Maruti Brezza: ఇప్పుడు కార్ల వినియోగం అధికంగా ఉంది. చాలామంది ఒకప్పటి మాదిరిగా ప్రయాణంలో ఇబ్బందులు పడాలని అనుకోవడం లేదు. ముఖ్యంగా ఎగువ మధ్య తరగతి వారు తమకంటూ సొంత వాహనం ఉండాలని కోరుకుంటున్నారు. కంపెనీలు కూడా ఆఫర్లు ప్రకటిస్తున్న నేపథ్యంలో కార్ల కొనుగోలు పెరిగిపోయింది..
మనదేశంలో కార్లు తయారు చేసే కంపెనీలు చాలా ఉన్నాయి. అందులో మారుతి కంపెనీకి ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ కంపెనీ భారతీయ రోడ్లకు అనుకూలంగా వాహనాలను తయారు చేస్తుందనే పేరుంది. గతంలో ఈ కంపెనీ బడ్జెట్ మోడల్స్ తయారు చేసేది. కానీ ఇప్పుడు ప్రీమియం విభాగంలోకి వచ్చింది.
ప్రీమియం విభాగంలో కూడా కాంపాక్ట్ ఎస్ యూ వీ సెగ్మెంట్లో ఈ కంపెనీ బ్రెజ్జా(Maruti brezza) పేరుతో ఓ మోడల్ కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర దాదాపు ఎనిమిది లక్షలు. ప్రీమియం స్టైలింగ్ తో అదరగొడుతోంది ఈ వాహనం.. ఈ కారుకు రేంజ్ రోవర్ రేంజ్ లో ఫీచర్లు కల్పించింది మారుతి కంపెనీ. ప్రీమియం బాక్సీ ఎస్ యూవీ డిజైన్ ఈ ఈ కారణం మరో స్థాయిలో నిలబెడుతోంది. చదునైన బానేట్, నిటారుగా ఉండే గ్రిల్, స్క్వేర్డ్ ఆఫ్ ఎల్ఈడి హెడ్ లాంప్ లు, క్లీన్ బాడీ ప్యానెల్ ఈ కారుకు ఉన్న ప్రధాన ఆకర్షణలు. హై ఎండ్ లగ్జరీ ఎస్ యూవీ మాదిరిగా దీనికి బలమైన రోడ్డు ప్రజెన్స్ అందిస్తాయి. స్ట్రెయిట్ షోల్డర్ లైన్, మస్కలరీ వీల్ ఆర్చ్ లు, అల్లాయ్ వీల్స్ అదనపు ఆకర్షణగా ఉన్నాయి.
మారుతి బాలెనో మాదిరిగానే ఇందులో కూడా అద్భుతమైన ఇంటీరియర్ ఉంది. క్యాబిన్ క్లీనర్ డాష్ బోర్డు లేఔట్, ప్రీమియం లుకింగ్ మెటీరియల్స్ వంటివి ఇంటీరియర్ కు అదనపు ఆకర్షణ తీసుకొస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ తో కూడిన పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మెరుగైన సీట్ కూషనింగ్ అద్భుతమైన అనుభవాన్ని ఇస్తాయి. మల్టీ ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హీల్ హోల్డ్ అసిస్ట్, బ్యాక్ పార్కింగ్ సెన్సార్లు, వేరియంట్ కెమెరా సపోర్ట్ ఉంటుంది.
ఈ వాహనం ఇంజన్ పెట్రోల్ వేరియంట్ తో నడుస్తుంది. మారుమూల రోడ్ల నుంచి మొదలు పెడితే జాతీయ రహదారుల వరకు వేగంగా దూసుకుపోతుంది. రేంజ్ రోవర్ మాదిరిగానే ఈ కారు లుక్ ఉంది. ఇంటీరియర్ దగ్గర నుంచి మొదలుపెడితే ఫీచర్ల వరకు ఏ విషయంలో కూడా మారుతి కంపెనీ రాజీపడలేదు. అయితే దీనిని ఎనిమిది లక్షల ధరకు ఇవ్వడం ఒక రకంగా మిగతా కంపెనీలకు ఛాలెంజ్ అనుకోవచ్చు. బహుశా ప్రీమియం విభాగంలో ఇంత తక్కువ ధరకు ఈ స్థాయిలో ఉన్న ఫీచర్లు మరే కారులో రావు.