైడెడ్ ప్రశ్నల సహాయంతోను తమ అనుభవాలను నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా మెడికేషన్స్ ఫీచర్స్ ద్వారా మందులు.. విటమిన్లు.. సప్లిమెంట్ల వివరాలను నమోదు చేసుకోవచ్చు. వాటిని ఎప్పుడు తీసుకోవాలో రిమైండర్లు కూడా పెట్టుకోవచ్చు. మందులు తీసుకున్న వివరాలను కూడా ట్రాక్ చేసుకోవచ్చు.
Accessibility ఫీచర్లలో మార్పులు
యూజర్లకు అవసరమైన కొన్ని ముఖ్యమైన కంట్రోల్ వ్యవస్థలను ఉపయోగించుకునే విధంగా ఫ్లోటింగ్ షార్ట్ కట్ రూపొందించారు. వినికిడి పరికరాలు ఉపయోగించే వారికి నోటిఫికేషన్ ప్యానెల్ నుంచి వాల్యూం కంట్రోల్ చేసే అవకాశం కల్పించారు. రింగ్ టోన్లు.. అలారాలు.. నోటిఫికేషన్లు వంటి శబ్దాలను వినే పరికరాలకు పంపించేందుకు కూడా కంట్రోల్ చేయవచ్చు.
ప్రస్తుతం one UI 9.5 beta program ను galaxy s26 సిరీస్ యూజర్ల కోసం మొదలుపెట్టారు. ఇందులో గెలాక్సీ ఎస్ 26.. గెలాక్సీ ఎస్ 26 ప్లస్.. గెలాక్సీ s26 ఆల్ట్రా ఉన్నాయి. మన దేశంతో పాటు అమెరికా.. బ్రిటన్.. జర్మనీ.. దక్షిణ కొరియా.. పోలాడు దేశాలలో ఈ ప్రోగ్రాం అందుబాటులో ఉంది. అర్హత ఉన్న యూజర్లు తమ ఫోన్లలో సాంసంగ్ మెంబర్స్ యాప్ ను ఓపెన్ చేసి బీటా ప్రోగ్రాం లో రిజిస్టర్ కావాలి. అయితే బీటా వెర్షన్ కావడంతో కొన్ని బగ్స్.. పనితీరు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఇది బీటా దశలో ఉన్న నేపథ్యంలో.. పూర్తిస్థాయి వెర్షన్ విడుదల కావలసి ఉంది. దీనిని సాంసంగ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. గెలాక్సీ ఎస్ 27 సిరీస్ తో పాటు స్టేబుల్ వర్షన్ అందుబాటులోకి రాబోతోంది. ఆ తర్వాత పాత గేలక్సీ ఫోన్లకు కూడా దశలవారీగా అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.