Mukesh Ambani : ముకేశ్ అంబానీ పేరు చెప్తే రిలయన్స్ గుర్తుకొస్తుంది. అతిపెద్ద కార్పొరేట్ సామ్రాజ్యం జియో కళ్ళ ముందు కనిపిస్తుంది. రిలయన్స్ ట్రెండ్స్, జియో, జియో సినిమా, ముంబై ఇండియన్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే రిలయన్స్ నిర్వహిస్తున్న వ్యాపారాలు ఒక పట్టాన ముగియవు.. తన లక్షల కోట్ల సామ్రాజ్యానికి గుర్తుగా.. తన రాజసానికి దర్పంగా ముఖేష్ అంబానీ వందల కోట్లు ఖర్చుచేసి ఆంటీలియా అనే భవనాన్ని నిర్మించుకున్నాడు. ఇది ముంబైలోనే కాదు.. మనదేశంలోని అత్యంత ఖరీదైన భవనం. ఈ భవనంలో షిఫ్ట్ ల వారిగా ఉద్యోగులు పనిచేస్తుంటారు. ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు ప్రతిరోజు నాలుగువేలకు పైగా రోటీలు తయారు చేస్తారంటే.. ఎంతమంది ఉద్యోగులు విధి నిర్వహణలో ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
ముఖేష్ ఆంటీ లియాలో విభిన్న ప్రాంతాలకు చెందిన వారు పనిచేస్తుంటారు. వీరందరికీ ముఖేష్ అంబానీ భోజన సదుపాయం కల్పిస్తుంది. వారు ఉండడానికి కూడా అక్కడ ప్రత్యేకమైన క్వార్టర్స్ ఉంటాయి. ఇక్కడ సిబ్బంది రోటీలు మాత్రమే తింటారు.. కేవలం రోటీలు తయారు చేయడానికి మాత్రం ఒక వ్యక్తి ప్రత్యేకంగా ఉంటాడు. ఆయనకు సహాయంగా కొంతమంది సిబ్బంది ఉంటారు. మొత్తంగా ఆంటీలియాలో పనిచేసే 400 మంది సిబ్బందికి 4,000 వరకు రోటీలు సర్వ్ చేస్తారు.. ఉదయం అల్పాహారం, సాయంత్రం డిన్నర్ లో రోటీలను సర్వ్ చేస్తారు. పైగా ఈ రోటీలకు సంబంధించిన గోధుమపిండిని రిలయన్స్ కంపెనీకి సంబంధించిన వ్యవసాయ క్షేత్రం ద్వారానే సేకరిస్తారు.
నెలకు జీతం ఎంతంటే..
ముకేశ్ అంబానీ ఆంటీలియాలో పనిచేసే సిబ్బందికి గోధుమ రొట్టెలు తయారు చేసే వ్యక్తికి ప్రతినెల రెండు లక్షల వరకు వేతనంగా ఇస్తారు. ఇతర ప్రయోజనాలు కూడా కల్పిస్తారు. రిలయన్స్ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రులలో అతని కుటుంబానికి ఉచితంగా వైద్యం అందిస్తారు. పాఠశాలల్లో కూడా విద్యను అందిస్తారు. ఇక ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా కల్పిస్తారు.. ఆంటీలియాలో రొట్టెలు చేసే వ్యక్తికి రెండు లక్షల వేతనం అంటే.. ఇక మిగతా ఉద్యోగులకు ఏ స్థాయిలో వేతనాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అన్నట్టు ఆంటీలియాలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది మొత్తం అత్యంత నిష్ణాతులై ఉంటారు. వారంతా కూడా గతంలో ఆర్మీలో పనిచేసిన వారేనని తెలుస్తోంది. ఆంటీలియా పై ఈగ కాదు కదా.. కనీసం ఈగ చూపును కూడా దానిమీద పడనివ్వరు. మూడు షిఫ్టుల్లో ఆంటీలియాలో సిబ్బంది పని చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ముకేశ్ అంబానీ అత్యంత పేరు పొందిన వ్యక్తి కావడంతో.. ఆంటీలియా పై అందరి దృష్టి ఉంటుంది కాబట్టి.. సెక్యూరిటీ సిబ్బంది అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహిస్తారు. ఆంటీలియాలో జిమ్ నుంచి మొదలుపెడితే హెలికాప్టర్ వరకు ప్రత్యేకమైన సదుపాయాలు ఉంటాయి.. పైగా ఈ గృహ సముదాయంలో ఎండాకాలంలో చల్లగా ఉంటుంది. చలికాలంలో వెచ్చగా ఉంటుంది. ఇక వర్షాకాలంలో అయితే వాతావరణం తగ్గట్టుగా అందులోని పరిస్థితి మారిపోతుంది. అత్యంత భారీ భవంతి అయినప్పటికీ.. గ్రీనరీ విషయంలో ముఖేష్ అంబానీ ఏ మాత్రం రాజీ పడలేదు. పైగా ఇక్కడ విభిన్న రకాల చెందిన మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలు ఆంటీలియాను అత్యంత చల్లగా ఉంచుతాయి. ఫలితంగా విద్యుత్ వాడకాన్ని తగ్గిస్తున్నాయి..