Homeఅంతర్జాతీయంAmerica Venezuela Oil Deal: అమెరికా, వెనెజులా ఆయిల్‌ డీల్‌.. వందేళ్ల ఆధితప్యం!

America Venezuela Oil Deal: అమెరికా, వెనెజులా ఆయిల్‌ డీల్‌.. వందేళ్ల ఆధితప్యం!

America Venezuela Oil Deal: అగ్రరాజ్యం అమెరికా.. ఇటీవ వెనెజువెలపై సైనిక చర్య చేపట్టింది. అధ్యక్షుడు నికోలస్‌ ముదురో, ఆయన భార్యను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి న్యూయార్క్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అమెరికా అనుకూల అధ్యక్షరాలిని నియమించారు. అమెరికా, వెనెజులా మధ్య ఇటీవల కుదిరిన చమురు ఒప్పందం ప్రపంచ ఇంధన రంగంలో భారీ మార్పులకు దారితీస్తోంది. ఇది కేవలం వ్యాపార ఒప్పందం కాదు, రాజకీయ, ఆర్థిక ప్రభావాలతో కూడిన వ్యూహాత్మక అడుగు. రాజకీయ సందర్భం.. నికోలస్‌ మదురో […]

America Venezuela Oil Deal: అగ్రరాజ్యం అమెరికా.. ఇటీవ వెనెజువెలపై సైనిక చర్య చేపట్టింది. అధ్యక్షుడు నికోలస్‌ ముదురో, ఆయన భార్యను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి న్యూయార్క్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అమెరికా అనుకూల అధ్యక్షరాలిని నియమించారు. అమెరికా, వెనెజులా మధ్య ఇటీవల కుదిరిన చమురు ఒప్పందం ప్రపంచ ఇంధన రంగంలో భారీ మార్పులకు దారితీస్తోంది. ఇది కేవలం వ్యాపార ఒప్పందం కాదు, రాజకీయ, ఆర్థిక ప్రభావాలతో కూడిన వ్యూహాత్మక అడుగు.

రాజకీయ సందర్భం..
నికోలస్‌ మదురో తొలగింపు తర్వాత డెల్సీ రోడ్రిగ్జ్‌ అధికారం చేపట్టారు. ఆమె నాయకత్వంలో అమెరికాతో సంబంధాలు మెరుగుపడ్డాయి. ఈ ఒప్పందం ఆ సహకారం ఫలితం. వెనెజులా ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశం. అయినా ఉత్పత్తి స్థాయి చాలా తక్కువగా ఉండేది. సంక్షోభాలు, సాంకేతిక సమస్యలు, పెట్టుబడుల లోపం వల్ల అవకాశాలు ఉపయోగపడకపోయాయి. ఇప్పుడు ఆ నిల్వల్లో కొంత భాగాన్ని అభివృద్ధి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.

ఒప్పందం ఇలా..
17 చమురు క్షేత్రాల్లో 65 బిలియన్‌ బ్యారెళ్ల సామర్థ్యం ఉన్న ప్రాంతాల అభివృద్ధి ఇందులో భాగం. ప్రైవేట్‌ భాగస్వామ్యంతో ఉమ్మడి సంస్థ ఏర్పాటు, దీర్ఘకాల హక్కులు కల్పించడం జరిగింది. అమెరికా వైపు మెజారిటీ నియంత్రణ ఉండేలా నిర్మాణం చేశారు. వెనెజులాకు వంద బిలియన్‌ డాలర్ల పైగా పెట్టుబడులు, రెండు వందల బిలియన్‌ డాలర్లకు పైగా పన్ను ఆదాయం రావచ్చని అంచనా. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు తోడ్పడుతుందని ఇరుపక్షాలు చెబుతున్నాయి.

అమెరికాకు ఇంధన భద్రత..
తాజా డీల్‌తో అమెరికాకు ఇంధన భద్రత పెరుగుతుంది. నిల్వలు రెట్టింపు కావడంతో ధరల స్థిరత్వం, సరఫరా భద్రత పెరుగుతాయి. వెనెజులాకు మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం, ఉపాధి అవకాశాలు, విదేశీ మూలధనం లభిస్తాయి. అయితే దీర్ఘకాల హక్కులు జాతీయ సార్వభౌమత్వం ప్రశ్నలు లేవనెత్తవచ్చు. ఉత్పత్తి పెరిగితే ప్రపంచ మార్కెట్‌లో సరఫరా పెరుగుతుంది. ఇది ధరలపై ప్రభావం చూపవచ్చు. పర్యావరణ అంశాలు, సాంకేతిక అమలు సవాళ్లు కూడా ఉంటాయి.

ఈ అడుగు లాటిన్‌ అమెరికా ఇంధన రాజకీయాలను మార్చే అవకాశం ఉంది. ఇతర దేశాలు ఇలాంటి భాగస్వామ్యాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థలో అమెరికా మరింత బలపడుతుంది. వెనెజులా ఆర్థిక పునరుద్ధరణకు ఇది కీలకమైన అవకాశం. అయితే అమలు వివరాలు, లాభాల పంపిణీ, స్థానిక ప్రజల ప్రయోజనాలు ఎంతవరకు చేరుతాయనే అంశాలు భవిష్యత్తులో స్పష్టం కావాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper