Quality Liquor In AP: బీహార్లో ( Bihar) ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఈ విజయం వెనుక అనేక అంశాలు పనిచేసాయి. అందులో ప్రధానమైనది మద్య నిషేధం. అక్కడ పూర్తిగా మద్యం నిషేధిస్తామని ఎన్ డి ఏ హామీ ఇచ్చింది. దీంతో అక్కడి ప్రజలు ఎన్డీఏకు పట్టం కట్టారు. కానీ ఏపీలో మాత్రం అందుకు విరుద్ధం. ఇక్కడ నాణ్యమైన మద్యం ఇస్తామని ఎన్ డి ఏ కూటమి హామీ ఇవ్వడంతో అధికారాన్ని కట్టబెట్టారు ఇక్కడి ప్రజలు. అంతకుముందు వైసీపీ ప్రభుత్వం నాసిరకమైన మద్యం ఇవ్వడంతో.. అనర్ధాలు జరిగాయి. బ్రాండెడ్ మద్యం అందిస్తామని కూటమి హామీ ఇవ్వడంతో మందుబాబులు మొగ్గు చూపారు. అయితే ఇప్పుడు కూడా మద్యం ఎఫెక్ట్ ఏపీ పై ప్రభావం చూపుతోంది. కానీ దానిపై ఎటువంటి చర్చ లేదు.
* ఎన్నికల్లో హామీగా..
2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ). ఆ సమయంలో అనేక రకాల హామీ ఇచ్చారు. అందులో ప్రధానమైనది మద్య నిషేధం. కానీ అధికారంలోకి వచ్చాక అమలు చేయలేకపోయారు. పైగా ప్రభుత్వమే సొంతంగా మద్యం దుకాణాలను నడిపింది. అప్పటివరకు ఉన్న ప్రీమియం బ్రాండ్లను పక్కకు నెట్టింది. నాసిరకం బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. దేశంలో ఎక్కడా వినని, చూడని బ్రాండ్లు దర్శనమిచ్చాయి. ప్రజారోగ్యానికి తీవ్రభంగం వాటిల్లింది. జగన్ సర్కార్లో చలనం లేకుండా పోయింది. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయి. మద్యం అనేది వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఒకవైపు మద్య నిషేధం అని హామీ ఇచ్చి.. మరోవైపు నాసిరకం మద్యం సప్లై.. సొంతంగా ప్రభుత్వ షాపుల ఏర్పాటు వంటివి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే కూటమి ప్రభుత్వం తెలివిగా మద్యనిషేధం హామీ ఇవ్వకుండా.. అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. ప్రజలు దీనిని బలంగా నమ్మారు. కూటమిని అధికారంలోకి తెచ్చారు.
* చేతులెత్తేసిన వైసిపి..
అయితే ఇప్పుడు బీహార్ ఫలితం ఏపీకి గుణపాఠమే. అధికారంలో ఉన్న పార్టీ మద్యాన్ని నిషేధించింది. దానిని ప్రజలు గుర్తించారు. కానీ ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి వచ్చేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్య నిషేధ హామీ ఇచ్చింది. కానీ అమలు చేయలేక చేతులెత్తేసింది. పైగా నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడింది. దానిని క్యాష్ చేసుకుంది కూటమి. నాసిరకం మద్యం స్థానంలో నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని ఇచ్చిన హామీ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఎక్కడైనా మద్య నిషేధం చేస్తే ప్రజలు ఆహ్వానించాలి. కానీ ఏపీలో మాత్రం నాణ్యమైన మద్యాన్ని అందిస్తామంటే ఇక్కడి ప్రజలు నమ్మారు. అయితే దీనికి ముమ్మాటికి కారణం వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే. గతం కంటే మద్యం అమ్మకాలు పెరిగాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. కానీ దీనిపై వ్యతిరేకత వ్యక్తం కావడం లేదు. ఈ విషయంలో వైసీపీ కంటే కూటమి సక్సెస్ అయినట్టే.