Homeఆంధ్రప్రదేశ్‌Pithapuram: ఆపరేషన్ పిఠాపురం.. పవన్ పై వైసీపీ పెద్ద ఆపరేషన్

Pithapuram: ఆపరేషన్ పిఠాపురం.. పవన్ పై వైసీపీ పెద్ద ఆపరేషన్

Pithapuram: ఏపీలో ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి ఆకర్షిస్తోంది. గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ పవన్ కీలక ప్రకటన చేశారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. ఎలాగైనా పవన్ ను ఓడించాలన్న వైసీపీ పావులు కదపడం ప్రారంభించింది. పవన్ ప్రకటనతో టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు ఆందోళనకు దిగారు. భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. తనను కలవాలని వర్మకు సూచించారు.

ఇప్పటికే ఇక్కడ వైసిపి అభ్యర్థిగా కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత పేరును ఖరారు చేశారు. పవన్ పోటీ చేయబోతున్నారన్న సమాచారం మేరకు ముద్రగడ పద్మనాభం పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన ద్వారా కొంతవరకు పవన్ కు చెక్ చెప్పాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే రీజనల్ ఇన్చార్జ్ మిధున్ రెడ్డి రంగంలోకి దిగారు. నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీ పై దృష్టి పెట్టారు. అక్కడ తమతో కలిసి వచ్చే వారిపై ఫోకస్ పెట్టారు. పోల్ మేనేజ్మెంట్ పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. టిడిపి జనసేన ల నుంచి వచ్చే నాయకులను ఆకర్షించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశారు. అటు సామాజికపరంగా ముద్రగడ సేవలను వినియోగించుకోవాలని చూస్తున్నారు.

పిఠాపురంలో కాపు సామాజిక వర్గం అధికం. దాదాపు 91 వేల పైగా ఆ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. కాపుల్లో మెజారిటీ వర్గం పవన్ వెంట నడుస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అందుకే ముద్రగడ ద్వారా కొంత అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు. మాలలతోపాటు శెట్టిబలిజలు, చేనేత కార్మికులు, బెస్తలను వైసీపీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. రెడ్డి, యాదవ,తూర్పు కాపు, మాదిగ సామాజిక వర్గాన్ని ఆకర్షించాలని భావిస్తున్నారు. మొత్తం ఆ సామాజిక వర్గ నేతలను పిఠాపురంలో ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో అసంతృప్తితో ఉన్న టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మకు సైతం వైసీపీ కీలక నేతలు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పుడు పిఠాపురంలో వర్మ కీలకం కానున్నారు. 2014 ఎన్నికల్లో టికెట్ దక్కకపోయేసరికి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వర్మ విజయం సాధించారు. ఇప్పుడు కూడా అదే తరహా ప్రయత్నం చేయాలని మద్దతుదారులు కోరుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలోనే వర్మకు చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. తనను కలవాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. పవన్ పోటీలో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు వర్మను సముదాయిస్తారని.. ఆయన భవిష్యత్తుకు భరోసా ఇస్తారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. అయితే వైసీపీ మాత్రం తన ఆపరేషన్ మొదలుపెట్టింది. పవన్ ను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అందులో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular