Homeఆంధ్రప్రదేశ్‌Anant Babu and Duvvada Srinivas: సస్పెన్షన్ ఉత్తమాటే.. ఆ ఇద్దరూ జగన్ తోనే!

Anant Babu and Duvvada Srinivas: సస్పెన్షన్ ఉత్తమాటే.. ఆ ఇద్దరూ జగన్ తోనే!

Anant Babu and Duvvada Srinivas: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా కారణాలతో పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కానీ.. ఎమ్మెల్సీలను కానీ సస్పెన్షన్ చేస్తే వారిని దూరంగా ఉంచుతారు. అదేంటో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇట్టే కలిసిపోతున్నారు. నిన్న సభకు హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. సభకు హాజరై తిరిగి వచ్చే క్రమంలో నిరసన తెలిపారు. ఆ నిరసనలు ఇద్దరు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అయితే ఆ ఇద్దరూ సస్పెన్షన్ వేటుకు గురైన వారే. అయితే పేరుకే వారి సస్పెన్షన్ కానీ.. ప్రజల్లో చెడ్డ పేరు రాకూడదు అని చేశారే కానీ అన్నట్టు ఉంది నిన్నటి పరిస్థితి. బాహటంగానే ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు అధినేత జగన్మోహన్ రెడ్డి వెంట కనిపించారు. అందర్నీ ఆశ్చర్యపరిచారు.

ఎంచక్కా ఆయన పక్కనే..
కారు డ్రైవర్ హత్య కేసులో నిందితుడు ఎమ్మెల్సీ అనంత్ బాబు( MLC Anant Babu ). వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో కారు డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేశారన్న ఆరోపణలను అనంతబాబు ఎదుర్కొన్నారు. హత్య కేసులో కొద్దిరోజుల పాటు రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నారు. అప్పట్లో దళిత సంఘాల నుంచి వచ్చిన అభ్యంతరాలు, ఆందోళనల నేపథ్యంలో అనంత బాబును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆయన సస్పెండ్ కు గురయ్యారే కానీ ఎన్నడూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వేటు వేసినట్లు కనిపించలేదు. మిగతా నేతలతో కలిసే తిరుగుతున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి సభకు వచ్చినప్పుడు ఆయన వెంట కనిపించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పరిస్థితి కూడా అదే. వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలతో ఆయనపై వేటు పడింది. కానీ నిన్న జగన్తో పాటు ఆయన కనిపించారు. జగన్మోహన్ రెడ్డికి పాదాభివందనం చేశారు. ఏం చేస్తున్నావ్ అంటూ.. ఏం చేయబోతున్నావు అంటూ పలకరింపులు కూడా జరిగాయి. తద్వారా ఆయన సైతం సస్పెన్షన్ వేటు పడిన ఎమ్మెల్సీగా కాకుండా.. సొంత పార్టీ ఎమ్మెల్సీ గానే ట్రీట్ చేయాల్సి వచ్చింది.

ఇటీవల జనసేన ఎమ్మెల్యే పై ఆరోపణ..
ఇటీవల జనసేన ఎమ్మెల్యే పై లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిని జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) ప్రస్తావించారు. అటువంటి నేతలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కానీ ఈ తరహా ఆరోపణలు వచ్చి తన పార్టీ నేతలను సస్పెండ్ చేశారు కానీ. వారితోనే తిరుగుతున్నారు. వారు సైతం అధినేత పట్ల అభిమానాన్ని చూపుతూ ఆయన వెంటే నడిచినట్టు కనిపించారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి యాక్షన్లు ఉండేవి కావు. సొంత పార్టీ నేతలపై ఆరోపణలు వచ్చినప్పుడు విచారణలు ఉండేవి కావు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఈ సస్పెన్షన్లు తప్పనిసరి. కానీ అలా సస్పెన్స్ వేటుపడిన నేతలు మాత్రం జగన్మోహన్ రెడ్డి తో కలిసి కనిపిస్తున్నారు. ఆ సస్పెన్షన్లు ఉత్తమాటేనని తేల్చి చెబుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bonda Umamaheswara Rao

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...
Loan Advice

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...
AP Ration Cards

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...
Tollywood Heroes Injuries

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...
Oktelugu Epaper