Mahindra XUV700 vs Tata Safari : భారతీయ కారు మార్కెట్ లో మహీంద్రా XUV 700తో సరికొత్త నమూనాను ఆవిష్కరించింది.. ఇది సంచలనాత్మక ఉత్పత్తి అని మహీంద్రా కంపెనీ చెబుతోంది.. ప్రస్తుతం మన దేశంలో మహీంద్రా, టాటా కంపెనీలు ప్రధాన కార్ల మార్కెట్లో పోటీదారులుగా ఉన్నాయి. ఈ రెండు కంపెనీలు XUV, Safari వేరియంట్లలో వాహనాలను మిడ్ సైజ్ 7 సీటర్ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్) వరకు రూపొందించాయి. ఈ రెండు కంపెనీల మధ్య పోటీ ఉండగా.. మధ్యలోకి MG హెక్టర్ ప్లస్ కూడా వచ్చింది.. ఆ తర్వాత పోటీని తట్టుకునేందుకు టాటా కంపెనీ తన సఫారీ వేరియంట్ (6 – 7 సీటింగ్ కెపాసిటీతో రూపొందించే) వాహనాలకు మరిన్ని సౌకర్యాలు జత చేయడం మొదలుపెట్టింది.. ఇక మహీంద్రా XUV 700 బేస్ MX వేరియంట్ 5 సీటర్ వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు అది 7 సీటర్ లో లభిస్తోంది.. మార్కెట్లో గుత్తాధిపత్యాన్ని సాధించేందుకు మహీంద్రా ఈ కొత్త ఎత్తుగడ వేసింది.
XUV 700 వేరియంట్ లో 7 సీటర్ కెపాసిటీ వాహనాలను మార్కెట్లోకి ప్రవేశపెట్టడాన్ని గేమ్ చేంజర్ లాగా మహీంద్రా అభివర్ణిస్తోంది. దీని ధరను 18.83 లక్షలు (ముంబై ఆన్ రోడ్) గా నిర్ణయించింది. అయితే టాటా సఫారీ 7 సీటర్ వేరియంట్ ధర 19.58 లక్షల నుంచి (ముంబై ఆన్ రోడ్ ధర) ప్రారంభమవుతుంది. ఇలా ధర తగ్గించి విక్రయించడం వల్ల తమ కంపెనీ కార్ల విక్రయాలు పెరుగుతాయని మహేంద్ర భావిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఈ కొత్త వేరియంట్ ను మహీంద్రా కంపెనీ డీజిల్ మాన్యువల్ రూపంలో మాత్రమే విడుదల చేసింది. MX 5 seater వేరియంట్ కు, MX 7 seater వేరియంట్ కు కేవలం 40 వేల ధర మాత్రమే తేడా ఉంది.. XUV 700 లో కొత్త MX 7 – సీటర్ ధర సుమారు 18.83 లక్షలు (ముంబై ఆన్ రోడ్). AX 3 -7 సీటర్ వేరియంట్ తో పోలిస్తే ఇది దాదాపు 3.5 లక్షలు తక్కువ.
ఫీచర్లు ఏంటంటే
ఈ కొత్త వాహనం 153 bhp, 360 Nm తో గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేసే 2.2 డీజిల్ ఇంజన్ కలిగి ఉంది.. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆధారంగా పనిచేస్తుంది.. ఇందులో 8 అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టం, అనలాగ్ డయల్స్, ఏడు అంగుళాల MID, ఆండ్రాయిడ్ ఆటో, పవర్డ్ ORVM లు, టిల్డ్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, ఫాలో – మీ – హెడ్ ల్యాంప్ ల వంటివి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఇవి మాత్రమే కాక SUV కప్ హోల్డర్లు, USB చార్జింగ్ పోర్ట్, మూడు వరుసలలోAC వెంట్ లు ఉన్నాయి.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Mahindra xuv700 is rs 3 lakh cheaper than tata safari
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com