Kurnool Bus Accident: ఏదైనా ఒక వాహనం సజావుగా నడవాలి అంటే.. అది దానిని నడిపే డ్రైవర్ మీద ఆధారపడి ఉంటుంది.. అందువల్లే డ్రైవర్ ను రథసారథి అని పిలుస్తుంటారు. కర్నూలు జిల్లాలో చిన్నటేకూరు వద్ద కావేరి సంస్థకు చెందిన ట్రావెల్ బస్సు (Kaveri travel bus) అగ్నిప్రమాదంలో కాలిపోయిన నేపథ్యంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదంలో ప్రధానంగా డ్రైవర్ గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. దాదాపు ఈ ప్రమాదంలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయపడ్డారు. ఈ ప్రమాదం ఏకంగా దేశ ప్రధానమంత్రిని కలచి వేసిందంటే.. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
మంటల తాకిడి వల్ల బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లా చెందిన ఓ కుటుంబం మొత్తం ఈ మంటల్లో కాలిపోయింది. మంటల్లో హైడ్రాలిక్ వైర్లు తెగిపోవడంతో డోర్లు తెరుచుకోలేదు. దీంతో చాలామంది ప్రయాణికులు బయటకు రావడానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఆ మంటల వల్ల వారు బస్సులోనే ఉండిపోవడంతో.. కాలిపోయారు.
వాస్తవానికి ప్రమాదం జరిగినప్పుడు ప్రధాన డ్రైవర్ చేసిన తప్పులే ఇంతటి దారుణానికి కారణమయ్యాయని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. బైక్ ఢీకొట్టగానే బస్సును గనుక నిలిపివేసి ఉంటే మంటలు చెలరేగి ఉండేవి కావని.. పైగా ఫైర్ సేఫ్టీ తో కాకుండా మంటలను నీటితో ఆర్పి వేసే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా చేయి దాటిపోయిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. కనీసం ప్రయాణికులు దిగేలా డోర్ తీసి ఉండి ఉంటే.. చాలామంది ప్రాణాలు కోల్పోకుండా ఉండేవారని తెలుస్తోంది. ప్రమాదంలో హైడ్రాలిక్ కేబుల్ తెగిపోవడంతో డోర్ తెరుచుకోలేదు. ఫలితంగా చాలా మంది బయటికి రాలేక బస్సులోనే ఉండిపోయారు. అప్పటికి మంట చెలరేగడంతో చూస్తుండగానే సజీవ దహనమయ్యారు.
కావేరి ట్రావెల్ బస్సు మీద అనేక కేసులు ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ బస్సు కూడా కేంద్ర పాలిత ప్రాంతమైన డయుడామన్ లో రిజిస్ట్రేషన్ అయింది. ఈ బసుకు పర్మిట్ లేకపోయినప్పటికీ అంతర్ రాష్ట్రాలలో తిప్పుతున్నారు. పొల్యూషన్, ఇన్సూరెన్స్ వాలిడిటీ ముగిసి పోయినప్పటికీ ఇంతవరకు రెన్యువల్ చేయించుకోలేదు. పైగా అధికారుల నిర్లక్ష్యం.. యాజమాన్యం జవాబు దారి లేనితనం వల్ల ఇంత మంది ప్రాణాలు కోల్పోయారు.