Homeటాప్ స్టోరీస్Smartphones: 20వేల లోపు.. ఉత్తమ 5జీ ఫోన్లు ఇవి.. ఫీచర్లు.. బ్రాండ్లు.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం..

Smartphones: 20వేల లోపు.. ఉత్తమ 5జీ ఫోన్లు ఇవి.. ఫీచర్లు.. బ్రాండ్లు.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం..

Smartphones: ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు బాగోలేవు. యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో స్మార్ట్ఫోన్ తయారీ కి వాడే వస్తువుల ధరలు పెరిగిపోయాయి. దీంతో ఫోన్ల ధరలు కూడా ఆకాశంలో విహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు మాత్రం తమ కస్టమర్ల నమ్మకాన్ని కాపాడుకునేందుకు తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లను తయారుచేస్తున్నాయి. చాలామందికి మనసు ఒప్పదు మార్కెట్లోకి రాగానే కొంతమంది కస్టమర్లు ప్రీమియం ఫోన్లు కొంటారు కానీ.. నేటికీ మార్కెట్లో బడ్జెట్ ఫోన్లకే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫోన్ […]

Smartphones: ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు బాగోలేవు. యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో స్మార్ట్ఫోన్ తయారీ కి వాడే వస్తువుల ధరలు పెరిగిపోయాయి. దీంతో ఫోన్ల ధరలు కూడా ఆకాశంలో విహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు మాత్రం తమ కస్టమర్ల నమ్మకాన్ని కాపాడుకునేందుకు తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లను తయారుచేస్తున్నాయి.

చాలామందికి మనసు ఒప్పదు

మార్కెట్లోకి రాగానే కొంతమంది కస్టమర్లు ప్రీమియం ఫోన్లు కొంటారు కానీ.. నేటికీ మార్కెట్లో బడ్జెట్ ఫోన్లకే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫోన్ మీద 20,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి చాలామందికి మనసు ఒప్పదు. అయితే మెజారిటీ కస్టమర్ల తీరు ఇదే విధంగా ఉన్న నేపథ్యంలో కొన్ని కంపెనీలు 20,000 లోపు బ్రహ్మాండమైన ఫీచర్లతో.. 5జి టెక్నాలజీని సపోర్ట్ చేసే స్థాయిలో ఫోన్లను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో అందులో ఉన్న ఫీచర్లు.. బ్యాటరీ.. కెమెరా.. పనితీరు.. మన అవసరాలు ఆ ఫోన్లు ఎలా తీర్చగలుగుతాయి.. అనే అంశాలపై ప్రత్యేకమైన కథనం.

ప్రీమియం ఫీచర్లు

20వేల లోపు ధరతో ప్రీమియం ఫీచర్లు అందించే బ్రాండ్లు చాలానే ఉన్నాయి. ఇందులో AMOLED display, 120 Hz నుంచి 144 Hz వరకు రీ ఫ్రెష్ రేట్ ను అందిస్తాయి. ఇందులో శక్తివంతమైన బ్యాటరీలు ఉన్నాయి. భారీ ప్రాసెసర్లు కూడా ఉన్నాయి. CMF phone to Pro, Motorola Moto G96 5G, Realme P4 X 5G, iQOO Z 10 R 5 G, poco X7 5G వంటి ఫోన్లు కేవలం 20 వేల లోపు బడ్జెట్ లోనే వస్తున్నాయి. ఇందులో ఉన్న ఫీచర్లు.. ఇతర సౌలభ్యాలను చూసుకొని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

CMS phone 2 Pro

ఈ ఫోన్ 16, 999 ధరలో లభిస్తుంది. ఇందులో 6.77 అంగుళాల full HD Plus+ AMOLED display, 120 Hz refresh rate ఇందులో ఉన్నాయి.. డిజైన్ చాలా స్లిమ్ గా ఉంది. ప్రత్యేకమైన రియర్ ప్యానెల్ ఇందులో ఉంది.. అందువల్లే ఈ ఫోన్ అత్యంత ఆకర్షణంగా కనిపిస్తుంది.. మీడియా టెక్ డైమన్ సిటీ 7300 ప్రో ప్రాసెసర్ కు 8gb రామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. మల్టీ టాస్కింగ్.. రోజువారి పనులకు ఇది సరిపోతుంది. 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా.. 50 మెగాపిక్సల్ టెలిఫోటో.. ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాలు ఇందులో ఉన్నాయి. మొత్తంగా త్రిబుల్ సెటప్ ఇందులో కనిపిస్తుంది. ముందు భాగంలో 16 మెగా ఫిక్సల్ కెమెరా.. 5000mAh బ్యాటరీ ఇందులో ఉన్నాయి.

Motorola Moto G56 5G

ఇందులో 6. 67 అంగుళాల full HD + covered pOLED display, 144 Hz రీ ఫ్రెష్ రేట్ ఇందులో లభిస్తాయి. కర్వ్ డిజైన్ కారణంగా ఈ ఫోన్ ప్రీమియం లుక్ లో కనిపిస్తుంది. Snapdragon 7s Gen 2 ప్రాసెసర్ 8GB RAM, 128 GB storage ఇందులో ఉన్నాయి.. ఈ ఫోన్ కు ip68 రేటింగ్ ఉంది. 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా.. ఏటి మెగాపిక్సల్ అల్ట్రావైడ్ కెమెరా.. 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా..5,500 mAh బ్యాటరీ ఇందులో ఉన్నాయి. ఇది సాధారణమైన వినియోగం నుంచి భారీగా వాడుకునే స్థాయి వరకు ఒకరోజు బ్యాకప్ ఇస్తుంది. ఇందులో ప్రధానంగా క్లీన్ ఆండ్రాయిడ్ ఇంటర్ ఫేస్ ఉండడం విశేషం.

Realme P4x 5G

ఈ మోడల్ ధర 18,999 వరకు ఉంది.. ఇందులో 6.72 అంగుళాల డిస్ ప్లే, 144 Hz రీ ఫ్రెష్ రేట్ ఇందులో లభిస్తుంది.. MediaTek dimencity 7400 ultra processor, 6GB RAM, 128 GB స్టోరేజ్ తో వస్తుంది. దీని ద్వారా రోజు వారి పనులు.. సోషల్ మీడియాతో పాటు.. వీడియో స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. గేమింగ్ కు అత్యంత అనుకూలంగా ఉంటుంది.. ఇందులో 7000 mAh బ్యాటరీ ఉంటుంది.. తక్కువ స్థాయిలో ఫోన్ వాడితే రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాక్అప్ పొందొచ్చు.. కెమెరా విషయానికొస్తే 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా..2 మెగాపిక్సల్ సెకండరీ సెన్సార్.. ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా.. బ్యాటరీ పని తీరు కూడా అత్యంత దృఢంగా ఉంటుంది. అయితే ఈ ఫోన్లో కెమెరా ఆశించిన స్థాయిలో ఉంటదని విశ్లేషకులు రివ్యూ ఇచ్చారు.

IQ 00 Z10 R

ఈ ఫోన్ 18,729 ధరలో లభిస్తుంది . ఇందులో 5G లో 6.77 అంగుళాల full HD + AMOLED screen, 120 Hz refresh rate ఇందులో ఉన్నాయి. స్లిమ్ డిజైన్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఐపీ 69 రేటింగ్ దీనికి అదనపు బలం.. MediaTek dimencity 7400 ప్రాసెసర్ ఇందులో ఉంది. 8GB RAM, 128 GB storage ఈ ఫోన్లో లభిస్తుంది. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా, ముందు భాగంలో 32 మెగాపిక్సల్ కెమెరాలు ఉన్నాయి. 5,700 mAh బ్యాటరీ ఇందులో ఉంటుంది. కెమెరా క్వాలిటీ ఆశించిన స్థాయిలో లేదని ఇప్పటికే విశ్లేషకులు రివ్యూ ఇచ్చారు. గేమింగ్ వాడుతూ ఉంటే ఫోన్ వేడెక్కే ప్రమాదం ఉంది. అది ఫోన్ పనితీరును ప్రభావితం చేసే అవకాశం ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper