Mahindra XUV700: భారత్ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యధిక కార్లను విక్రయించే కంపెనీలలో మహీంద్రా ఒకటి. ఇప్పుడు ఈ వాహన తయారీ సంస్థకు చెందిన XUV700 కారు భారతదేశంలో 3 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది. ఆగస్టు 2021లో ప్రారంభమైన ఈ కారు కంపెనీకి అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఒకటిగా నిలిచింది. అద్భుతమైన ఫీచర్లు, పవర్ ఫుల్ ఇంజిన్‌తో ఈ కారు ఫ్యామిలీలకు పర్ఫెక్ట్ అని నిరూపించుకుంది. మహీంద్రా XUV700 రెండు ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. ఒకటి 2.0-లీటర్ టర్బో-పెట్రోల్, మరొకటి 2.2-లీటర్ టర్బో-డీజిల్. రెండు ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఇది ఐదు, ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. ఇది పెద్ద ఫ్యామిలీ, స్నేహితులతో కలిసి ప్రయాణించడానికి ఎంతో అనుకూలం. కొన్ని వేరియంట్లలో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా లభిస్తుంది.
Also Read: మార్కెట్లోకి హోండా షైన్ ఎలక్ట్రిక్ మోడల్.. సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం
భారత మార్కెట్లో XUV700 ప్రారంభ ధర రూ.14.49 లక్షల నుండి రూ.25.89 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఫీచర్ల విషయానికి వస్తే XUV700 ఫ్యామిలీ ప్రయాణాలకు కావాల్సిన అనేక అడ్వాన్సుడ్ ఫెసిలిటీలను అందిస్తుంది. ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యూయల్ 10.25-అంగుళాల డిస్‌ప్లే సెటప్ ఉంది. ఇది ఎంటర్టైన్మెంట్, ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. పనోరమిక్ సన్‌రూఫ్ కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు బయటి అందాలను ఆస్వాదించడానికి చాలా బాగుంటుంది.
డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వల్ల కారులోని ప్రయాణీకులు తమకు నచ్చిన టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు సుదూర ప్రయాణాల్లో సౌకర్యాన్ని పెంచుతాయి. వైర్‌లెస్ ఛార్జింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉంటాయి. ప్రయాణీకుల సేఫ్టీ కోసం ఈ కారుకు గ్లోబల్ ఎన్‌క్యాప్ నుండి ఫైవ్-స్టార్ రేటింగ్ లభించింది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్‌తో కూడిన లెవెల్ 2 ADAS ఫీచర్లు సురక్షితమైన డ్రైవింగ్‌ను అందిస్తాయి.
Also Read: బిజినెస్‌లో లీడ్స్ రావాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి.. లాభాలు మీవే!
మహీంద్రా ప్రస్తుతం XUV700 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌పై పనిచేస్తోంది. దీనిని టెస్టింగ్ చేస్తున్నప్పుడు గుర్తించారు. రాబోయే నెలల్లో ఇది మార్కెట్‌లోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ అప్‌డేటెడ్ మోడల్‌లో కాస్మెటిక్ మార్పులు, కొత్త టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లు ఉండవచ్చు. ఈ కారు భారత మార్కెట్లో సఫారి, హెక్టర్ వంటి కార్లతో పోటీ పడనుంది. అంతేకాకుండా, వాహన తయారీ సంస్థ కొత్త బంపర్లు, ఎస్‌యూవీ వెడల్పు అంతటా విస్తరించి ఉన్న కొత్త ఎల్‌ఈడీ లైట్‌బార్ వంటి చిన్న చిన్న అప్‌డేట్‌లను కూడా ఇవ్వవచ్చు, ఇది కారుకు మరింత కొత్త లుక్ ఇస్తుంది.