Homeబిజినెస్home buying tips: EMI లో ఇల్లు కొంటె ఇరుక్కుపోతారు.. ఈజీగా కొని మార్గం ఇదే..

home buying tips: EMI లో ఇల్లు కొంటె ఇరుక్కుపోతారు.. ఈజీగా కొని మార్గం ఇదే..

home buying tips: చాలామంది కొత్త ఉద్యోగం రాగానే సొంత ఇల్లు కొనాలని ఎదురు చూస్తారు. ఎక్కడైనా ఫ్లాట్ నచ్చగానే వెంటనే కొనేస్తారు. చేతిలో కొంత డబ్బు ఉన్నా కూడా.. భారీగా లోన్ తీసుకొని ఈఎంఐ ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇటీవల కాలంలో చూస్తే చాలా మంది ఈఎంఐ తో తీవ్ర అవస్థలు పడుతున్నారు.. వచ్చిన జీతం ఎంత ఈఎంఐ కె చెల్లిస్తూ మిగతా ఖర్చులు, సేవింగ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు నిపుణులు తెలుపుతున్న […]

home buying tips: చాలామంది కొత్త ఉద్యోగం రాగానే సొంత ఇల్లు కొనాలని ఎదురు చూస్తారు. ఎక్కడైనా ఫ్లాట్ నచ్చగానే వెంటనే కొనేస్తారు. చేతిలో కొంత డబ్బు ఉన్నా కూడా.. భారీగా లోన్ తీసుకొని ఈఎంఐ ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇటీవల కాలంలో చూస్తే చాలా మంది ఈఎంఐ తో తీవ్ర అవస్థలు పడుతున్నారు.. వచ్చిన జీతం ఎంత ఈఎంఐ కె చెల్లిస్తూ మిగతా ఖర్చులు, సేవింగ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు నిపుణులు తెలుపుతున్న ప్రకారం ఇల్లు కొనేవారు ఇలా ఈఎంఐలో ఇరుక్కుపోకుండా.. ఈజీగా కొనే మార్గం చెబుతున్నారు.. అదేంటో చూద్దాం..

ఒక ఉద్యోగికి నెలకు 1,50,000 జీతం వస్తుందని అనుకుందాం. ఇతడు కొత్త ఉద్యోగంలోకి రాగానే ఒక కోటి రూపాయలతో ఇల్లు కొనుగోలు చేశాడు. అయితే దీనిపై రూ. 70 వేల ఈఎంఐ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా 20 నుంచి 20 సంవత్సరాల పాటు ఈఎంఐ చెల్లించేందుకు ప్లాన్ చేసుకున్నాడు. అయితే కొత్త ఇల్లు కొన్న తర్వాత కొన్ని రోజులకు అదనంగా ఖర్చులు పెరిగాయి. అంటే కారు కొనాలని అనిపించడం.. ఆ తర్వాత ఇంటిని తీర్చిదిద్దడానికి ఫర్నిచర్ కొనుగోలు.. వంటి వాటికి కూడా ఈఎంఐ లను ఏర్పాటు చేసుకున్నాడు. మరి కొన్ని సంవత్సరాలు తర్వాత వివాహమై ఇతర ఖర్చులు పెరిగాయి.. ఇలా తనకు వచ్చే జీవితంలో ఎక్కువ శాతం ఈఎంఐ వలలో పడిపోయి.. తీవ్ర అవస్థలకు గురయ్యాడు.

చాలామంది ఇలా కొత్త ఉద్యోగం రాగానే వెంటనే ఈఎంఐని ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత ఆవేదన చెందుతున్నారు. అయితే కొందరు నిపుణులు తెలుపుతున్న ప్రకారం కొత్తగా ఉద్యోగం చేరేవారు కనీసం 25 నుంచి 30 ఏళ్ల లోపు వయసు వారై ఉంటారు. ఇలాంటివారు వెంటనే ఈఎంఐ తో ఇల్లు కొనుగోలు చేయకుండా.. కనీసం 10 సంవత్సరాల పాటు సేవింగ్స్ చేయాలి. ఈ సేవింగ్స్ ఉదాహరణకు నెలకు రూ.50,000తో sip చేయాలి. ఇలా 10 సంవత్సరాల తర్వాత కోటి వరకు రిటర్న్స్ ఉంటాయి. అయితే అప్పటివరకు ఇల్లు ధరలు పెరగవచ్చు. కానీ వాటికంటే ఈ సి ప్ లో వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా చేతిలో ఉన్న డబ్బుతో సొంత ఇల్లును కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇతర ఖర్చులు మిగతా అవసరాలను కూడా తీర్చుకునే ఛాన్స్ ఉంటుంది.

కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు ఈఎంఐ ఏర్పాటు చేసుకుంటే.. ఉద్యోగంలో సమస్యలు వస్తే మరింత మానసికంగా కుంగిపోతారు. అలాకాకుండా తమ వ్యక్తిగత గ్రోత్ ను పెంచుకోవడానికి ఇతర కంపెనీలు లేదా సంస్థలో చేరడానికి అవకాశం ఉండదు. అందువల్ల ఈఎంఐ లో ఇల్లు కొనకుండా.. కొన్ని రోజులపాటు సేవింగ్స్ చేసి ఆ తర్వాత ఫ్లాట్ గురించి ఆలోచించడం మంచిది అని నిపుణులు తెలుపుతున్నారు..

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper