Homeఆంధ్రప్రదేశ్‌Kurnool Bus Accident: ప్రమాదానికి కారకుడు ఈ బైకర్.. పెట్రోల్ బంకులో ఈ దారుణం.. సీసీ...

Kurnool Bus Accident: ప్రమాదానికి కారకుడు ఈ బైకర్.. పెట్రోల్ బంకులో ఈ దారుణం.. సీసీ టీవీ వీడియో

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి రకరకాల కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదం జరగడానికి అసలు కారణం మాత్రం బైకర్ శివశంకర్. అతడు జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో రావడం.. కావేరీ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఆ బస్సులో ఇంధనం ట్యాంకర్ కు మంటలు అంటుకోవడంతో చూస్తుండగానే బస్సు కాలిపోయింది. పైగా ఆ బస్సులో ఏసీ సౌకర్యం ఉండడం.. అద్దాలు మూసి ఉండడంతో మంటలు వేగంగా అంటుకున్నాయి. పైగా ఈ ప్రమాదం అర్ధరాత్రి జరిగిన నేపథ్యంలో ప్రధాన నష్టం తీవ్రంగా ఉంది. అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఫ్రంట్ డోర్ కు అనుసంధానంగా ఉండే హైడ్రాలిక్ వైర్లు కాలిపోయాయి. దీంతో సకాలంలో ఆ డోరు తెరుచుకోక పోవడంతో ప్రయాణికులు అందరూ బయటకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది.

ఆ బస్సులో హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యాపారి కొన్ని విలువైన ఫోన్లను బెంగుళూరు నగరానికి సరఫరా చేస్తున్నాడు. ఆ ఫోన్ల విలువ దాదాపు 46 లక్షలు వరకు ఉంటుంది. ఈ మంటలు వ్యాపించిన తర్వాత ఆ ఫోన్లు కూడా అందులోనే కాలిపోయాయి. మంటలు అంటుకోవడంతో ఆ ఫోన్ల బ్యాటరీలు అమాంతం పేలిపోయాయి. దీనికి తోడు ఆ బస్సు తయారీలో అల్యూమినియం అధికంగా ఉపయోగించడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. మంటల తాకిడి వల్ల గాడ నిద్రలో ఉన్నవారు చూస్తుండగానే సజీవ దహనం అయిపోయారు.

ఈ ప్రమాదానికి బైకర్ శివశంకర్ ప్రధాన కారణమని ఇప్పటికే ఏపీ అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఈ ప్రమాదం కంటే ముందు శివశంకర్ తన ద్విచక్ర వాహనంతో అడ్డు అదుపు లేకుండా ప్రయాణించాడు. మద్యం కూడా తాగాడు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో కావేరి ట్రావెల్స్ బస్సును ఢీకొన్నాడు. తను కూడా ఈ ప్రమాదంలో చనిపోయినట్టు తెలుస్తోంది. ఆ బైక్ నేరుగా బస్సు కిందికి దూసుకుపోవడంతో నిప్పు రవ్వలు ఏర్పడ్డాయి. అవి కాస్త ఇంధనం ట్యాంకర్ ను తగలడంతో ఒక్కసారిగా మంటలు ఏర్పడ్డాయి. ఆ మంటలు అంతకంతకు పెరిగిపోవడంతో బస్సు తగలబడిపోయింది.

బస్సు కాలిపోతున్నప్పుడు నివారణ చర్యలకు పాల్పడకుండా డ్రైవర్లు నిర్లక్ష్యం ప్రదర్శించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మొదట్లో ఆ ఇద్దరు డ్రైవర్లు పరారీ అయిపోయారని వార్తలు వచ్చినప్పటికీ.. అందులో నిజం లేదని తెలుస్తోంది. ఆ ఇద్దరు డ్రైవర్లు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది సజీవ దహనమైపోయారు. బస్సు వెళ్తున్నప్పుడు అందులో 40 మందికి పైగా ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by BIGTV Live (@bigtv_telugu)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular