Homeబిజినెస్Motorola signature 27: ఈ ఫోన్ గురించి ఎందుకింత చర్చ.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

Motorola signature 27: ఈ ఫోన్ గురించి ఎందుకింత చర్చ.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

Motorola signature 27: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సరైన స్థానం కోసం పోటీపడుతోంది మోటరోలా. ఈ నేపథ్యంలో మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యంత శక్తివంతమైన ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తోంది. తాజాగా సిగ్నేచర్ 27 పేరుతో సరికొత్త ఫోన్ ను త్వరలో మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఇందులో అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్.. భారీ బ్యాటరీ.. ప్రొఫెషనల్ కెమెరా సెట్ అప్ ఉన్నాయి. దీనిని ఆల్ట్రా ప్రీమియం ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ అని పిలుస్తున్నారు. అయితే ఇది షాపింగ్ […]

Motorola signature 27: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సరైన స్థానం కోసం పోటీపడుతోంది మోటరోలా. ఈ నేపథ్యంలో మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యంత శక్తివంతమైన ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తోంది. తాజాగా సిగ్నేచర్ 27 పేరుతో సరికొత్త ఫోన్ ను త్వరలో మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఇందులో అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్.. భారీ బ్యాటరీ.. ప్రొఫెషనల్ కెమెరా సెట్ అప్ ఉన్నాయి. దీనిని ఆల్ట్రా ప్రీమియం ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ అని పిలుస్తున్నారు. అయితే ఇది షాపింగ్ జాబితాలో అందుబాటులో లేదు. గ్లోబల్ మార్కెట్లో ఇటీవల ప్రకటించారు. మనదేశంలో ఇంకా విడుదల కావలసి ఉంది.

డిజైన్ అండ్ డిస్ ప్లే

ప్రీమియం బిల్డ్: ఈ ఫోన్ ఏరో స్పేస్.. గ్రేట్ అల్యూమినియం ఫ్రేమ్ కలిగి ఉంటుంది. వెనుకవైపు టెక్స్టైల్ తరహా ఫినిషింగ్ తో వస్తుంది. ముందువైపు గొరిల్లా గ్లాస్ సెరామిక్ 3 రక్షణ కలిగి ఉంటుంది. ఐపీ 68/ ఐపి69 వాటర్ రెసిస్టెన్స్.. ఎం ఐ ఎల్ ఎస్ టి డి 810 హెచ్ మిలిటరీ గ్రేడ్ ను కలిగి ఉంటుంది.

బ్రహ్మాండమైన స్క్రీన్: ఇందులో 6.8 అంగుళాల ఎక్స్ట్రీమ్ అమో లెడ్ డ్యూయో డిస్ ప్లే ను కలిగి ఉంటుంది. ఇది 120 హెచ్ జెడ్ రీ ప్రెష్ రేట్, డాల్బి విజన్ ను సపోర్ట్ చేస్తుంది. ఏకంగా 12000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ను అందిస్తుంది. దీని ప్రకారం మండే ఎండలో కూడా స్క్రీన్ అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది.

ఇందులో అత్యంత వేగవంతమైన చిప్ సెట్ ఉంది. ఇది 2nm ఆర్కిటెక్చర్ మీద రూపొందిన క్వాల్ కం స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ ట్రిమ్ జెన్ 6 ప్రాసెసర్ ఇందులో ఉంటుంది. భారీగా గేమింగ్ ఆడే వారికి.. ఏఐ ఫీచర్లు.. మల్టీ టాస్కింగ్ ను ఏ మాత్రం తడబాటు లేకుండా చేయగలుగుతుంది. ఫోన్ వేడిని తగ్గించడానికి 8384 ఎంఎం2 వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టం ఇందులో ఉంటుంది.

ఇందులో 12gb/ 16 జిబి రామ్, 256 / 512 జిబి స్టోరేజ్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. ఆండ్రాయిడ్ 17 ద్వారా ఈ ఫోన్ వస్తుంది. సుమారు ఏడు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం.. సెక్యూరిటీ అప్డేట్లు ఇస్తుంది.

కెమెరా విషయానికి వస్తే ట్రిపుల్ రియర్ కెమెరా ఇందులో ఉంది. వెనుకవైపు 50 మెగాపిక్సల్ సోనీ ఎల్ వై టి ఐ ఏ ఎల్పీ 910 ప్రధాన సెన్సార్.. 50 మెగాపిక్సల్ ఆల్ట్రా వైడ్ లెన్స్.. 200 మెగాపిక్సల్ పెరిస్కోప్ పెళ్లి ఫోటో కెమెరా ఇందులో ఉన్నాయి. ముందు వైపు ఆటో ఫోకస్ తో కూడిన 50 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ ద్వారా 8 కే, 4 కే స్లో మోషన్ వీడియోలను రికార్డ్ చేయవచ్చు. DXOMARK గోల్డ్ లేబుల్.. పాంటోన్ వ్యాలిడేటెడ్ కలర్స్ వల్ల ఫోటోలు చాలా క్లారిటీగా వస్తాయి.

7.99 సన్నని బాడీలో ఏకంగా 7000 ఎం ఏ హెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ అమర్చారు. సాధారణ వాడకంలో సులభంగా రెండు రోజులు వరకు వస్తుంది. దీనికి 90 w వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 50 w వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. రివర్స్ చార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. గ్లోబల్ మార్కెట్లో దీని బేస్ వేరియంట్ ధర 1.51 లక్షల వరకు ఉంటుంది. టెక్ పోర్టల్స్ అంచనా ప్రకారం మనదేశంలో దీని ధర 1,20,000 నుంచి 1,49,999 మధ్య లభించే అవకాశం ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper