Homeఆంధ్రప్రదేశ్‌Amaravati capital controversy : "రాజధాని" కడతామంటే స్వాగతించని ప్రజలు

Amaravati capital controversy : “రాజధాని” కడతామంటే స్వాగతించని ప్రజలు

Amaravati capital controversy : జగన్ కొత్త రాజధాని ప్రతిపాదనతో అమరావతి చుట్టుపక్క ప్రాంతాల్లో మరింత వ్యతిరేకత ప్రారంభం అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై. వైసీపీ ఆవిర్భావం తర్వాత మూడు ఎన్నికలు జరిగితే ఆ రెండు జిల్లాలు ఒకేసారి నమ్మాయి 2019లో. అది కూడా అమరావతి రాజధానిని కదిపించను అనే మాటను ప్రధానంగా నమ్మారు. ఆ నమ్మకంతోనే 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల స్టాండును తీసుకున్నారు అప్పటివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంట నడిచిన వర్గాలు సైతం యూటర్న్ తీసుకున్నాయి. 2024 ఎన్నికల్లో అమరావతి చుట్టుపక్కల ఉన్న ఉమ్మడి జిల్లాలన్నీ గుంప గుత్తిగా టిడిపి కూటమికి ఓటు వేసాయి. ఇప్పుడు మావిగన్ ప్రతిపాదన అనేది కేవలం ఒక చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి చేయలేదు. అమరావతిపై విషం కక్కుతూ అలాంటి నిర్ణయం తీసుకున్నారని అటు విజయవాడ, ఇటు గుంటూరు ప్రజలు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం పై సానుకూలత కంటే ఆ ప్రాంతాల్లో వ్యతిరేకత అధికంగా ఉంది.

* ఆహ్వానించని స్థానికులు
ఏదైనా ఒక ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తామంటే అక్కడి ప్రజలతో పాటు చుట్టుపక్కల వాళ్ళు ఆహ్వానిస్తారు. 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రతిపాదిస్తూ తెరపైకి తెచ్చింది. దానిని అన్ని రాజకీయ పక్షాలు సమ్మతించాయి. గుంటూరు తో పాటు విజయవాడ ప్రజలు కూడా ఎంతగానో ఆనందించారు. అమరావతి తో ఈ రెండు నగరాలు అనుసంధానం జరిగి శరవేగంగా అభివృద్ధి చెందుతాయని భావించారు. దానిని ఆహ్వానించారు కూడా. అయితే ఆ ప్రాంతానికి రాజధానిగా గుర్తింపు ఇస్తే అదే ప్రజలు 2019 ఎన్నికల్లో టిడిపిని వ్యతిరేకించారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి సైతం అమరావతిని కొనసాగిస్తానని చెప్పడమే. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల స్టాండ్ తీసుకున్నారో.. అసలు తత్వం బోధపడింది ఆ ప్రాంతీయులకు. అప్పటినుంచి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డిని వారు వ్యతిరేకిస్తూనే ఉన్నారు.

* మూడు రాజధానులు అన్నప్పుడు..
మూడు రాజధానుల స్టాండ్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని చెప్పుకొచ్చారు. వెనుకబాటు తనం రూపుమాపడానికి తాను ఈ నిర్ణయం తీసుకున్నానని సెలవిచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాటను విశాఖ ప్రజలు నమ్మలేదు. ఉత్తరాంధ్రవాసులు సైతం పెద్దగా ఆసక్తి చూపలేదు. 2024 ఎన్నికల్లో దారుణంగా దెబ్బతీశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం- విజయవాడ- గుంటూరును కలుపుతూ మావిగన్ అనే కొత్త రాజధానిని తెరపైకి తెచ్చారు. కానీ ఇలా ప్రతిపాదన చేసిన ఆ మూడు ప్రాంతాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించలేదు. కనీసం హర్షం వ్యక్తం చేయడం లేదు. తద్వారా జగన్ తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పే ప్రయత్నం చేశారు ప్రజలు. ఎక్కడైనా రాజధాని మీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామంటే అక్కడి ప్రజలు సంబరపడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల విషయంలో స్థానికులు అలా చేయడం లేదు. పైగా వ్యతిరేకిస్తున్నారు కూడా.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Oktelugu Epaper