Homeఆంధ్రప్రదేశ్‌Rajya Sabha: ఇతర రాష్ట్రాల నుంచి ఇద్దరు ఏపీ నేతలు రాజ్యసభకు..!

Rajya Sabha: ఇతర రాష్ట్రాల నుంచి ఇద్దరు ఏపీ నేతలు రాజ్యసభకు..!

Rajya Sabha: ఏపీలో( Andhra Pradesh) రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. నాలుగు రాజ్యసభ స్థానాలకు సంబంధించి సభ్యుల పదవీకాలం జూన్ లో ముగియనుంది. అంతకంటే ముందే ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే ఏపీకి సంబంధించిన ఆ నాలుగు స్థానాలు కూటమికి దక్కనున్నాయి. అందులో టిడిపికి రెండు, బిజెపికి ఒకటి, జనసేనకు మరొకటి దక్కే అవకాశం ఉంది. కానీ ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. ఎవరి […]

Rajya Sabha: ఏపీలో( Andhra Pradesh) రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. నాలుగు రాజ్యసభ స్థానాలకు సంబంధించి సభ్యుల పదవీకాలం జూన్ లో ముగియనుంది. అంతకంటే ముందే ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే ఏపీకి సంబంధించిన ఆ నాలుగు స్థానాలు కూటమికి దక్కనున్నాయి. అందులో టిడిపికి రెండు, బిజెపికి ఒకటి, జనసేనకు మరొకటి దక్కే అవకాశం ఉంది. కానీ ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు. మరోవైపు పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఈసారి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నిక కావడం ఖాయమని ప్రచారం నడుస్తోంది. మరోవైపు మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహం సైతం రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక అవుతారన్న టాక్ నడుస్తోంది.

* షర్మిలకు ఛాన్స్..
అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన షర్మిల( Sharmila) మన రాష్ట్రం నుంచి ఎంపికయ్యే ఛాన్స్ లేదు. ఆ పార్టీకి ఆ అవకాశం కూడా లేదు. తెలంగాణ నుంచి కానీ… కర్ణాటక నుంచి కానీ ఆమె రాజ్యసభకు ప్రమోట్ అవుతారని తెలుస్తోంది. 2024 ఎన్నికలకు ముందు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్న ఆమెకు రాజ్యసభ పదవి ఇస్తామన్న హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతకుముందు తన తండ్రి పేరిట తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేశారు షర్మిల. అది అంతగా వర్కౌట్ కాకపోయేసరికి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి.. తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేయాలని చూశారు. కానీ అభ్యంతరాలు రావడంతో కాంగ్రెస్ పెద్దలు ఒప్పుకోలేదు. ఏపీ లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకుంటే ఎక్కడినుంచో రాజ్యసభ కు ప్రమోట్ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల నుంచి ఏదో ఒక చోట ఆమెకు రాజ్యసభ పదవి ఇస్తారని పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం నడుస్తోంది.

* యూపీ నుంచి జీవీఎల్ కు..
మరోవైపు బిజెపి మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు( gvl Narasimha Rao ) కూడా రాజ్యసభ పదవి ఇస్తారని తెలుస్తోంది. వైసిపి హయాంలో పారిశ్రామిక వర్గాల నుంచి బిజెపి పరిమల్ నత్వానికి అవకాశం కల్పించింది. ఇప్పుడు మరోసారి ఆయనకు రెన్యువల్ చేయనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఏపీ నుంచి బిజెపిలో మరో నేతకు అవకాశం లేనట్టే. అయితే రాజ్యసభ పదవిపై ఆశలు పెట్టుకున్నారు జివిఎల్. గతంలో బిజెపి వ్యూహకర్తగా పనిచేయడంతో కేంద్ర పెద్దలు ఆయనను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రమోట్ చేశారు. ఇప్పుడు కూడా ఏదైనా రాష్ట్రాల నుంచి ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper