Homeబిజినెస్Become a Millionaire : కోటీశ్వరులు కావాలని ఉందా? మీలో ఇదొక్కటి ఉంటే చాలు..

Become a Millionaire : కోటీశ్వరులు కావాలని ఉందా? మీలో ఇదొక్కటి ఉంటే చాలు..

Become a Millionaire : జీవితంలో డబ్బు సంపాదించాలని చాలామందికి ఉంటుంది. అయితే తమకు పెద్దగా తెలివి లేదు.. సరైన వనరులు లేవు.. మేం పెద్దగా చదువుకోలేదు.. అని చాలామంది అంటూ ఉంటారు. కొన్ని చరిత్రలను చూస్తే వేలిముద్ర వేసేవారు సైతం కోటీశ్వరులు అయ్యారు. ఎలాంటి అవకాశం లేని వారు సైతం అత్యధిక డబ్బులు సంపాదించారు. వీళ్లు ఇలా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రత్యేకంగా డిగ్రీలు ఏమి సంపాదించలేదు.. కానీ వీరికి కామన్ సెన్స్ అనేది ఉందని కొందరు […]

Become a Millionaire : జీవితంలో డబ్బు సంపాదించాలని చాలామందికి ఉంటుంది. అయితే తమకు పెద్దగా తెలివి లేదు.. సరైన వనరులు లేవు.. మేం పెద్దగా చదువుకోలేదు.. అని చాలామంది అంటూ ఉంటారు. కొన్ని చరిత్రలను చూస్తే వేలిముద్ర వేసేవారు సైతం కోటీశ్వరులు అయ్యారు. ఎలాంటి అవకాశం లేని వారు సైతం అత్యధిక డబ్బులు సంపాదించారు. వీళ్లు ఇలా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రత్యేకంగా డిగ్రీలు ఏమి సంపాదించలేదు.. కానీ వీరికి కామన్ సెన్స్ అనేది ఉందని కొందరు ఆర్థిక నిపుణులు అంటున్నారు. కామన్ సెన్స్ అంటే ఏమిటి? డబ్బు సంపాదించడానికి ఎలాంటి ప్రణాళికలు ఉండాలి?

కామన్ సెన్స్ అంటే వాస్తవ పరిస్థితుల్లో జీవించడం. ప్రస్తుత కాలంలో చాలామంది ఆదాయాన్ని ఎక్కువగా ఆర్జిస్తున్నారు.. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేవారు కోట్లల్లో ఆదాయాన్ని పొందుతున్నారు. అయినా కూడా వారు అప్పుల్లో మునుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కొందరు కోటీశ్వరులు సైతం కొన్నాళ్ల తర్వాత దివాలా తీసినట్లు వినిపిస్తుంది. ఇక మిడిల్ క్లాస్ పీపుల్స్ అయితే ఎంత జీతం పెరిగినా ఖర్చులు సరిపోవడం లేదని బాధపడుతూ ఉంటారు.

వాస్తవానికి ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. కానీ ఇక్కడే ప్రతి వ్యక్తి కామన్ సెన్స్ ను అలవర్చుకోవాలి. అంటే వచ్చిన ఆదాయం ఎంత? ఎంత ఖర్చు చేయాలి? ఏ వస్తువులు కొనాలి? పెరిగిన డబ్బుతో ఏం చేయాలి? అనే విషయాలపై ముందుగా ప్రణాళిక వేసుకోవాలి.

ఉద్యోగం చేసే వారికి వెయ్యి రూపాయల ఆదాయం పెరగగానే ఆ పెరిగిన మొత్తంతో జల్సాలు చేసేవారు చాలామంది ఉన్నారు. అంతేకాకుండా ఆ పెరిగిన వెయ్యితో కొత్త వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. అంతేకాకుండా కొందరు జీతం పెరిగింది అన్న హోదాతో లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేయాలని చూస్తారు. ఇలా చేయడం వల్ల కొన్నాళ్లపాటు జీవితం బాగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత మళ్లీ యధాస్థితికి వస్తారు. అప్పుడు డబ్బు సంపాదించాలని ఎక్కువగా అరట పడుతుంటారు.. ఈ సమయంలో ఆరోగ్యం కూడా పాడే అవకాశం ఉంటుంది.

అందువల్ల వచ్చిన ఆదాయాన్ని ముందుగా సేవింగ్స్, ఎమర్జెన్సీ ఫండ్, ఇన్సూరెన్స్ వంటి వాటికి కేటాయించాలి. మిగిలిన దాంట్లో అత్యవసర ఖర్చులకు కేటాయించుకొని.. ఆ తర్వాత మిగిలిన డబ్బుతో సరదా కోసం ఖర్చు చేయాలి. ఈ సరదా కూడా తీర్చుకోవద్దని కాదు.. వచ్చిన మొత్తం లోనే సేవింగ్స్ లో తగ్గించి సరదాగా కూడా అవసరమైనంతవరకు ఖర్చు చేయాలి. ఉదాహరణకు పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్లడం వంటి వాటికీ ఖర్చు చేయవచ్చు.

అయితే చాలామంది పెరిగిన జీతంతో కొత్త వస్తువులు కొనుగోలు చేయాలని చూస్తారు. అలా కాకుండా ఎంత జీతం పెరిగితే అంత సేవింగ్స్ పెరిగే ప్రణాళిక వేసుకోవాలి. అలా చేయడం వల్లే భవిష్యత్తులో డబ్బు కొరత ఉండకుండా ఉంటుంది. అంతేకాకుండా స్థాయికి మించిన ఖర్చులు చేయడం.. ఇతరులతో పోల్చుకోవడం.. ఆదాయం తక్కువగా ఉన్నా కూడా.. ధనవంతులతో సమానంగా ఉండాలని అనుకోవడం వంటివి మాయ అని గ్రహించాలి. వాస్తవాలను గ్రహించి అవసరం ఉన్నంత మేరకే ఖర్చులు చేస్తూ ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. అప్పుడే జీవితం బాగుండే అవకాశం ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper