Mahesh Babu And Pradeep Ranganathan: సౌత్ లో ప్రస్తుతం బలంగా వినిపిస్తున్న పేరు ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan). చూసేందుకు చాలా యావరేజ్ గా ఉన్న ఒక సాధారణ కుర్రాడు,ఇండస్ట్రీ లోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి, హీరో గా ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఏకంగా మూడు సార్లు 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించాడు. ఇండస్ట్రీ లో ఎన్నో ఏళ్ళ నుండి ఉంటున్న కొంతమంది స్టార్ హీరోలకు కూడా సాధ్యం అవ్వని ఫీట్ ఇది. ప్రదీప్ రంగనాథన్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది ఒక దర్శకుడిగా. జయం రవి హీరో గా నటించిన ‘కోమలి’ అనే చిత్రానికి దర్శకుడు ఇతనే. ఎన్నో ఏళ్ళ నుండి కోమాలో ఉన్న ఒక పేషెంట్, స్పృహ లోకి వస్తే ప్రస్తుత కాలంలో మనుషులతో ఎలా మనుగడ సాగించాడు అనేదే స్టోరీ. ఫన్, ఎమోషన్స్ తో చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
Also Read: పూరి జగన్నాధ్ – విజయ్ సేతుపతి సినిమాలో పూరి మార్క్ మిస్ అవుతుందా..?
ఈ సినిమా తర్వాత ఆయన స్వయంగా హీరో గా నటిస్తూ, దర్శకత్వం కూడా వహిస్తూ, లవ్ టుడే చిత్రం చేసాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఎలాంటి బ్లాక్ బస్టర్ అయ్యిందో మనమంతా చూసాము. ఆ తర్వాత ప్రదీప్ కెరీర్ ఎలా సాగుతుందో కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఆసక్తి కలిగించే వార్త ఏమిటంటే ప్రదీప్ తన మొదటి చిత్రం ‘కోమలి’ ని సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) తో ద్విభాషా చిత్రం గా తెరకెక్కించాలని అనుకున్నాడట. మహేష్ బాబు అపాయింట్మెంట్ కోసం పాపం అప్పట్లో ఈయన చెయ్యని ప్రయత్నం అంటూ ఏది మిగలలేదు. కానీ దొరకలేదు, తెలిసిందే ఈ ఇండస్ట్రీ లో ఒక హీరో ని సామాన్యుడు చేరుకోవాలంటే మధ్యలో ఎంత మంది ఉంటారో?, అదృష్టం కలిసొచ్చి ఎవరైనా పిలిచి అవకాశం ఇవ్వాల్సిందే కానీ, ఈ కాలం లో బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టడం అనేది సాధారణమైన విషయం కాదు.
అయితే మహేష్ బాబు కలిసి స్టోరీ ని వినిపించే అదృష్టం కలగని ప్రదీప్ కి, జయం రవి నుండి ఒకరోజు ఫోన్ వచ్చింది. అంతకు ముందు ప్రదీప్ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ని తెరకెక్కించాడు. అవి ఆయనకు చాలా బాగా నచ్చాయట. ఇంటికి పిలిచి మరీ నీ దగ్గర ఏదైనా కథ ఉంటే చెప్పు చేద్దామని అని అన్నాడట. అప్పుడు ఆయన కోమలి కథ చెప్పడం, అది హిట్ అవ్వడం, ఆ తర్వాత ప్రదీప్ ప్రయాణం ఇలా సాగుతూ ముందుకెళ్లడం మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇదంతా పక్కన భవిష్యత్తులో అయినా ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం లో మహేష్ బాబు సినిమా చూస్తామా అంటే అనుమానమే. ఎందుకంటే ప్రదీప్ కి ప్రస్తుతం దర్శకత్వం మీద కంటే నటనపైనే ఎక్కువగా ఆసక్తి ఉంది. కాబట్టి ఆయన ఇప్పట్లో దర్శకత్వం వైపు చూడడం అసాధ్యం అనే చెప్పాలి.