Homeబిజినెస్Maruti Brezza: ఈ కారును ఇప్పుడే కొనండి.. లేకుంటే చాలా నష్టపోతారు..

Maruti Brezza: ఈ కారును ఇప్పుడే కొనండి.. లేకుంటే చాలా నష్టపోతారు..

Maruti Brezza: భారత కార్ల మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ SUVలలో Maruti Suzuki కంపెనీ నుంచి ఆకట్టుకునే కార్లు మార్కెట్లోకి వస్తుంటాయి. అయితే వీటి అమ్మకాలు సజావుగా ఉన్నప్పటికీ వినియోగదారులను ఆకర్షించడానికి కంపెనీ భారీ ఆఫర్ ను ప్రకటించింది. జూన్ నెలలో మారుతి కంపెనీకి చెందిన Brezzaను కొనుగోలు చేస్తే రూ.55,000 వరకు ప్రయోజనాలను ప్రకటించింది. ఈ ప్రయోజనాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం..

మారుతి బ్రెజ్జా కారుపై మొత్తం రూ.55,000 వరకు ప్రయోజనాలు ఉండనున్నాయి. ఇందులో రూ.25,000 వరకు నేరుగా క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో కారు ఎక్స్‌షోరూమ్ ధరపై నేరుగా తగ్గింపు లభిస్తుంది. ఇప్పటికే ఉన్న కారును ఇచ్చి కొత్త బ్రెజ్జా కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. పాత కారును మార్చుకోవాలనుకునే వారికి ఈ ఆఫర్ ద్వారా అదనపు ఆదా అవుతుంది. పాత, ఉపయోగించలేని వాహనాన్ని ప్రభుత్వ స్క్రాపేజ్ విధానం కింద తొలగించి కొత్త బ్రెజ్జాను కొనుగోలు చేసే వారికి రూ.15,000 వరకు స్క్రాపేజ్ బోనస్ అందిస్తోంది.

కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే అర్హత కలిగిన ఉద్యోగులకు రూ.5,000 వరకు కార్పొరేట్ బెనిఫిట్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆపర్లు కొత్త SUV కొనుగోలు చేయాలనుకునే వారికి, ఇప్పటికే ఉన్న కార్లను మార్చుకునేవారికి మంచి అవకాశం. ఈ ఆఫర్లు బ్రెజ్జా పెట్రోల్ వేరియంట్లతో పాటు CNG వేరియంట్లకూ వర్తిస్తాయి. పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో CNG మోడల్ కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా ఇదే ప్రయోజనాలు అందుబాటులో ఉండటం విశేషం.

ఈ డిస్కౌంట్లు అన్ని వేరియంట్లకు ఒకే విధంగా ఉండకపోవచ్చు. నగరం, డీలర్‌షిప్, స్టాక్ లభ్యత, కొనుగోలు విధానం ఆధారంగా ఆఫర్లలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. అలాగే క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా స్క్రాపేజ్ బోనస్ వంటి కొన్ని ప్రయోజనాలు ఒకేసారి కాకుండా నిబంధనల ప్రకారం వర్తించవచ్చు.

కాంపాక్ట్ SUV కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి జూన్ నెలలో మారుతి బ్రెజ్జాపై ప్రకటించిన ఈ ప్రత్యేక ఆఫర్లు మంచి ఆదా చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ముఖ్యంగా పాత కారును ఎక్స్ఛేంజ్ చేయాలనుకునేవారు లేదా కార్పొరేట్ బెనిఫిట్స్‌కు అర్హులైన వారు మరింత ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు సమీప డీలర్‌ను సంప్రదించి, తమకు వర్తించే ఖచ్చితమైన ఆఫర్లు, నిబంధనలను తెలుసుకోవడం మంచిది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper