Homeఆంధ్రప్రదేశ్‌Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా నిధులు జమ చేసింది. ఇంత మొత్తంలో జమ చేసిన పెద్దగా హంగామా చేయలేదు. భారీ బహిరంగ సభలు పెట్టలేదు. వేలాది మంది జనాన్ని పోగేయలేదు. భారీ ఫ్లెక్సీలు, మైకుల మోతలు కనిపించ లేదు. నిశ్శబ్దంగా పదివేల కోట్ల రూపాయలకు పైగా తల్లికి వందనం […]

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా నిధులు జమ చేసింది. ఇంత మొత్తంలో జమ చేసిన పెద్దగా హంగామా చేయలేదు. భారీ బహిరంగ సభలు పెట్టలేదు. వేలాది మంది జనాన్ని పోగేయలేదు. భారీ ఫ్లెక్సీలు, మైకుల మోతలు కనిపించ లేదు. నిశ్శబ్దంగా పదివేల కోట్ల రూపాయలకు పైగా తల్లికి వందనం నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. ప్రచార ఆర్భాటం కంటే లబ్ధిదారుడికి చేరే ప్రయోజనమే ముఖ్యమని ప్రభుత్వం భావించింది.

* ఎంతమంది ఉంటే అంతమందికి..
ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద సాయం అందింది. చివరకు సంచార జీవుల వారి పిల్లలకు సైతం అందేసరికి అందరిలో ఆనందం వ్యక్తం అవుతోంది. ఒక్కో ఇంట్లో ఐదుగురు, ఆరుగురు పిల్లల వరకు సాయం అందడం విశేషం. కానీ ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని భారీ బహిరంగ సభ పెట్టి నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం అలా చేయలేదు. ప్రచారం కోసం కాకుండా, పారదర్శకంగా ప్రజల చేతుల్లోకి వెళ్లినప్పుడే విజయం లభిస్తుంది. సభలు పెట్టి మైకుల్లో చెప్పాల్సిన అవసరం లేకుండా.. సెల్ఫోన్ కు వచ్చిన బ్యాంకు జమ మెసేజ్ చూసి ప్రతి ఇంటా ఆనందం వ్యక్తం అవుతుంది.

* సైలెంట్ వ్యూహం..
ఒకే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే.. వారికి మినహాయింపు లేకుండా ప్రతి ఒక్కరికి పథకాన్ని వర్తింపజేయడంతో పేద, మధ్యతరగతి కుటుంబాల్లో సంతృప్తి కనిపిస్తోంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ సైలెంట్ వ్యూహాన్ని అనుసరించింది. నాయకుల ప్రచారాలు చేసుకుని స్వయం ప్రశంసలు గుర్తించుకోవడం కంటే.. సాయం పొందిన కుటుంబాలు వారి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకరికి మాత్రమే అమ్మ ఒడి అందించింది. కానీ కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అందజేసి తన చిత్తశుద్ధిని చాటుకుంది. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం పట్ల సంతృప్తి కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper