UPI Privacy Feature: జేబులో పర్స్ మర్చిపోయాం. చేతిలో చిల్లర పట్టుకు వెళ్ళడం మర్చిపోయాం. ఫోన్ ఉంటే చాలు.. అలా అయిపోయింది మనదేశంలో ప్రతి ఒక్కరి పరిస్థితి.
పేమెంట్ విభాగంలో డిజిటల్ విప్లవం తర్వాత.. చెల్లింపుల సంస్కృతి పూర్తిగా మారిపోయింది. డబ్బులు తీసుకెళ్లడం పూర్తిగా తగ్గిపోయింది. ఇదే క్రమంలో పేమెంట్ సంస్థలు రకరకాల మార్పులకు శ్రీకారం జరుగుతున్నాయి. కొత్త కొత్త ప్రైవసీ ఫీచర్లను అందుబాటులో తీసుకొస్తున్నాయి.
తాజాగా యూపీఐ ద్వారా డిజిటల్ పేమెంట్లు చేసే వాళ్లకు సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. ఈ ప్రకారం డిజిటల్ పేమెంట్స్ చేసే వాళ్ళ ఫోన్ నెంబర్లు పూర్తిగా కనిపించవు. దీనిపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టానికి లోబడి ఈ కొత్త మార్పు ఉంటుంది.
ప్రస్తుతం యూపీఐ లావాదేవీలను మొబైల్ నెంబర్ ఆధారంగా కస్టమర్లను ఐడెంటిఫై చేస్తున్నారు. ఫోన్ నెంబర్లు ఇతరులకు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రైవసీ పై చాలామంది ఫిర్యాదులు చేస్తున్నారు. అందువల్లే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా నిర్ణయం ప్రకారం బ్యాంకులు.. యూపీఐ యాప్ నిర్వాహకులకు ఎన్సిపిఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. కస్టమర్ల మొబైల్ నెంబర్లు.. యూపీఐ ఐడీలు.. బ్యాంకు ఖాతాలను దాచిపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది అంతేకాదు కస్టమర్ మొబైల్ నెంబర్లలో చివరి 4 అంకెలు మాత్రమే కనిపించే విధంగా చూడాలని సూచించింది.
క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేసిన తర్వాత.. పేయర్ లేదా మనీ రిసీవర్ నెంబర్ కనిపించకుండా ఉండేలా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోబోతోంది. ప్రత్యేకంగా యూపీఐ ఐడీలను రూపొందించింది. మొబైల్ నెంబర్ కు ప్రత్యామ్నాయంగా ఈ ఐడి లు మాత్రమే కనిపిస్తాయి. వీటిని మాత్రమే ఉపయోగించుకునేలాగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మార్పులు చేసింది.
ఈ మార్పుల వల్ల కస్టమర్ల వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంటుంది. అనవసరమైన ఫోన్లు.. ఇతర మోసాలు.. ప్రైవసీ వంటి సమస్యలు ఎదురు కావు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. డిజిటల్ పేమెంట్లలో లొసుగులను అక్రమార్కులకు ఆసరాగా మార్చుకుని దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. అటువంటి వారికి కూడా చెక్ పెట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటున్నది.