Homeఆంధ్రప్రదేశ్‌Raghurama Krishnam Raju: రఘురామకృష్ణం రాజు అజెండా టిడిపికి నష్టమా? లాభమా?

Raghurama Krishnam Raju: రఘురామకృష్ణం రాజు అజెండా టిడిపికి నష్టమా? లాభమా?

Raghurama Krishnam Raju: ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా సామాజిక వర్గాల పరంగా సభలు, సమావేశాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా దళిత బహుజన సభలు అంటూ నిర్వహిస్తున్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటున్నారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు కూడా చేస్తున్నారు జడ శ్రావణ్ కుమార్ తో పాటు దళిత నేతలు. దీంతో టీడీపీ కూటమిలో సైతం ఒక ఆలోచన వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. గత కొంతకాలంగా రఘురామకృష్ణం […]

Raghurama Krishnam Raju: ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా సామాజిక వర్గాల పరంగా సభలు, సమావేశాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా దళిత బహుజన సభలు అంటూ నిర్వహిస్తున్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటున్నారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు కూడా చేస్తున్నారు జడ శ్రావణ్ కుమార్ తో పాటు దళిత నేతలు. దీంతో టీడీపీ కూటమిలో సైతం ఒక ఆలోచన వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. గత కొంతకాలంగా రఘురామకృష్ణం రాజు సొంత అజెండాతో ముందుకు వెళుతుండగా.. ఆయనకు వ్యతిరేకంగా దళిత బహుజన సభలు జరుగుతుండడం ఇప్పుడు ఏపీలో సరికొత్త పరిణామం.

* నాలుగు నెలలుగా సొంత అజెండాతో..
గత నాలుగు నెలలుగా రఘురామకృష్ణం రాజు ఒక సొంత అజెండాతో ముందుకు వెళ్తున్నారు. హిందుత్వ వాదాన్ని బలంగా తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఒక వేదికను సైతం ఏర్పాటు చేశారు. దానికి విపరీతంగా స్పందన వస్తోంది. ఆయనకు అభిమాన గణం కూడా పెరుగుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ హిందుత్వ వాదాన్ని వినిపించారు. కానీ రఘురామకృష్ణంరాజు స్థాయిలో మాత్రం కాదు. నేరుగా హిందూ ఆలయాల పరిరక్షణతో పాటు హిందుత్వవాదం గురించి ఎక్కువగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ లాంటి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఆయన వెనక్కి తగ్గడం లేదు. దీంతో హిందుత్వ వాదం ఉన్న ప్రతి ఒక్కరు రఘురామకృష్ణం రాజును అభిమానిస్తున్నారు.

* తెర వెనుక బిజెపి..
తెలుగుదేశం పార్టీ కూడా రఘురామకృష్ణంరాజు విషయంలో చూసి చూడనట్టుగా ముందుకు వెళ్తోంది. కానీ చాలామంది టిడిపి నేతలు ఈ పరిణామాలతో ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భయపడుతున్నారు. ఇక్కడే భిన్న వాదన వినిపిస్తోంది. టిడిపికి ఎటువంటి నష్టం జరగదు అని రఘురామకృష్ణంరాజు చెబుతున్నారు. అసలు దళితులు టిడిపికి ఓటు వేయరని.. అటువంటప్పుడు వారితో రాజకీయం చేస్తున్న వారిని ఎందుకు భయపడాలని ప్రశ్నిస్తున్నారు. పైగా రఘురామకృష్ణంరాజు వెనుక ఆర్ఎస్ఎస్ తోపాటు విశ్వహిందూ పరిషత్ లాంటివి ఉన్నాయని.. దళిత క్రిస్టియానిటీని ఇప్పటికే బిజెపి వ్యతిరేకం అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఎక్కువమంది. అయితే ఇది టిడిపికి నష్టం చేయకపోగా.. లాభం చేకూరుస్తుందన్న వారు ఉన్నారు. దళిత బహుజన్ సభల వెనుక వైసీపీ అజెండా ఉంటే.. రఘురామకృష్ణం రాజు హిందుత్వ ఓట్లను ఏకతాటిపైకి తెస్తున్నారు అన్నవారు కూడా ఉన్నారు. మరి ఈ సభలు, ఈ పరిణామాలు రాజకీయంగా ఏ పార్టీకి ఇబ్బందికరం అవుతాయి? ఏ పార్టీకి ప్రయోజనం చేకూరుస్తాయి? అనేది చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper