YS Sharmila:ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తన కుమార్తె వివాహానికి సంబంధించి కీలక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల తన సోషల్ మీడియా వేదికగా తన కుమార్తె వివాహం కుదిరిందని.. అబ్బాయి కర్నూలు జిల్లాకు చెందిన వాళ్ళని.. వాళ్ల కుటుంబం అమెరికాలో స్థిరపడిందని చెప్పిన షర్మిల.. ఇప్పుడు తన కుమార్తె అంజలి వివాహం గురించి మరో కీలక ప్రకటన విడుదల చేశారు.
“నాన్న స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులతో నా కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి, సోమల రఘురాం రెడ్డి వివాహం వైఎస్ఆర్ కుటుంబంలో మరో ఆనందమైన క్షణం.. ఇరువురి వివాహం దైవ సంకల్పం. వారి వంద సంవత్సరాలు జీవితానికి ఇది అద్భుతమైన ఆరంభం.. ఈనెల 24న నిశ్చితార్థం..వచ్చే నెల 25న పెళ్లి.. అలాగే డిసెంబర్ 5న రిసెప్షన్ నిర్వహిస్తాం. ఈ వేడుకను దేవుడి ఆశీర్వాదంతో.. నాన్నగారి ఆశీస్సులతో.. నాన్న ఘాట్ నుంచి మీతో పంచుకోవడం అత్యంత ఆనందకరం. నూతన వధూవరుల దాంపత్య జీవితం అద్భుతంగా ఉండాలి. సుఖ సంతోషాలతో సాగాలి. అంజలి రెడ్డి.. రఘురాం రెడ్డి తొలి వివాహ ఆహ్వాన పత్రికను నాన్న వైఎస్ఆర్ సమాధి వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నాను. నాన్న దీవెనలు అంజలి.. రఘురాంకు కొండంతండ.. ఆయన చూపించిన మార్గం మాకు ఎప్పుడూ ఆదర్శమని” షర్మిల వ్యాఖ్యానించారు.
షర్మిల కుమార్తె వివాహం నేపథ్యంలో ఆమె స్వగృహం వద్ద సందడి నెలకొంది. నిశ్చితార్థ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నుంచి.. ఇతర రాజకీయ పార్టీల నుంచి.. సినీ పరిశ్రమ నుంచి.. ప్రముఖులు వస్తారని తెలుస్తోంది. ఈ వేడుకను కూడా కుమారుడి పెళ్లి మాదిరిగానే ఘనంగా నిర్వహించేందుకు షర్మిల ఏర్పాట్లు చేస్తున్నారు. రఘురాం రెడ్డి కుటుంబం ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందింది. రఘురాం రెడ్డి వృత్తిగతంగా వైద్యులు. వారి కుటుంబం అమెరికాలో స్థిరపడింది. ఈ వివాహం పెద్దలు కుదిరించిందని తెలుస్తోంది. వైఎస్ఆర్ సమాధి వద్ద వివాహ పత్రికను ఉంచి.. కాబోయే వధూవరులు ఆశీస్సులు తీసుకున్నారు. ఆ సమయంలో షర్మిల.. అనిల్.. రఘురాం రెడ్డి తల్లిదండ్రులు.. షర్మిల కుమారుడు.. కోడలు ఉన్నారు. ఈ వేడుకలో వైయస్ సతీమణి విజయలక్ష్మి పాల్గొన్నారు. ఇటీవల ఆస్తుల గొడవలు.. ఇతర వ్యవహారాలు సాగుతున్న నేపథ్యంలో విజయలక్ష్మి షర్మిల వద్ద ఉంటున్నట్టు తెలుస్తోంది. షర్మిల కూడా అనారోగ్యంతో ఇటీవల వరకు బాధపడ్డారు. ఆమెకు శస్త్ర చికిత్స కూడా జరిగింది. ప్రస్తుతం బాగానే ఉన్నారు. అయితే ఈ వేడుకకు అంజలి కి కాబోయే భర్త రఘురాం హాజరు కాలేదు..
నాన్న స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి ఆశీస్సులతో నా కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డిల పరిశుద్ధ వివాహ మహోత్సవం YSR కుటుంబంలో మరో సంతోషకరమైన క్షణం. ఇరువురి కలయిక దైవ సంకల్పం. నూరేళ్ల జీవితానికి శుభారంభం.
ఈ నెల 24న నిశ్చితార్థం, నవంబర్ 25న పరిణయం, అలాగే… pic.twitter.com/nibFyREPiY
— YS Sharmila (@realyssharmila) September 18, 2026