spot_img
Homeవింతలు-విశేషాలుSnakes Revenge Myth: పాములు పగపడతాయా.. ఇతడికి ఎదురైన అనుభవం ప్రాణాల మీదికి తెచ్చింది..

Snakes Revenge Myth: పాములు పగపడతాయా.. ఇతడికి ఎదురైన అనుభవం ప్రాణాల మీదికి తెచ్చింది..

Snakes Revenge Myth: పాములు పగబడతాయని మన పెద్దలు అంటుంటారు. అందువల్లే పామును ప్రమాదవశాత్తు తొక్కితే వెంటనే మిరియాలు మంత్రించి ఆ ప్రాంతాల్లో చల్లుతారు. పాము పగబట్టి.. కాటు వేయకుండా ఉండడానికి ఇసుకను చల్లుతారు. అంతకీ అనుమానం తీరకపోతే శివాలయానికి తీసుకెళ్లి.. నాగు పాము పుట్టలో పాలు పోయిస్తారు. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు.

పాము పగబడుతుందనే దానిపై ఇంతవరకు శాస్త్రీయ నిరూపణలు జరగలేదు. కాకపోతే పామును ఎవరైనా ప్రమాదవశాత్తు తొక్కితే వెంటనే భయపడిపోతుంటారు. ఇద్దరు చెప్పినట్టుగా మిరియాల చల్లుతారు. గుడులకు వెళ్లి పూజలు చేస్తారు. కొన్ని సందర్భాలలో మొలతాడుకు మంత్రించిన నిమ్మకాయ కట్టుకుంటారు. దానివల్ల పాము మళ్ళీ వెంటపడదని.. కాటు వేయడానికి ప్రయత్నించదని నమ్ముతుంటారు.

వాస్తవానికి పాములు అనేవి పగపడతాయా.. లేదా అనే విషయంపై ఇంతవరకు క్లారిటీ లేదు. జన విజ్ఞాన వేదిక వాళ్ళు మాత్రం పాములు పగబట్టవు అని చెబుతుంటారు. అయితే ఏపీలోని జంగారెడ్డిగూడెంలో మాత్రం ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది.. ఏలూరులోని కొయ్యలగూడెం ప్రాంతానికి చెందిన రైతు శివ శ్రీనివాస్ అనే వ్యక్తి పాముకాటుకు గురయ్యాడు. అతడిని కుటుంబ సభ్యులు జంగారెడ్డిగూడెంలోని ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ ఆదోడు చికిత్స పొందుతుండగా.. ఆస్పత్రి గుమ్మం వద్ద తాచుపాము కనిపించింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే దానిని చంపేశారు.

శివ శ్రీనివాస్ ను కాటు వేసిన పాము మళ్లీ ఆసుపత్రికి వచ్చి ఉంటుందని.. అది కచ్చితంగా అతని పగ పట్టిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వల్లే అతడు చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్దకు వచ్చిందని.. గుమ్మం ఎదురుగా కాపలా కాసిందని.. అంటున్నారు. అయితే కరిచిన పాము తనకు అతగా గుర్తుకు లేదని.. ఇప్పుడు వచ్చిన పామును చూసేందుకు తనకు అవకాశం రాలేదని.. శివ శ్రీనివాస్ చెబుతున్నాడు. ఆ పామును చంపిన సిబ్బంది సమీపంలో కాల్చేశారు.

ఇటీవల కాలంలో ఈ ప్రాంతీయ ఆసుపత్రికి పాములు అంతగా రాలేదు.. ఇక్కడ పరిసరాలను సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతున్నారు. అయితే ఆకస్మాత్తుగా పాము రావడం.. అది కూడా శివ శ్రీనివాస్ చికిత్స పొందుతున్న గది గుమ్మం ముందు కనిపించడం.. అనేకరకాల అనుమానాలకు తావిస్తోందని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. కచ్చితంగా పాము పగబట్టి ఇక్కడదాకా వచ్చిందని.. అతని మరోసారి కాటు వేయడానికి సిద్ధమైందని ఆసుపత్రి సిబ్బంది అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper