spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YCP: అయ్యప్ప సన్నిధిలో ఆ స్మరణ ఏంటి.. వైసీపీకే నష్టం!

YCP: అయ్యప్ప సన్నిధిలో ఆ స్మరణ ఏంటి.. వైసీపీకే నష్టం!

YCP: కొన్నిసార్లు మితిమీరిన అభిమానం చేటు తెస్తుంది. అభిమానం పర్వాలేదు గానీ.. మితిమీరిన అభిమానం, స్వామి భక్తి అనేది ఒక్కోసారి వికటించే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో అదే జరుగుతోంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పై మతపరమైన ముద్ర ఉంది. ఇటువంటి సమయంలో శబరిమలైలో జగన్మోహన్ రెడ్డి బ్యానర్ తో కొంతమంది వైసీపీ అభిమానులు వెళ్తుండడం సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తోంది. వారు తమ అధినేతపై అభిమానంతో ఆ పని చేయవచ్చు కానీ.. ప్రజల్లోకి మరోలా వెళ్తుంది. రాజకీయ ప్రత్యర్థులు సైతం వ్యతిరేక ప్రచారం చేస్తారు. ఒకటి కాదు రెండు కాదు.. ఇటీవల ఇటువంటి ఘటనలు శబరిమలైలో వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభం కంటే నష్టమే అధికం అని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చేసేదాకా పరిస్థితి వచ్చింది.

* పరమ పవిత్రం..
సాధారణంగా అయ్యప్ప స్వామి దీక్ష ఎంతో కఠినమైనది. భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు కూడా. దక్షిణ రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్షాపరులు పెరుగుతున్నారు. 41 రోజులపాటు దీక్ష చేసి శబరిమలైలో విరమణ చేస్తారు. దీక్షలో ఉన్నప్పుడు ప్రతి నిమిషం అయ్యా.. అప్ప నామస్మరణతోనే ఉంటారు భక్తులు. శబరిమలైలో సైతం అయ్యప్ప శరణు ఘోష వినబడుతుంది తప్ప మరొకటి ఉండదు. భవ బంధాలను విడిచిపెట్టి.. అయ్యప్ప దీక్షలో ఉండే భక్తులు ఎంతో కఠినంగా ఉండాలి. ఆహార నియమ నిబంధనలు పాటించాలి. గృహనివాసాన్ని విడిచిపెట్టి సన్నిధానంలో మెలగాలి. హిందూ పూజలతో పాటు వ్రత కల్పనలో అయ్యప్ప స్వామి ది ప్రత్యేక స్థానం. దేశ ప్రముఖులు సైతం అయ్యప్ప దీక్షలో చాలా కఠినంగా ఉంటారు. మొన్ననే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీక్ష చేపట్టారు. ఎంతో నిష్టతో శబరిమలై వెళ్లారు.

* ఇప్పటికే మతముద్ర..
అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పై( Y S Jagan Mohan Reddy) మతముద్ర ఉంది. ఆయన తిరుమల వస్తే డిక్లరేషన్ ఇవ్వాలన్న డిమాండ్ వరకు పరిస్థితి వచ్చింది. అయితే ఇటువంటి సమయంలోనే శబరిమలైలో జగన్ బ్యానర్ తో.. జగన్ నామస్మరణతో భక్తులు వెళుతుండడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. ఇది భక్తి అనే సెంటిమెంట్ తో ముడిపడిన అంశం. ఇది ముదిరిపాకనపడితే జాతీయస్థాయిలో సైతం చర్చకు దారి తీసే అవకాశం ఉంది. ఎందుకంటే అయ్యప్ప భక్తులు అనేది ఒక్క ఆంధ్ర ప్రదేశ్కు సంబంధించిన అంశం కాదు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువమంది అయ్యప్ప దీక్షలో ఉంటారు. అటువంటి వారికి ఆగ్రహం తెప్పించే అంశం అవుతుంది. ఆపై హిందూ సమాజంలో కూడా దీనిపై చర్చ జరుగుతుంది. అందుకే ఒకటికి రెండుసార్లు వైసీపీ శ్రేణులు ఆలోచించాల్సిన అవసరం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Jana Nayagan Movie

Jana Nayagan Movie: జన నాయకుడు మూవీ నుంచి తప్పించుకున్న స్టార్ డైరెక్టర్…

Jana Nayagan Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. అక్కడ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్...
Pink Diamond Conspiracy

Pink Diamond Conspiracy: తేలిపోనున్న ‘పింక్ డైమండ్’ కుట్ర!

Pink Diamond Conspiracy: 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: ‘భోగాపురం’లో రెండు గంటల పాటు మోడీ!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. విభజన హామీల్లో భాగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ...
Thammineni Seetharam

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...
Chennai Love Story Movie

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...
Oktelugu Epaper