spot_img
Homeబాలీవుడ్Pawan Kalyan: పాన్ ఇండియా సినిమాలు రాకముందే బాలీవుడ్ హీరోలకి గట్టి పోటీ ఇచ్చిన పవన్...

Pawan Kalyan: పాన్ ఇండియా సినిమాలు రాకముందే బాలీవుడ్ హీరోలకి గట్టి పోటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్… మ్యాటరేంటంటే..?

Pawan Kalyan: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటే అయిపోయింది. ఎందుకంటే ఏ భాషలో ఏ సినిమా వచ్చినా కూడా అందరూ అన్ని సినిమాలను చూస్తున్నారు. ఆ సినిమా బాగుంటే ఆదరిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం సినిమాకి బౌండరీలు అనేవి లేకుండా అయిపోయింది. అందుకే మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంటూ చాలామంది చాలా రకాల సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

తెలుగు హీరోలైతే పాన్ ఇండియా సినిమాలను చేసుకుంటూ మంచి సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు పవన్ కళ్యాణ్…అయితే ఈయన ఇప్పుడు ఓజీ సినిమాతో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఒకప్పుడు సౌత్ లో పవర్ స్టార్ గా తన స్టామినాను చూపించుకుంటూ ముందుకు సాగాడు.

ఇక ఇదిలా ఉంటే ఒక పది సంవత్సరాల క్రితం షారుఖ్ ఖాన్ బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగాడు. చాలా సంవత్సరాల పాటు బాలీవుడ్ బాద్షా గా ఇండస్ట్రీని ఏలాడనే చెప్పాలి. ఇక అలాంటి సమయంలో కూడా షారుఖ్ ఖాన్ ను పక్కనపెట్టి ఆయనకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ని పవన్ కళ్యాణ్ కి ఇస్తామని తను బాలీవుడ్ లో ఒక సినిమా చేయాలని అక్కడి ప్రొడ్యూసర్లు కొందరు పవన్ కళ్యాణ్ ను అడిగారట. అలాగే కోకో కోలా యాజమాన్యం కూడా ఇండియా వైడ్ గా బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని షారుఖ్ ఖాన్ ను తప్పిస్తామని పవన్ కళ్యాణ్ తో అన్నారట. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ దానికి ఒప్పుకోలేదు.

ఇక బాలీవుడ్ లో సినిమా చేయడానికి తను కొంతవరకు సిద్ధపడ్డప్పటికీ ఎందుకో తన మనస్సాక్షికి నచ్చకపోవడంతో ఆయన తెలుగులోనే సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తు వస్తున్నాడు. అంటే ఈ లెక్కన ఇప్పుడు మనం చెప్పుకునే పాన్ ఇండియా స్టార్లు కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ ముందు దిగదుడుపనే చెప్పాలి.

ఎందుకంటే అప్పట్లోనే ఆయనకు అక్కడ నుంచి ఆఫర్ వచ్చిన కూడా ఆయన దాన్ని సున్నితంగా రిజెక్ట్ చేశాడు. ఒకవేళ అప్పుడు ఆయన అక్కడ సినిమా చేసి ఉంటే పాన్ ఇండియా సినిమా అనేది అప్పటినుంచే స్టార్ట్ అయ్యేదేమో అంటూ కొందరు సినీ మేధావులు సైతం సోషల్ మీడియాలో వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper