Making New Cars: కార్ల కొనుగోలు విషయంలో వినియోగదారులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నారు. గతంలో కంటే ఇప్పుడు ఆటోమోటివ్ కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వీరికి అనుకూలంగా కంపెనీలు సైతం ఆకర్షనీయంగా తయారు చేస్తున్నాయి. కొన్ని కంపెనీల కార్లు డిజైన్ అద్భుతంగా ఉంటాయి. మరికొన్ని కార్లు ఇంజన్ పనితీరు బాగుంటుంది. కానీ కొనుగోలు దారులు ఎక్కువగా డిజైన్ బాగున్న కార్లకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ డిజైన్ అనుకూలంగా రావాలంటే కార్లలో ఏం వాడతారు? దేనిని వాడితే కార్లు మంచి డిజైన్ వస్తుంది?
బంక మట్టి. ఈ పేరు మనం వినయ్ ఉంటాం. బంకమట్టి అనగానే ఏవైనా బొమ్మలు తయారుచేయడానికి లేదా విగ్రహాలు రూపుదిద్దుకోవడానికి ఉపయోగిస్తారు. కానీ కార్ల తయారీలోనూ బంకమట్టిని ఉపయోగిస్తారు అంటే ఎవరైనా నమ్ముతారా..? కానీ క్లే (బంకమట్టి) మోడలింగ్ కోసం కార్ల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిని బట్టి కార్ల డిజైన్ రూపుదిద్దుకోనుంది. ముఖ్యంగా ఒక కారుకు డిజైన్ కోసం కంప్యూటర్లో CAD మోడల్ తయారు చేస్తారు. అయితే ఈ మోడల్ బయట కారు రూపంలో కావాల్సి ఉంటుంది. ఇలా కంప్యూటర్ లో రూపుదిద్దుకున్న డిజైన్ రావాలంటే ముందుగా ఫుల్ సైజ్ క్లే తయారుచేస్తారు. ఈ డిజైన్ తయారు చేయడంలో బంకమట్టిని ఎక్కువగా ఉపయోగిస్తారు. బంకమట్టిని ఉపయోగించడం వల్ల బాడీ ఆకారం ఎలా కావాలంటే అలా తయారవుతుంది. కారులోని బాడీ, గ్రిల్ షేప్, హెడ్ లైట్ అవుట్ లైన్, విండో కట్ వంటి వాటికోసం క్లే తయారు చేస్తారు.
అయితే ముందుగా ఈ క్లే ను పరీక్షిస్తారు. ఇందులో గాలి ప్రవాహం, డ్రాగ్, డౌన్ ఫోర్స్ వంటి అంశాలను పరిశీలించి ఆ తర్వాత తయారీకి పంపిస్తారు. అంకమట్టిని పాలిష్ చేస్తే మెటల్ గా మెరుస్తుంది. అంతేకాకుండా దీనిపై పెయింట్ టెక్చర్, సర్ఫేస్ రిఫ్లెక్షలను పరిశీలించడానికి ఉపయోగపడుతుంది. బంకమట్టిని ఉపయోగించి క్లే తయారు చేయడం వల్ల తక్కువ ఖర్చుతో డిజైన్లు పొందవచ్చు. అలాగే ఇలా తయారుచేసిన క్లే డిజైన్ మార్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.
ముందుగా CAD ను తయారుచేస్తారు. ఆ తర్వాత CNC మీ ద్వారా బంకమట్టిని అనుకున్న షేపుకు కట్ చేస్తారు. డిజైనర్లు చేతితో ఫైన్ ట్యూన్ చేస్తారు. ఆ తర్వాత మోడల్ కు రిఫైన్ చేసిన సర్ఫేస్ ఇస్తారు. చివరగా కారు డిజైన్లు రెడీ చేస్తారు. బంకమట్టిలో ఆయిల్స్, మైనం పదార్థాలు, ప్రత్యేక ఫిల్టర్లు ఉండడంవల్ల డిజైన్ అనుకూల విధంగా మలచబడుతుంది. అంతేకాకుండా దీనిని వేడి చేయడం వల్ల ఎటు వీలైతే అటు వంగిపోతుంది. కానీ ఇది పూర్తిగా చల్లారిన తర్వాత గట్టిపడుతుంది. ఎక్కువగా ఆటోమోటివ్ కార్లలో మాత్రమే దీనిని ఉపయోగిస్తారు.