Maoist Leader Hidma Encounter: ఏపీలో( Andhra Pradesh) చాలా రోజులకు తుపాకీ శబ్దం వినిపించింది. మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత మాడ్వి హిడ్మా హతం అయ్యారు. ఏపీ తెలంగాణ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో ఆయనతోపాటు భార్య రాజి అలియాస్ రాజక్క కూడా చనిపోయారు. ఏపీ డీజీపీ హరీష్ గుప్తా ఈ మరణాలను ధ్రువీకరించారు. హిడ్మా పై కోటి రూపాయల రివార్డు ఉంది. గత కొద్ది రోజులుగా ఆయన కోసం భద్రతా దళాలు గాలిస్తున్నాయి. అయితే ఒరిస్సా ఎన్కౌంటర్లతో పాటు అగ్రనేతల లొంగుబాటుతో సేఫ్ జోన్ కోసం ఆయన ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు వెళ్లారు. ఈ క్రమంలోనే భద్రతా దళాల కాల్పుల్లో చనిపోయారు.
Also Read: వంగవీటి కుటుంబాన్ని చీల్చిన జగన్.. వర్కౌట్ అవుతుందా?
అనతి కాలంలోనే అగ్రనేతగా..
చత్తీస్గడ్ లోని( Chhattisgarh) సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామానికి చెందిన మాడ్వి హిడ్మా ఆదివాసి తెగకు చెందిన వ్యక్తి. 1981లో జన్మించిన ఆయన బాల సంఘం ద్వారా మావోయిస్టు పార్టీలో చేరారు. విప్లవ భావాలను నరనరాన ఎక్కించుకున్నారు. కిషన్ జి అలియాస్ భద్రన్న నేతృత్వంలో సాయిధ పోరులో అడుగులు వేశారు. ఆపై జేగురుగొండ ప్రాంత దళ కమాండర్ గా ఉన్న సమయంలో.. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఆధ్వర్యంలో జరిగిన టేకుమెట్ల దాడిలో ముందుండి నడిచారు. ఈ దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. అప్పటినుంచి హిడ్మాకు మావోయిస్టులలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. గెరిల్లా దాడులకు పెట్టింది పేరు. పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్ గా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా కూడా ఆయన పని చేశారు. మావోయిస్టుల దళాల్లో హిడ్మా దళం అత్యంత శక్తివంతమైనది గా పేరు తెచ్చుకుంది.
Also Read: వైట్ కాలర్ ఉగ్రవాదం.. ఒళ్లు గగ్గుర్లు పొడిచే నిజం!
షెల్టర్ కోసం ప్రవేశం..
అయితే అటువంటి శక్తివంతమైన మావోయిస్టు నేత ఏపీలో ఎన్కౌంటర్ కావడం విశేషం. మావోయిస్టులపై ఇటీవల నిర్బంధం పెరిగిపోవడంతో షెల్టర్ కోసం పెద్దగా నిఘా ఉండదని భావించి.. అల్లూరి జిల్లాలోని అటవీ ప్రాంతంలోకి వచ్చింది హిడ్మా దళం. ఏపీ ఇంటలిజెన్స్ కు పక్కా సమాచారం అందడంతో.. ఆ విభాగం చీఫ్ మహేష్ చంద్ర లడ్డా ఈ ఆపరేషన్ పూర్తి చేశారు.హిడ్మా తో పాటు మరో ఐదుగురు చనిపోయారు. మొత్తం ఆరు మృతదేహాలను గుర్తించారు.