Waqf Amendment Bill : రాత్రి 2 గంటలు, మూడు గంగల దాకా చర్చించి లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం పొందింది. ప్రస్తుతం చట్టమైంది. మిగిలింది రాష్ట్రపతి ఆమోదం మాత్రమే. ఈ చర్చలు ఫాలో అయినవారికి ఎన్నో సందేహాలు నివృత్తి అయ్యాయి. వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగం కాకుండా అరికట్టడానికి.. వక్ఫ్ ఆస్తులను పారదర్శకంగా నిర్వర్తించడానికి ఈ వక్ఫ్ చట్టం కీలకంగా మారుతుంది.
ముస్లిం ధార్మిక వ్యవహారాల్లో తలదూర్చడం అవసరమా? అన్న ప్రశ్నకు పార్లమెంట్ లో సమాధానం దొరికింది. కేవలం వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకే ఈ చట్టం ఉంటుంది. ధార్మిక వ్యవహారాల్లో ఎలాంటి పాత్ర ఉండదని అర్థమైంది.
వక్ఫ్ బోర్డు, టెంపుల్ బోర్డుకు పోటీ పెట్టి ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు సమాధానం దొరికింది. వక్ఫ్ బోర్డు కేవలం ఆస్తుల నిర్వహణకే సంబంధించింది. టెంపుల్ బోర్డు ధార్మిక వ్యవహారాలతోపాటు ఆస్తుల ను పరిరక్షించే సంస్థ. వక్ఫ్ లో ఆస్తుల నిర్వహణ మాత్రమే ఉంది. వక్ఫ్ బోర్డుతో టెంపుల్ ను పోల్చడానికి ఏం లేదు.
ముస్లిం సమాజంలో సంస్కరణలకు నడుంబిగించిన మోడీ ప్రణాళికలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.