Homeఆంధ్రప్రదేశ్‌Bharathi Cement Factory: 'భారతి' పై తిరుగుబాటు!

Bharathi Cement Factory: ‘భారతి’ పై తిరుగుబాటు!

Bharathi Cement Factory: ఏదైనా పరిశ్రమల వద్ద బాధితులు ఆందోళన తెలపడం సర్వసాధారణం. అయితే ఇప్పుడు వైయస్సార్ కడప జిల్లా కమలాపురం మండలం నల్ల లింగాయపల్లె లో రైతులు ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. అక్కడ భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద నిర్వాసిత రైతులతోపాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు సమయంలో తమ విలువైన భూములను అప్పగించిన రైతు కుటుంబాలకు శాశ్వత ఉపాధి కల్పిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. సరైన నష్టపరిహారం […]

Bharathi Cement Factory: ఏదైనా పరిశ్రమల వద్ద బాధితులు ఆందోళన తెలపడం సర్వసాధారణం. అయితే ఇప్పుడు వైయస్సార్ కడప జిల్లా కమలాపురం మండలం నల్ల లింగాయపల్లె లో రైతులు ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. అక్కడ భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద నిర్వాసిత రైతులతోపాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు సమయంలో తమ విలువైన భూములను అప్పగించిన రైతు కుటుంబాలకు శాశ్వత ఉపాధి కల్పిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. సరైన నష్టపరిహారం అందిస్తామని కూడా చెప్పుకొచ్చారు. అయితే యాజమాన్యం పూర్తిగా పక్కన పెట్టడంతో బాధితుల్లో ఆగ్రహం ఒక్కసారిగా వ్యక్తం అయింది. అందుకే పరిశ్రమ ఎదుట నిరసన శిబిరం ఏర్పాటు చేసి మరి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఉద్యోగాలు తొలగింపు..
పరిశ్రమ ఏర్పాటు సమయంలో అప్పటి ప్రభుత్వం చాలా రకాలుగా హామీలు ఇచ్చింది నిర్వాసితులకు. భూములు త్యాగం చేసిన రైతులకు ప్రాథమికంగా ఉద్యోగాలు ఇచ్చినట్లు ఇచ్చి.. క్రమేపీ రకరకాల కారణాలు చూపిస్తూ వారిని విధుల నుంచి తొలగిస్తోంది. తాత్కాలిక ప్రాతిపదికను తీసుకున్న కొద్ది మందికి కూడా అరకొర జీతాలు అందిస్తోంది. ఇటీవల కనీస ముందస్తు సమాచారం లేకుండా వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తోంది. ఈ పరిస్థితి రోజురోజు పూర్తి ఎవరమవుతుండడంతో బాధితులు ఆందోళనకు దిగారు. భారతి సిమెంట్ ఫ్యాక్టరీ ప్రధాన గేటును ముట్టడించి భారీ ధర్నా చేపట్టారు. యాజమాన్య వైఖరిని ఎండగట్టారు. దీంతో పరిస్థితి కొంచెం అదుపు తప్పింది.

అనతి కాలంలోనే..
భారతి సిమెంట్స్ 2008 నుంచి ప్రారంభమైంది. అంతకుముందు రఘురాం సిమెంట్స్ పేరిట ఉండేది. దీనిని 1999లో ప్రారంభించారు. దీని ప్రధాన కార్యాలయం తెలంగాణలోని హైదరాబాదులో ఉంది. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కమలాపురం సమీపంలో అత్యాధునిక టెక్నాలజీతో ఫ్యాక్టరీ నిర్మితం అయింది. యాట ఐదు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యాన్ని కలిగి ఉంది ఈ ఫ్యాక్టరీ. ఫ్రాన్స్ కు చెందిన వికాట్ అనే సంస్థ మెజారిటీ వాటాలను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే భారతి సిమెంట్స్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన ది అనేది బహిరంగ రహస్యం. రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మితమైన ఈ పరిశ్రమకు సంబంధించి ఇతర జిల్లాల్లో కేటాయించిన భూములు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. చివరికి ఆ కుటుంబంలో సైతం చిచ్చు రేపింది ఈ అంశంపైనే. అయితే అనంతపురం జిల్లాలో ఏకంగా ప్లాంట్ ఎదుట బాధితులు ఆందోళనకు దిగడం సంచలనంగా మారింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper