Homeఆంధ్రప్రదేశ్‌Kurnool Bus Accident: ఆ విషయంలో వైసిపి ఆలోచన మారకపోతే కష్టమే!

Kurnool Bus Accident: ఆ విషయంలో వైసిపి ఆలోచన మారకపోతే కష్టమే!

Kurnool Bus Accident: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ గుణపాఠం నేర్చుకోలేదు. ఆ పార్టీకి ఘోర పరాజయం ఎదురయింది. అయినా సరే తన పాత చింతకాయ వాసన మాదిరిగా వ్యవహరిస్తోంది. గత 17 నెలల కూటమి పాలనలో ప్రభుత్వ వైఫల్యాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయడం లేదు. ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగినా.. ఆర్థికపరమైన లావాదేవీలతో దాడులు జరిగి ఎవరైనా చనిపోయినా.. దానికి రాజకీయ రంగు పులమడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అలవాటైన […]

Kurnool Bus Accident: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ గుణపాఠం నేర్చుకోలేదు. ఆ పార్టీకి ఘోర పరాజయం ఎదురయింది. అయినా సరే తన పాత చింతకాయ వాసన మాదిరిగా వ్యవహరిస్తోంది. గత 17 నెలల కూటమి పాలనలో ప్రభుత్వ వైఫల్యాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయడం లేదు. ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగినా.. ఆర్థికపరమైన లావాదేవీలతో దాడులు జరిగి ఎవరైనా చనిపోయినా.. దానికి రాజకీయ రంగు పులమడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అలవాటైన విద్యగా మారింది. కుల ముద్రచూపి రచ్చ చేయడం కూడా ఆ పార్టీకి అలవాటుగా మారింది. ఎన్నెన్నో కట్టు కథలు, మరెన్నో అబూత కల్పనలతో సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేస్తోంది. కానీ ఈ తరహా ప్రచారానికి ఏపీ ప్రజలు అలవాటైపోయారు. వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రయత్నాలను ముందుగానే గుర్తిస్తున్నారు. ఇలా ఫేక్ ప్రచారం కనిపిస్తే చాలు దానిని పక్కన పడేస్తున్నారు.

బస్సు ఘటనపై ప్రచారం..
తాజాగా కర్నూలు జిల్లాలో( Kurnool district) బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కాలిపోయింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి అసలు సంబంధం లేదు. తెలంగాణ నుంచి ఏపీ మీదుగా కర్ణాటక వెళుతుంది ఆ బస్సు. అయితే ఈ బస్సు ప్రమాదంపై కల్తీ మధ్యన తీసుకొచ్చారు. కల్తీ మద్యం తాగడం వల్లే ఈ ప్రమాదానికి ద్విచక్ర వాహనదారుడు కారణమయ్యారని ప్రచారం చేశారు. అంతటితో ఆగకుండా బస్సు యాజమాన్యానికి సంబంధించి కులముద్ర అంటించారు. ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందన్నట్టు మాట్లాడుతున్నారు.

మృతదేహలు కనిపిస్తే..
అయితే వైసీపీ సోషల్ మీడియా( YCP social media ) ఇలా మృతదేహాలు కనిపిస్తే వ్యతిరేక ప్రచారాన్ని వాడుకోవడం మాత్రం జుగుప్సాకరంగా ఉంది. కందుకూరులో ఇద్దరి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు హత్య వరకు దారితీసాయి. అయితే హాతుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వాడు.. నిందితుడు కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు. దీంతో ఆ రెండు కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసిపి చాలా రకాల ప్రచారాలు చేసింది. కాపుల్లో ఉన్న వైసిపి అనుకూలురుతో శవ రాజకీయాలకు ప్లాన్ చేసింది. అది బెడిసి కొట్టడంతో లబోదిబోమంది. అయితే ఇప్పుడు కర్నూలు బస్సు ఘటనతో మళ్లీ రెచ్చిపోతుంది. అయితే ప్రభుత్వ వైఫల్యాలపై కాకుండా.. ఇలాంటి ప్రమాదాలపై, వ్యక్తిగత వైరాలను తీసుకుని రాజకీయం చేయాలని చూస్తోంది. ఇది వర్కౌట్ అయ్యేలా లేదని విశ్లేషకులు సైతం హెచ్చరిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఇదే పరిస్థితి కొనసాగితే మరింత దిగజారుడు తప్ప.. ఎటువంటి ప్రయోజనం ఉండదని తేల్చి చెబుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper