DMart: ఒకప్పుడు బిగ్ బజార్ ఉండేది. ఆ తర్వాత రకరకాల సంస్థలు వచ్చాయి. రిటైల్ రంగంలో సరికొత్త అనుభూతిని వినియోగదారులకు పరిచయం చేశాయి. ఆ తర్వాత బిగ్ బజార్ మూత పడింది. కొంతకాలానికి బిగ్ బజార్ కు మించిన స్థాయిలో డీమార్ట్ వచ్చేసింది.
గతంలో బిగ్ బజార్ టైర్ వన్ సిటీలకు మాత్రమే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు డీమార్ట్ టైర్ వన్, టైర్ టు, టైర్ త్రీ సిటీలకు విస్తరించింది. మొత్తంగా చూస్తే రిటైల్ వ్యాపారంలో తిరుగులేని స్థాయిని అందుకుంది. ఇంకా ఇంకా దూసుకుపోతోంది. తక్కువ ధరలో వస్తువులు అందించడం.. మార్కెట్లో మిగతా సంస్థల కంటే నాణ్యతను కొనసాగించడం.. వంటి వాటి ద్వారా డిమార్ట్ సగటు భారతీయుల జీవితంలో ఒక భాగం అయిపోయింది. చాలావరకు సగటు గృహిణులు వస్తువులను కొనుగోలు చేయడానికి డీమార్ట్ వెళ్తున్నారంటే.. అది ఏ స్థాయిలో ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు.
డీమార్ట్ లో సరుకుల ధరలు తక్కువగా ఉంటాయని అందరు అనుకుంటారు. అయితే అందులో కూడా మోసం జరుగుతుందని ఒక వీడియో ద్వారా ఇప్పుడు బయటకు వచ్చింది. డి మార్ట్ లో డిస్ప్లే ప్రైస్ కంటే కూడా.. బిల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉందని ఒక మహిళ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరాన్ని చెందిన ఒక మహిళ కిలో చక్కెర కొనుగోలు చేసింది. ఆఫర్లో భాగంగా అది 60.50 రూపాయలు ఉంది. బిల్లింగ్ లో మాత్రం 67 రూపాయలు వసూలు చేశారు. దీంతో అనుమానం వచ్చిన ఆమె అక్కడ సిబ్బందిని నిలదీశారు.. ఇలా ఎంతమందిని మోసం చేస్తారంటూ ఆమె అక్కడ సిబ్బంది ప్రశ్నించింది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం కలిగించడంతో.. చాలామంది తమకు ఇటువంటి అనుభవం ఎదురయిందని చెప్పడం మొదలుపెట్టారు.
ఇటీవల కాలంలో డిమార్ట్ లో ఎక్స్పైరీ సరుకులను కొత్త ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారని ఆరోపణలు వినిపించాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపించాయి. డిమార్ట్ లో జరుగుతున్న మోసం గురించి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వీడియోలు చేశారు. సోషల్ మీడియాలో ఇంత జరుగుతున్నప్పటికీ ఇంతవరకు డిమార్ట్ యాజమాన్యం స్పందించలేదు. దీనిని బట్టి జరుగుతున్నది మొత్తం వాస్తవమేనని అర్థమవుతోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.”తక్కువ ధరకు సరుకులు వస్తున్నాయని మురిసిపోకండి. అసలు వాస్తవం ఇది. ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి. ప్రచారం మాయలో పడి డబ్బులు పోగొట్టుకోకండి” అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.
DMart Sugar Scam ! pic.twitter.com/Jpr9w7jovH
— Indians (@onindians_) August 25, 2026