Chandrababu: కచ్చితంగా ఉచిత సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రానికి శాపంగా మారనున్నాయి. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిన అంశం.మొన్నటి వరకు ఉచిత పథకాలను తప్పు పట్టిన చంద్రబా*చంద్రబాబు వస్తే బతికేయొచ్చా?
కచ్చితంగా ఉచిత సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రానికి శాపంగా మారనున్నాయి. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిన అంశం.మొన్నటి వరకు ఉచిత పథకాలను తప్పు పట్టిన చంద్రబాబు.. ఇప్పుడు జగన్ కు మించి రెట్టింపు పథకాలు అందిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. అయితే నిన్నటి వరకు పథకాలతో రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు పాటు వెనక్కి నెట్టారని విమర్శించిన వారే.. ఇప్పుడు అవే పథకాల గురించి ప్రస్తావిస్తుండటం విశేషం.
జగన్ సర్కార్ ఓ సెక్షన్ ఆఫ్ మీడియా పెద్ద దాడి చేస్తోంది. ఇప్పటివరకు ఆ దాడిని కొనసాగిస్తోంది. ఉచిత సంక్షేమ పథకాలతో రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలో నిలిపారని.. బటన్ నొక్కేందుకే జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని.. ఏపీ ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిందని.. శ్రీలంక, వెనిజులా మాదిరిగా మారిపోనుందని హెచ్చరిస్తూ టిడిపి అండ్ కో, ఎల్లో మీడియా, సోషల్ మీడియా ఊరువాడ ప్రచారం చేశాయి. రాష్ట్రం 20 ఏళ్ల పాటు వెనక్కి వెళ్లిపోయిందని.. అభివృద్ధి అన్న జాడ లేకుండా పోయిందని విస్తృత ప్రచారం కల్పించడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా మధ్యతరగతి, ఉన్నత వర్గాల్లో ఒక రకమైన ఆందోళన తీసుకురాగలిగారు.
వాస్తవానికి కొవిడ్ సంక్షోభ సమయంలో జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎంతగానో పని చేశాయి. సామాన్యుల జీవన ప్రమాణాలు పెరిగాయి. ఆర్థికపరమైన అంశాల్లో పురోగతి కనిపించింది. భవన నిర్మాణ కార్మికుల కూలీ ధరలు పెరిగాయి. అటు అనుబంధ రంగాల్లో గిట్టుబాటు పెరిగింది. పేద వర్గాల్లో కొనుగోలు శక్తి పెరిగింది. తద్వారా ధరలు కూడా పెరిగాయి. ఇవన్నీ ఇబ్బందికరంగా మారాయి. సంక్షేమ పథకాలు అందుకొని మధ్యతరగతి ప్రజలు దీనిని వ్యతిరేకించారు. అదే సమయంలో ఎల్లో మీడియా ఈ తరహా కథనాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రజల్లోకి బలంగా వెళ్లాయి.
అయితే ఇప్పుడు చంద్రబాబు సైతం ఆసక్తికరమైన ఎన్నికల మేనిఫెస్టో తయారీలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. మరోవైపు జగన్కు మించి రెట్టింపు పథకాలు ప్రకటిస్తున్నారు. జగన్ పథకాలను సైతం కొనసాగిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ లెక్కన లక్ష యాభై వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు అవసరం. అయితే ఇప్పుడు గతంలో జరిగిన చర్చ జరగడం లేదు. రాష్ట్రం శ్రీలంక, వెనిజులాల మారిపోతుందని మేధావులు చెప్పడం లేదు. అంటే వ్యక్తులు, ప్రభుత్వాలు మారిన విధంగా మేధావుల అభిప్రాయాలు మారిపోతున్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. జగన్ పథకాలు ఇస్తే తప్పు.. అవే పథకాలు చంద్రబాబు ఇస్తే ఒప్పు అన్నట్టు వారి పరిస్థితి ఉంది. చంద్రబాబు ఎన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేసినా.. అది దుబారా కాదు. అది ఈ రాష్ట్ర అభివృద్ధి అన్నట్టు ఉంది మేధావులు, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అభిప్రాయం. అది అభిమానంతో కూడిన అభిప్రాయమే తప్ప.. వాస్తవం కాదు. ఈ రాష్ట్ర అభివృద్ధి, వెనుకబాటు అన్నది మాటలే తప్ప.. మరొకటి కాదని తెలుస్తోంది. జగన్ సంక్షేమ పథకాలు అమలు చేసినప్పుడు గగ్గోలు పెట్టిన మేధావులు.. ఇప్పుడు చంద్రబాబు ప్రకటించేసరికి ఆహ్వానం తెలిపినట్టు సైలెంట్ అయ్యారు.బు.. ఇప్పుడు జగన్ కు మించి రెట్టింపు పథకాలు అందిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. అయితే నిన్నటి వరకు పథకాలతో రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు పాటు వెనక్కి నెట్టారని విమర్శించిన వారే.. ఇప్పుడు అవే పథకాల గురించి ప్రస్తావిస్తుండటం విశేషం.
జగన్ సర్కార్ పై ఓ సెక్షన్ ఆఫ్ మీడియా పెద్ద దాడి చేస్తోంది. ఇప్పటివరకు ఆ దాడిని కొనసాగిస్తోంది. ఉచిత సంక్షేమ పథకాలతో రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలో నిలిపారని.. బటన్ నొక్కేందుకే జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని.. ఏపీ ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిందని.. శ్రీలంక, వెనిజులా మాదిరిగా మారిపోనుందని హెచ్చరిస్తూ టిడిపి అండ్ కో, ఎల్లో మీడియా, సోషల్ మీడియా ఊరువాడ ప్రచారం చేశాయి. రాష్ట్రం 20 ఏళ్ల పాటు వెనక్కి వెళ్లిపోయిందని.. అభివృద్ధి అన్న జాడ లేకుండా పోయిందని విస్తృత ప్రచారం కల్పించడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా మధ్యతరగతి, ఉన్నత వర్గాల్లో ఒక రకమైన ఆందోళన తీసుకురాగలిగారు.
వాస్తవానికి కొవిడ్ సంక్షోభ సమయంలో జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎంతగానో పని చేశాయి. సామాన్యుల జీవన ప్రమాణాలు పెరిగాయి. ఆర్థికపరమైన అంశాల్లో పురోగతి కనిపించింది. భవన నిర్మాణ కార్మికుల కూలీ ధరలు పెరిగాయి. అటు అనుబంధ రంగాల్లో గిట్టుబాటు పెరిగింది. పేద వర్గాల్లో కొనుగోలు శక్తి పెరిగింది. తద్వారా ధరలు కూడా పెరిగాయి. ఇవన్నీ ఇబ్బందికరంగా మారాయి. సంక్షేమ పథకాలు అందుకొని మధ్యతరగతి ప్రజలు దీనిని వ్యతిరేకించారు. అదే సమయంలో ఎల్లో మీడియా ఈ తరహా కథనాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రజల్లోకి బలంగా వెళ్లాయి.
అయితే ఇప్పుడు చంద్రబాబు సైతం ఆసక్తికరమైన ఎన్నికల మేనిఫెస్టో తయారీలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. మరోవైపు జగన్కు మించి రెట్టింపు పథకాలు ప్రకటిస్తున్నారు. జగన్ పథకాలను సైతం కొనసాగిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ లెక్కన లక్ష యాభై వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు అవసరం. అయితే ఇప్పుడు గతంలో జరిగిన చర్చ జరగడం లేదు. రాష్ట్రం శ్రీలంక, వెనిజులాల మారిపోతుందని మేధావులు చెప్పడం లేదు. అంటే వ్యక్తులు, ప్రభుత్వాలు మారిన విధంగా మేధావుల అభిప్రాయాలు మారిపోతున్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. జగన్ పథకాలు ఇస్తే తప్పు.. అవే పథకాలు చంద్రబాబు ఇస్తే ఒప్పు అన్నట్టు వారి పరిస్థితి ఉంది. చంద్రబాబు ఎన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేసినా.. అది దుబారా కాదు. అది ఈ రాష్ట్ర అభివృద్ధి అన్నట్టు ఉంది మేధావులు, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అభిప్రాయం. అది అభిమానంతో కూడిన అభిప్రాయమే తప్ప.. వాస్తవం కాదు. ఈ రాష్ట్ర అభివృద్ధి, వెనుకబాటు అన్నది మాటలే తప్ప.. మరొకటి కాదని తెలుస్తోంది. జగన్ సంక్షేమ పథకాలు అమలు చేసినప్పుడు గగ్గోలు పెట్టిన మేధావులు.. ఇప్పుడు చంద్రబాబు ప్రకటించేసరికి ఆహ్వానం తెలిపినట్టు సైలెంట్ అయ్యారు.