Jio: టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం ఎల్లప్పుడూ తక్కువ ధరలో అద్భుతమైన ప్లాన్లను అందిస్తూనే ఉంది. తాజాగా విడుదలైన ఒక నివేదిక ప్రకారం జియో ఇప్పుడు 191 మిలియన్ల 5జీ వినియోగదారులతో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇంత భారీ సంఖ్యలో ప్రజలు జియో నెట్‌వర్క్‌ను ఎంచుకోవడానికి కారణం కేవలం హై స్పీడ్ నెట్ వర్క్ మాత్రమే కాదు. కంపెనీ అందిస్తున్న చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లు, ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ రోజు మనం జియో అందిస్తున్న అత్యంత చౌకైన 28 రోజుల వ్యాలిడిటీ గల ప్రీపెయిడ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్ స్పెషాలిటీ ఏంటంటే దీని ధర కేవలం రూ. 200 కంటే తక్కువ!
Also Read: ఆకట్టుకుంటున్న ‘సింగిల్’ థియేట్రికల్ ట్రైలర్..మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసిన శ్రీవిష్ణు!
జియో అందిస్తున్న రూ.189 ప్లాన్ ఎయిర్‌టెల్ రూ. 199 ప్లాన్‌కు గట్టి పోటీనిస్తోంది. ఈ రెండు ప్లాన్‌ల ధరల్లో కేవలం రూ.10 మాత్రమే తేడా ఉంది. ఇప్పుడు ఈ రెండు ప్లాన్‌లలో లభించే బెనిఫిట్స్ మధ్య ఉన్న డిఫరెంట్స్ వివరంగా తెలుసుకుందాం.
జియో రూ. 189 ప్లాన్ వివరాలు
రూ. 189 ప్లాన్ తక్కువ డేటా ఉపయోగించే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ప్లాన్ 2 జీబీ హై-స్పీడ్ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, 300 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌తో పాటు జియో టీవీ, జియో క్లౌడ్ స్టోరేజ్ వంటి ఎక్స్ ట్రా బెనిఫిట్స్ కూడా కంపెనీ అందిస్తోంది.
ఎయిర్‌టెల్ రూ. 199 ప్లాన్ వివరాలు
ఎయిర్‌టెల్ రూ. 199 ప్లాన్ కూడా 2 జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తోంది. దీనితో పాటు ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్ లిమిటెడ్ కాలింగ్ కూడా అందిస్తుంది. జియో ప్లాన్ లాగానే ఎయిర్‌టెల్ ఈ ప్లాన్ కూడా 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఎక్స్ ట్రా బెనిఫిట్స్ విషయానికి వస్తే.. ఎయిర్‌టెల్ ఈ ప్రీపెయిడ్ ప్లాన్ స్పామ్ అలర్ట్‌లు, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ ద్వారా ఉచిత షోలు, సినిమాలు, లైవ్ ఛానెల్‌లు , 1 నెలలో ఒక ఉచిత హలోట్యూన్ వంటి ప్రయోజనాలను అందిస్తోంది.
రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ఈ రెండు ప్లాన్‌ల ధరల్లో కేవలం రూ. 10 మాత్రమే తేడా ఉంది. బెనిఫిట్స్ పరంగా చూస్తే జియో ప్లాన్ మొత్తం 28 రోజులకు 300 ఎస్‌ఎంఎస్‌లను మాత్రమే అందిస్తుండగా, ఎయిర్‌టెల్ ప్లాన్ ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌ల సౌకర్యాన్ని అందిస్తుంది.
Also Read: పెళ్లయిన స్టార్ హీరోతో ఎఫైర్ నడిపి కెరీర్ నాశనం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్…