Mukesh Ambani : వెనకటికి ఒక సినిమాలో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించాడు. ఆ సినిమాలో మూతపడిన ఒక బట్టల షాపులో దుస్తులను రకరకాలుగా మార్చి అమ్ముతాడు. చివరికి కోట్లు సంపాదించి తిరుగులేని స్థాయిలో వ్యాపారవేత్తగా ఎదుగుతాడు.
సినిమా కాబట్టి అలా తీసారేమో.. కానీ రియల్ లైఫ్ లో అలా ఉంటుందా.. రిలయన్స్ ముఖేష్ అంబానీ తలుచుకుంటే అలానే ఉంటుంది. పెట్రోల్ వ్యాపారం.. బట్టల వ్యాపారం.. మామిడికాయల వ్యాపారం.. టెలికామ్ వ్యాపారం.. ఇలా ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి ముకేశ్ అంబానికి. చివరికి అడవి జంతువులను కాపాడుతూ.. దాన్ని కూడా కార్పొరేట్ స్టైల్ లో మార్కెటింగ్ చేసుకుంటున్నాడు ముకేశ్ అంబానీ. ఒక ముక్కలో చెప్పాలంటే ముకేశ్ అంబానీ మట్టి ముట్టుకుంటే బంగారం. అతను అడుగుపెడితే కోట్ల వ్యాపారం.
తాజాగా ముకేశ్ అంబానీ ఐస్ క్రీమ్ బిజినెస్ లోకి వచ్చేసాడు. ఐస్ క్రీమ్ అంటే దాన్ని ఎంత సులభంగా తీసుకోకండి. ఇండియన్ ఐస్క్రీం మార్కెట్ విలువ దాదాపు 40 వేల కోట్లు. ఈ వ్యాపారంలో హిందుస్థాన్ యూనిలీవర్ ఇటీవల బయటికి వచ్చింది. అందువల్లే అంబానీ ఈ విభాగంలోకి వచ్చేసాడు. ఎఫ్ఎంసీజీ విభాగంలోకి రావాలి అంటే బలమైన సప్లై ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్.. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉండాలి. వాస్తవానికి ఎఫ్ఎంసీజీలలో అన్ని కేటగిరీలలో హిందుస్థాన్ యూనిలీవర్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. అయితే ఈ కంపెనీకి లాస్ట్ క్వార్టర్లో ఐస్ క్రీమ్ బిజినెస్ లో నష్టం వచ్చింది. దీంతో పోర్ట్ పోలియోను మార్చింది. సాధారణంగా ఐస్ క్రీమ్ అనేది రెగ్యులర్ బిజినెస్ కాదు. తయారీ.. రవాణా.. నిల్వ.. అమ్మడం ఇదంతా ఈజీ కాదు. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఐస్ క్రీమ్ వ్యాపారం కేవలం ఏడాదికి మూడు నెలలు మాత్రమే ఉంటుంది. అందువల్లే హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ దీని నుంచి తప్పుకుంది.
అయితే ఈ వ్యాపారం లోకి రిలయన్స్ తన ట్రేడ్ మార్క్ స్ట్రాటజీ అయినటువంటి పది రూపాయల ఫార్ములా తో మార్కెట్లోకి వచ్చింది. గతంలో జియో రీఛార్జ్ పది రూపాయలు.. కంపా కూల్డ్రింక్ బాటిల్ పది రూపాయలతో మార్కెట్లోకి వచ్చింది రిలయన్స్. అందులో విజయవంతమైనది కూడా. ఇప్పటికే రిలయన్స్ కంపా.. ఇండిపెండెన్స్ లాంటి ఎఫ్ఎంసీజీ బ్రాండ్లతో డిస్ట్రిబ్యూషన్.. రిటైలర్ వంటి బలాలను ఏర్పరచుకుంది. ఫ్రీజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మరో హై వాల్యూమ్ ప్రోడక్ట్ కేటగిరీని సిద్ధం చేయడానికి రెడీగా ఉంది. ఒకరకంగా ఇది రిలయన్స్ కు కొత్త వ్యాపారం అనే దానికంటే.. ప్రోడక్ట్ ఎక్స్ప్రెషన్ ప్లే అనవచ్చు.
వ్యాపార వర్గాల అభిప్రాయం ప్రకారం ఐస్ క్రీమ్ కేటగిరి చాలా అన్ ఆర్గనైజ్డ్.. అందువల్ల రిలయన్స్ 10 రూపాయలు ధరతో చిన్న ప్లేయర్ లాగా మార్కెట్లోకి వచ్చేసింది. మార్కెట్ షేర్ మొత్తం లాక్కోవడానికి ఎత్తుగడ వేసింది.
ఇక ఈ మార్కెట్లో అమూల్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. పాల ఉత్పత్తులు.. డిస్ట్రిబ్యూషన్ లో ఆ కంపెనీకి తిరుగులేని స్థాయి ఉంది. నెంబర్ 2 స్థానంలో ఇప్పటివరకు హిందుస్థాన్ యూనిలీవర్ ఉండేది. అది కాడి ఎత్తేసింది. ఈ నేపథ్యంలోనే రిలయన్స్ ఎంట్రీ ఇచ్చింది. వాస్తవానికి పెద్ద పెద్ద కంపెనీలతో పోటీ పెట్టుకోవాలని రిలయన్స్ అనుకోవడం లేదు. మనదేశంలో ఒక మనిషి సంవత్సరానికి తినే ఐస్క్రీం పరిమాణం కేవలం ఒక లీటర్ కంటే చాలా తక్కువ. దీనికి అనేకరణాలు ఉన్నాయి. అయితే రిఫ్రిజిరేషన్.. డిస్ట్రిబ్యూషన్.. నెట్వర్క్ వంటి వాటిని పెంచుకుంటే వ్యాపారాన్ని బ్రహ్మాండంగా సాగించవచ్చని రిలయన్స్ భావిస్తోంది. తద్వారా ఐస్ క్రీమ్ వినియోగం పెరుగుతుందని అంచనా వేస్తోంది. ఒకసారి బయట దేశాల్లో ఐస్క్రీమ్ వ్యాపారాన్ని చూస్తే.. అమెరికా లాంటి దేశంలో ఒక వ్యక్తి సగటున ఏడాదికి 11 లీటర్ల ఐస్క్రీం తింటాడు. మన దగ్గర అది అరకిలో కూడా ఉండదు. దీన్నిబట్టి ముకేశ్ అంబానీ ఐస్ క్రీమ్ బిజినెస్ ప్లానింగ్ ఎలా ఉందో అర్థమైంది కదా..