Homeజాతీయ వార్తలుNEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం...

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని కూర్చున్నాయి. రోజుల తరబడి అక్కడే రైతులు వంట వరకు చేసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేవలం ఈ కోణాల ఆధారంగానే అక్కడి అన్నదాతలు ఉద్యమం చేసి ఉంటే బాగుండేది. కానీ అక్కడ రైతుల ఉద్యమం ముసుకులో ప్రత్యేక ఖలిస్తాని నినాదాలు తెరపైకి వచ్చాయి. […]

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని కూర్చున్నాయి. రోజుల తరబడి అక్కడే రైతులు వంట వరకు చేసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేవలం ఈ కోణాల ఆధారంగానే అక్కడి అన్నదాతలు ఉద్యమం చేసి ఉంటే బాగుండేది. కానీ అక్కడ రైతుల ఉద్యమం ముసుకులో ప్రత్యేక ఖలిస్తాని నినాదాలు తెరపైకి వచ్చాయి. అంతేకాదు, ఖలిస్తాని వేర్పాటు వాదులు ఏకంగా ఎర్రకోట మీద జాతీయ జెండాను పక్కనపెట్టి.. వారు రూపొందించిన జెండాను ఎగరవేశారు. పైగా హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. వీటిని ప్రపంచానికి మరో కోణంలో చూపించారు నరేంద్ర మోడీ. ఆ తర్వాత చట్టాల నుంచి వెనక్కి తగ్గారు. అనంతరం యూపీ ఎన్నికలకు వెళ్లారు. యూపీలో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.

ఇది యూపీ ఎన్నికలకు ముందు నష్టం జరగకుండా ఉండడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వేసిన పాచిక. ఇప్పుడు కూడా ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఒక పేపర్ లీకేజీ అయితే ఆ తల్లిదండ్రులు పడే బాధ మామూలుగా ఉండదు. ఇక విద్యార్థుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా నేటి కాలంలో వైద్యవిద్య అనేది కాసుల చదువు లాగా మారిపోయింది. అందువల్లే చాలామంది నీట్ లో మెరుగైన ర్యాంకు సాధించడానికి సంవత్సరాలకు సంవత్సరాలు కష్టపడుతుంటారు. అంత కష్టపడి చదివి పరీక్ష రాస్తే.. పేపర్ లీకేజీ అంటే ఆ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుంది. ఈ ఏడాది నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ కావడంతో చాలామంది విద్యార్థులు ఆత్మ న్యూనత భావంలోకి వెళ్లిపోయారు. కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. వాస్తవానికి ఈ పరిణామాలు దేశానికి ఏమాత్రం మంచివి కాదు. అన్నిటికంటే ముఖ్యంగా నరేంద్ర మోడీకి ఏమాత్రం లాభాన్ని చేకూర్చవు.

కాకపోతే కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన వెనుక కూడా విదేశీ శక్తులు ఉన్నాయని నరేంద్ర మోడీ భావిస్తున్నారు. అందువల్లే ఆందోళనలు నిర్వహిస్తున్న విద్యార్థుల వద్దకు వెళ్లడం లేదు. ఢిల్లీలో హింసాత్మక ఘటనలకు పాల్పడినప్పటికీ.. నరేంద్ర మోడీ తన స్టైల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేదు. దీనికి కారణం లేకపోలేదు. విద్యార్థుల ఉద్యమం వెనుక ఉన్న విదేశీ శక్తులను బయటపెట్టేందుకు నరేంద్ర మోడీ తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మరి కొద్ది రోజుల్లో ఆ విదేశీ శక్తుల అసలు బాగోతం బయటపడుతుందని విశ్లేషకులు అంటున్నారు. అందువల్ల నరేంద్ర మోడీ ఇటీవల కాలంలో విపరీతంగా విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. అక్కడ అనేక రకాల అంశాలను పరిశీలించిన తర్వాత.. కఠినమైన చట్టాలను నరేంద్ర మోడీ తీసుకొస్తున్నారు. అందువల్లే కొందరికి ఇది మింగుడు పడటం లేదు. అందువల్లే విద్యార్థులతో ఇలాంటి ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. అంతటి రైతుల ఉద్యమానికి నరేంద్ర మోడీ తలవంచలేదు. ఈ విద్యార్థుల ఉద్యమానికి నరేంద్ర మోడీ ఎందుకు లొంగుతాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper