Homeఆంధ్రప్రదేశ్‌YSRCP: పార్లమెంట్ లో వైసీపీ శాంతి మంత్రం.. దేకినోడు లేడు..

YSRCP: పార్లమెంట్ లో వైసీపీ శాంతి మంత్రం.. దేకినోడు లేడు..

YSRCP: దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పైగా ఇప్పుడు పార్లమెంట్లో వర్షాకాల సమావేశాలు కూడా మొదలయ్యాయి. ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్ సభ్యులు ప్రజల సమస్యల మీద తమ వాయిస్ వినిపించవచ్చు. ప్రజల బాధలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లొచ్చు. కానీ ఈ విషయంలో వైసిపి వేరే ఆలోచన చేస్తోంది.

వైసిపికి ఏపీలో 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. కనీసం ప్రతిపక్ష హోదాను కూడా అక్కడ ప్రజలు ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా కోసం జగన్ అనేక సందర్భాల్లో దేబిరించారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి తాను అసెంబ్లీకి వెళ్లడమే మానేశారు. ప్రభుత్వాన్ని నిలదీసే అధికారం ఉన్నప్పటికీ.. ఎందుకనో జగన్ ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు. 2019 నుంచి 23 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్.. ప్రతిపక్ష టీడీపీకి ఇబ్బందికరమైన వాతావరణం కలిగించారు. కనీసం అసెంబ్లీలో మాట్లాడే స్వేచ్ఛను కూడా ఇవ్వలేకపోయారు. కర్మ రిటర్న్స్ అన్నట్టుగా.. జగన్ కు 11 స్థానాలు రావడంతో కనీసం ప్రతిపక్ష హోదాను కూడా సొంతం చేసుకోలేకపోయారు

ఏపీలో అసెంబ్లీకి కూడా వెళ్ళని వైసీపీ నేతలు.. పార్లమెంట్లో మాత్రం శాంతి భద్రతల మీద వాయిదా తీర్మానం ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. వైసీపీ ఎంపీ గురుమూర్తి పార్లమెంటులో ఈ తీర్మానాన్ని ఇచ్చారు. పార్లమెంట్ రూల్ ఆఫ్ బుక్ గురించి అవగాహన ఉన్న ఎవరికైనా సరే ఈ తీర్మానం గురించి వెంటనే ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఈ తీర్మానం మొదటి క్షణంలోనే విరిగిపోతూ ఉంటుంది. అయినప్పటికీ తాము ఢిల్లీ స్థాయిలో పోరాడుతున్నామని వైసీపీ నేతలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. సొంత ఛానల్లో డబ్బాలు కొట్టుకోవడానికి సందర్భం ఉంటుంది.

ఇక్కడ వైసిపి నేతలకు తెలియంది ఏంటంటే.. శాంతిభద్రతల వ్యవహారం పూర్తిగా రాష్ట్రాల పరిధిలో ఉంటుంది. భారత రాజ్యాంగం కూడా ఇదే చెబుతోంది. శాంతిభద్రతలను గురించి చర్చించడానికి.. ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడానికి అక్కడి ప్రజాప్రతినిధులు ఉంటారు. ఒకవేళ శాంతి భద్రతల విషయంలో ఇబ్బందులు ఎదురవుతుంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్షం ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయాలి.. ఆధారాలతో సహా కడిగిపారేయాలి. ఆ దమ్ము లేని వైసిపి అసెంబ్లీకి రావడం లేదు. ఏదో గుంపులో గోవిందం లాగా శాంతిభద్రతల వ్యవహారం మీద పార్లమెంట్లో తీర్మానం ఇచ్చింది.

ఏపీ అసెంబ్లీలో 11మంది మాత్రమే ఉన్నారు కాబట్టి వైసిపి నేతలకు మైక్ దొరికే అవకాశం లేదు. ఒకవేళ దొరికితే మాట్లాడే దమ్ము వారి దగ్గర లేదు. ఒకవేళ మాట్లాడినా కూటమి ఎమ్మెల్యేలు లెక్కలతో సహా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్లే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లడం లేదు. అసెంబ్లీ గేటు కూడా తాగేందుకు వైసిపి నేతలు ఇష్టాన్ని చూపించడం లేదు. అందువల్లే ఢిల్లీలో వాయిదాల పేరుతో హల్చల్ చేస్తున్నారు. ఇటువంటి వీరికి డెమోక్రసీ గురించి.. పార్లమెంటు గురించి ఎంత స్థాయిలో చిత్తశుద్ధివంతో తెలుసుకోవచ్చు. మరోవైపు వైసీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ రెండు సెకండ్ల కంటే ఎక్కువ చదవరు. పైగా దానిని చెత్తబుట్టలో పడేస్తారు.. అసెంబ్లీకి వెళ్లకుండా.. పార్లమెంట్లో ఈ డ్రామాలు ఆడితే ప్రజలకు తెలియదా. ప్రజలు అంత అమాయకులా.. సొంత ఛానల్లో హెడ్లైన్స్ వేసినంతమాత్రాన ప్రజలు అంత ఈజీగా నమ్ముతారా..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular