Mukesh Ambani: పై ఉపోద్ఘాతం ముకేశ్ అంబానికి అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. మన దేశంలోనే కాదు ఆసియాలోనే అపర కుబేరుడిగా పేరు పొందాడు ముఖేష్ అంబానీ. పట్టిందల్లా బంగారం మాదిరిగా.. అతడు చేస్తున్న ప్రతి వ్యాపారం కనక వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన అతడు.. విభిన్న రంగాలలోకి అడుగుపెడుతున్నాడు. అందులోనూ విజయం సాధించి.. తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నాడు. ఆయిల్ రిఫైనరీ, పెట్రోల్ కెమికల్స్, రిటైల్, టెలికాం, మీడియా, డిజిటల్ బ్రాడ్ కాస్టింగ్ విభాగాలలో సంచలన విజయాలు సాధించిన ముఖేష్ అంబానీ.. మామిడిపండ్ల వ్యాపారం లోకి కూడా ప్రవేశించారు. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. ఇది నూటికి వెయ్యి శాతం నిజం. ఎందుకంటే ముఖేష్ అంబానీ శూన్యంలోనూ అవకాశాలను సృష్టించగలరు. ఆ అవకాశాలను తనకు అనుకూలంగా మలచుకోగలరు. వాటి ద్వారా కోట్లను సంపాదించగలరు. అందులోనూ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించగలరు. అందువల్లే భారత కార్పొరేట్ వ్యవస్థలో అతిపెద్ద దిగ్గజ వ్యాపారిగా ముకేశ్ అంబానీ కొనసాగుతున్నారు.
Also Read: ప్రభాస్ సినిమాల మీద క్లారిటీ వచ్చిందా..? సలార్2, కల్కి 2, స్పిరిట్ వీటిలో ఏది ముందు వస్తుంది..?
జాంనగర్ లో 600 ఎకరాలు..
రిలయన్స్ కంపెనీకి జాంనగర్ ఆయిల్ రిఫైనరీ వెన్నెముక. అయితే ఈ రిఫైనరీ ఏర్పాటు చేయడం ద్వారా కాలుష్యం ఏర్పడుతోందని 1997లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలదిగాయి. నాడు కాలుష్య నియంత్రణ బోర్డు రిలయన్స్ కంపెనీకి నోటీసులు కూడా అందించింది. ఆ తర్వాత ఒక ఆలోచన చేసిన ముఖేష్ అంబానీ.. ఈ సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కారాన్ని కనుగొన్నారు. జాంనగర్ ఆయిల్ రిఫైనరీ ప్రాంతంలో 600 ఎకరాలు తన తండ్రి ధీరుభాయ్ అంబానీ పేరు మీద కొనుగోలు చేశారు. అది పూర్తిగా చవుడు నేల. ఎటువంటి పంటలు కూడా సాగు చేయడానికి అవకాశం లేని నేల. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో లవణాలను పూర్తిస్థాయిలో తగ్గించి.. పంటలకు యోగ్యంగా మార్చేశారు. ఆ 600 ఎకరాలలో మామిడి మొక్కలు నాటారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1.3 లక్షల మొక్కలు నాటారు. ఆ మొక్కల ద్వారా ప్రతి ఏడాది 600 టన్నుల మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తున్నారు. వీటిని విదేశాలకు ఎగమతి చేస్తున్నారు. తద్వారా ఆసియాలోనే అతిపెద్ద మామిడి ఎగుమతి దారుగా ముకేశ్ అంబానీ అవతరించారు.
తండ్రి పేరు మీద..
ఈ 600 ఎకరాల మామిడి తోటకు “ధీరుభాయ్ అంబానీ లక్కీ భాగ్ ఆమ్రాలి” అని పేరు పెట్టడం ముఖేష్ అంబానీ. ఈ 600 ఎకరాలలో 200 రకాల మామిడి చెట్లను సాగు చేస్తున్నారు.. ఇందులో కేసరి, ఆల్ఫాన్సో, రత్న, సింధూరి, నీలం, ఆమ్రపాలి వంటి దేశీయ రకాలు మాత్రమే కాకుండా.. అమెరికాకు చెందిన టామీ అట్కిన్సన్, కెంట్, హిజ్రాలు దేశానికి చెందిన లిల్లీ, మాయ, కీట్ రకాలను సాగు చేస్తున్నారు. కేవలం మామిడి పండ్లను ఎగుమతి చేయడం మాత్రమే కాకుండా.. జాంనగర్ సమీప ప్రాంతంలోని రైతులకు ప్రతి ఏడాది లక్ష వరకు మామిడి మొక్కలను రిలయన్స్ కంపెనీ ఉచితంగా అందిస్తోంది. 600 ఎకరాలలో మామిడి తోటలను సాగు చేయడం ద్వారా ఈ ప్రాంతంలో కాలుష్యం పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టింది. అంతేకాకుండా ఈ ప్రాంతాలలో సాగుకు యోగ్యం కానీ భూములను అధునాతన పద్ధతుల్లో రిలయన్స్ కంపెనీ.. పంటల సాగుకు పనికి వచ్చే విధంగా చేస్తోంది. దీనికి గాని రైతులకు వాటర్ హార్వెస్టింగ్ యూనిట్, డీ సాలిటైజేషన్ ప్లాంట్ ను నెలకొల్పింది. తద్వారా ఇక్కడ రైతులు పంటలు సాగు చేస్తున్నారు.. ఇక ఈ మామిడి పండ్ల వ్యాపారం ద్వారా ముకేశ్ అంబానీ ప్రతి ఏడాది వందల కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.