Homeఆంధ్రప్రదేశ్‌Godavari River Tragedy: ఆ చిన్నారి బాధ ఎవరికీ రాకూడదు.. కళ్ళెదుటే ఘోరం!

Godavari River Tragedy: ఆ చిన్నారి బాధ ఎవరికీ రాకూడదు.. కళ్ళెదుటే ఘోరం!

Godavari River Tragedy: మూడేళ్ల చిన్నారిని వంతెన పై వదిలిపెట్టి.. గోదావరిలో గెంతేశారు దంపతులు. దీంతో ఆ చిన్నారి కన్నీరు మున్నీరవుతూ తల్లిదండ్రుల కోసం పరితపించిన తీరు అందర్నీ కంటతడి పెట్టించింది. చిన్నారి కళ్లెదుటే ఆ దంపతులు అఘాయిత్యానికి పాల్పడడం నివ్వెరపరిచింది. తమతో పాటు చిన్నారిని బలిగొనాలని చూశారు. కానీ మనసు అంగీకరించక.. చిన్నారిని విడిచిపెట్టి.. ఆ తల్లిదండ్రులు ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా […]

Godavari River Tragedy: మూడేళ్ల చిన్నారిని వంతెన పై వదిలిపెట్టి.. గోదావరిలో గెంతేశారు దంపతులు. దీంతో ఆ చిన్నారి కన్నీరు మున్నీరవుతూ తల్లిదండ్రుల కోసం పరితపించిన తీరు అందర్నీ కంటతడి పెట్టించింది. చిన్నారి కళ్లెదుటే ఆ దంపతులు అఘాయిత్యానికి పాల్పడడం నివ్వెరపరిచింది. తమతో పాటు చిన్నారిని బలిగొనాలని చూశారు. కానీ మనసు అంగీకరించక.. చిన్నారిని విడిచిపెట్టి.. ఆ తల్లిదండ్రులు ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

* పశ్చిమగోదావరి జిల్లాలో..
పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం చించినాడ సమీపంలో గోదావరి నది వంతెన వద్ద ఓ చిన్నారి ఏడుస్తూ కనిపించింది. ద్విచక్ర వాహనంపై చిన్నారితో వచ్చిన తల్లిదండ్రులు ఇద్దరు బండి ఆపి.. వంతెన పైనుంచి నదిలోకి దూకేశారు. సమీపంలో ఉన్నవారు అక్కడకు వచ్చి చూసేసరికి గల్లంతయ్యారు. చిన్నారిని ప్రశ్నించగా ఏడుస్తూ కనిపించింది. వివరాలు చెప్పలేకపోయింది. ఈ క్రమంలో బండిలో ఉన్న ఆధారాలు సేకరించగా.. మృతులు దొడ్ల సాయి, సిరిగా గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వీరి స్వగ్రామం తణుకు మండలం వేల్పూరుగా తెలుస్తోంది. నెలరోజుల కిందట తణుకు నుంచి వీరు భీమవరం వెళ్లినట్లు తెలుస్తోంది. సాయి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

* అంతటా విషాదం..
అయితే వారి మూడేళ్ల చిన్నారి పరిస్థితిని చూసి అటువైపుగా వెళ్లినవారు కన్నీటి పర్యాంతమయ్యారు. తన కళ్లెదుటే తల్లిదండ్రులు ఇద్దరు బలవన్మరణానికి పాల్పడడానికి చూసి ఆ చిన్నారి తట్టుకోలేకపోతోంది. గుండెలవిసేలా రోదించింది. అప్పటివరకు తనకు మాటలు చెప్పిన తల్లిదండ్రులు కనిపించకపోయేసరికి తల్లడిల్లిపోతుంది. అయితే చిన్నారితో పాటు ముగ్గురు అఘాయిత్యం చేసుకునేందుకు అక్కడకు వచ్చారు. కానీ చిన్నారిని చూసి తట్టుకోలేక పోయినా ఆ తల్లిదండ్రులు ప్రాణత్యాగం చేసుకున్నారు. కుమార్తెను ఒడ్డుపై విడిచిపెట్టి ఒక్కసారిగా నదిలోకి దూకేశారు. అయితే ఆ చిన్నారి రోదన వర్ణనాతీతం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో అదే వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Sowmya (@sowmya_chowdary_23)

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper