Maruti Car: ప్రస్తుత కాలంలో బైక్ కంటే కారు కొనాలని చూసేవారే ఎక్కువమంది ఉన్నారు. ఎందుకంటే చిన్న ఫ్యామిలీ నుంచి ఉమ్మడి కుటుంబం వరకు ప్రయాణాలు చేయాలంటే సొంత వెహికల్ ఉండాలని అనుకుంటున్నారు. అయితే కొంతమంది తక్కువ ధరకు కారు కొనాలని చూస్తే మరి కొంతమంది సేఫ్టీ కారు ఉండాలని అనుకుంటారు. అయితే మారుతి సుజుకి కంపెనీకి చెందిన ఎన్నో కార్లు మార్కెట్లోకి వచ్చి అలరిస్తూ ఉంటాయి. ఈ కంపెనీ మిడిల్ క్లాస్ నుంచి హైయర్ క్లాస్ వరకు అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా వెహికల్స్ను మార్కెట్లోకి తీసుకువస్తూ ఉంటాయి. ఇదే సమయంలో కొన్ని వాహనాలు భద్రత ఉండే విధంగా క్రాస్ టెస్టు చేస్తూ ఉంటాయి. లేటెస్ట్ గా మారుతి సుజుకి కి చెందిన ఓ కారును క్రాస్ టెస్ట్ చేశారు. ఈ కారు రేటింగ్ ఎలా ఉందంటే?
మారుతి సుజుకి కంపెనీకి చెందిన INVICTO కారును లేటెస్ట్ గా క్రాస్ టెస్ట్ చేశారు. దీంతో ఈ కారు అత్యంత సురక్షితమైనదిగా తేలింది. చిన్నపిల్లల భద్రత విషయంలో ఈ కారు 49 పాయింట్లకు గాను 45 పాయింట్లు దక్కించుకుంది. పెద్దల రక్షణ విషయంలో 32 పాయింట్లకు 30.4 స్కోరు సాధించింది. ముందరి భాగంలో బ్యారియర్ టెస్ట్ లో 16 పాయింట్లకు 14.43 పాయింట్లు సాధించింది. మొత్తంగా ఈ కారు 5 స్టార్ రేటింగ్ పొందింది.
ఇన్విక్టో కారులో అదనపు రక్షణ ఫీచర్లను కూడా ఉన్నాయి. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, ఆటో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, రియర్ డిస్క్ బ్రేక్ వంటివి ఉన్నాయి. అలాగే ఈ కారులో ఆకట్టుకునే ఫీచర్స్ కూడా ఉన్నాయి. విశాలమైన క్యాబిన్ తో పాటు సౌకర్యవంతమైన సీట్లు ఉన్నాయి. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం తో పాటు ఫ్యామిలీ కలిసి సరదాగా విహారయాత్రలకు వెళ్లేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే చిన్న పిల్లలకు ఇష్టమయ్యే సన్ రూఫ్ ఇందులో అమర్చారు. కొన్ని కార్లలో 7 లేదా 8 సీట్లు ఉంటాయి. దీంతో ఉమ్మడి ఫ్యామిలీ కలిసి సుదూర ప్రాంతాలకు వెళ్ళవచ్చు.
ఇందులో 360 డిగ్రీ కెమెరా తో కూడిన పార్కింగ్ సిస్టం, వైర్లెస్ ఆపిల్ కార్ ప్లే అండ్ వైర్ ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ఆటోమేటిక్ హెడ్ లైట్స్, కక్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా ఐ క్రాస్ కు పోటీగా ఈ కారును ఆ మార్కెట్లోకి తీసుకొచ్చారు. బాహ్య ఫీచర్స్ విషయానికి వస్తే గ్రిల్, హెడ్ లాంప్ లు ఆకట్టుకుంటాయి.
మారుతి కార్లు అనగానే మిడిల్ క్లాస్ పీపుల్స్ కోసం మాత్రమే మార్కెట్లోకి వస్తాయని అనుకుంటారు. కానీ ఉన్నత వర్గాలకు ఈ మోడల్ విపరీతంగా నచ్చుతుంది. ప్రస్తుతం మార్కెట్లో దీనిని. 22.51 లక్షల ప్రారంభ ధర నుంచి విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ 29.22 లక్షల వరకు విక్రయిస్తుంటారు.