Pakistan New Year Shutdown : భారత్‌లో కొత్త సంవత్సరం ప్రారంభం పెద్ద ఎత్తున ఆర్థిక ఉత్సవంగా మారింది. కొత్త వస్త్రాలు, మిఠాయిలు, కేక్‌ల కొనుగోళ్లు వందల కోట్ల వ్యాపారం జరిగింది. పార్టీలు జరిగాయి. ఆలయ కిటకిటలాడాయి. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో వ్యాపార రష్ దసరా, సంక్రాంతి స్థాయిలో కనిపించింది. కొంతమంది గిగ్ వర్కర్స్ సమ్మెతో డిస్టర్బెన్స్ ప్రయత్నాలు చేశారు కానీ, కానీ విఫలమైంది. దీంతో ఉత్సాహం తగ్గలేదు.
పాకిస్తాన్‌లో బంద్, హింస..
పాకిస్తాన్‌లో ప్రభుత్వ నిర్ణయాలు, మత సంస్థల ఫత్వాలతో డిసెంబర్ 31న పూర్తి బంద్ పాటించారు. వాణిజ్య సంఘాలు ఖీఅఎ, అంజుమాన్ తజ్రా దుకాణాలు మూసేశాయి. జనవరి 1, 16 తేదీల్లో కూడా బంద్ ప్రకటించారు. ఫలితంగా అర్ధరాత్రి వేడుకలు లేకుండా అంధకారం నెలకొంది. భారత్ దేదీప్యమానంగా మారినప్పుడు పాక్‌లో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయి.
పీఓఎస్ యంత్రాలకు ఆదేశం..
పాకిస్తాన్ ఫెడరల్ బోర్డు ఆఫ్ రెవెన్యూ ప్రతి వ్యాపార కేంద్రంలో పీవోఎస్ మిషన్లు (పాయింట్ ఆఫ్ సేల్స్) ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. భారత్‌లో కరోనా, పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపులు పెరిగి ట్రేడింగ్ ఫార్మలైజ్ అయింది. పాక్ 11 ఏళ్ల తర్వాత అమలు చేయాలని నిర్ణయించింది. వ్యాపారులు పన్నులు, అవినీతి (రూ.53 లక్షల కోట్లు) భయంతో వ్యతిరేకిస్తున్నారు. ఇది బంద్‌కు మరింత బలం తెచ్చింది. దీంతో డిసెంబర్ 31, జనవరి 1న వ్యాపారం బోసిపోయింది. వేడుకలు జరగలేదు. ఇక మత ఛాందసవాదుల కారణంగా కూడా ఉత్సవాలకు చాలా మంది దూరంగా ఉన్నారు.
ఉగ్రదాడులు, ఆర్థిక సంక్షోభం
జనవరి 1న బలూచిస్తాన్, ఖైబర్ పక్తూంఖ్వాలో ఉగ్రవాద దాడులు జరిగాయి. దుకాణాలు తెరవకపోవటం, కొనుగోళ్లు ఆగిపోవటంతో మిలిటరీ కూడా కొన్ని ప్రాంతాల్లోకి వెళ్లలేకపోయింది. ఐఎంఎఫ్ లోన్లపై ఆధారపడిన ఆర్థిక స్థితి మరింత దిగజారుతోంది. భారత్‌లో ఉగ్రవాద నిర్మూలనకు సైన్యం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.
భారత్ ఆర్థిక ఉత్సాహం, స్థిరత్వంతో ముందుకు సాగగా, పాకిస్తాన్ బందులు, హింసతో వెనుకబడింది. ఈ వ్యత్యాసం పాక్ ఏడాది భవిష్యత్తును సూచిస్తోంది. భారత్ పోలికలో స్థిరమైన పాలన, డిజిటల్ మార్పులు ముందుండటానికి కారణమవుతున్నాయి.