Southwest Monsoon Andhra Pradesh: ఏపీలో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఒకవైపు ఎండలు దంచి కొడుతున్నాయి. మరోవైపు వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే రాయలసీమ ప్రాంతానికి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. మెల్లగా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించి ఉన్నాయి. ఈ వారంలోనే రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈరోజు అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
* మంగళవారం విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, పోలవరం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు పడ్డాయి. కొన్నిచోట్ల అయితే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి.
* మరి కొన్ని జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో 13, శ్రీకాకుళం జిల్లాలో 10 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో ఆరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు, పోలవరం, కాకినాడ జిల్లాలో 8, పశ్చిమగోదావరి జిల్లాలో రెండు మండలాలు, కృష్ణా జిల్లాలో మూడు మండలాలు… ఏలూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒక్కో మండలంలో తీవ్ర వేడిగాలులు వీచాయి.
* ఈరోజు విజయనగరం, పార్వతీపురం మన్యం,అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
Southwest Monsoon Andhra Pradesh: రాయలసీమకు నైరుతి.. ఆ జిల్లాలకు వానలే!
Southwest Monsoon Andhra Pradesh: ఏపీలో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఒకవైపు ఎండలు దంచి కొడుతున్నాయి. మరోవైపు వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే రాయలసీమ ప్రాంతానికి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. మెల్లగా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించి ఉన్నాయి. ఈ వారంలోనే రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈరోజు అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు […]