Telangana Urea shortage : పొట్ట దశలో వరి ఉంది. కాయ దశలో పత్తి ఉంది. మొక్కజొన్న పీచులు వేస్తోంది. మిరప పూతకు వచ్చింది. పసుపు ఏపుగా పెరుగుతోంది. ఇలా ప్రతి పంట కూడా ఎదుగుదల దశలో ఉంది. ఇలాంటి సందర్భంలో పంట దిగుబడి మరింత రావాలంటే యూరియా కచ్చితంగా ఉండాలి. ఈసారి వరి విస్తీర్ణం తెలంగాణలో ఎక్కువ పెరిగింది. దీంతో సాధారణంగానే యూరియాకు డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి స్థితిలో రైతుల అవసరాలకు తగ్గట్టుగా యూరియా సరఫరా చేసి ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. రైతుల అవసరాలు ఎక్కువగా ఉండడం.. యూరియా సప్లై సరిగా లేకపోవడంతో ఒక్కసారిగా కొరత ఏర్పడింది. దీనికి తోడు వర్షాలు కురుస్తూ ఉండడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఈ నేపద్యంలో రైతులు యూరియా కొనుగోలు కోసం బారులు తీరారు. యూరియా సప్లై అనేది కేంద్రం చేతిలో ఉంటుంది కాబట్టి.. రాష్ట్రం కూడా కేంద్రం వైపుగానే ఆశగా చూస్తోంది. మరోవైపు కేంద్రం ఏమో అరకొర యూరియా సప్లై చేస్తోంది. దీంతో రైతులు ఆందోళన బాట పట్టారు.
గడిచిన 10 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో యూరియా కోసం రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కొన్నిచోట్ల అయితే యూరియా కోసం తెల్లవారుజామునే పంపిణీ కేంద్రాల వద్దకు వస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ రైతుల అవసరాలకు తగ్గట్టుగా యూరియా సప్లై కాకపోవడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. పంటలు ఏపుగా ఉన్న దశలో యూరియా అవసరం కాబట్టి.. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగుచేసిన రైతులకు యూరియా అవసరాలు అధికంగా ఉండడం.. ప్రభుత్వం ఇచ్చే ఒక్క బస్తా సరిపోకపోవడంతో పరిస్థితి నానాటికి జటిలంగా మారుతోంది.. ఇదే క్రమంలో యూరియా తీసుకోవడానికి రైతులు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇంటిల్లిపాది క్యూలో ఉంటున్నారు. ఇంత కష్టపడుతున్నప్పటికీ అవసరాలకు తగ్గట్టుగా యూరియా రావడం లేదు.
రైతులు అడ్డుకున్నారు
సిద్దిపేట మండలం ఇర్కోడ్ గ్రామంలో యూరియా ఆడినందుకు రైతును పోలీసులు అదుపులోకి తీసుకోబోయారు. అయితే మిగతా రైతులు ముకుమ్మడిగా తిరగబడ్డారు. పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పు పట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఇది కాస్త గొడవకు దారి తీస్తోందని భావించిన ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ వ్యవహారం మొత్తాన్ని వీడియో తీసిన కొంతమంది సోషల్ మీడియాలకు ఎక్కించారు. గులాబీ అనుకూల సోషల్ మీడియా గ్రూపులో ఈ వీడియోను తెగ తిప్పుతున్నాయి. తెలంగాణ రైతుల్లో తిరుగుబాటు మొదలైందని రాస్తున్నాయి.
తెలంగాణలో తిరుగుబాటు మొదలైంది!
యూరియా అడిగిన తోటి రైతును అరెస్ట్ చేయబోతే పోలీసుల మీద మూకుమ్మడిగా తిరగబడ్డ రైతులు
సిద్దిపేట మండలం ఇర్కోడ్ గ్రామంలో యూరియా అడిగిన రైతును అరెస్టు చేయబోయిన పోలీసులు
తోటి రైతుకు మద్దతుగా పోలీసులపై మూకుమ్మడిగా తిరగబడ్డ రైతులు pic.twitter.com/uBOziRbAf2
— Telugu Scribe (@TeluguScribe) September 11, 2025