Homeఅంతర్జాతీయంSheikh Hasina Death Sentence Explained: హసీనాకు మరణశిక్ష.. భగ్గుమన్న బంగ్లాదేశ్‌.. మరో తిరుగుబాటు?

Sheikh Hasina Death Sentence Explained: హసీనాకు మరణశిక్ష.. భగ్గుమన్న బంగ్లాదేశ్‌.. మరో తిరుగుబాటు?

Sheikh Hasina Death Sentence Explained: గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల అంశం మంటలు రేపింది. భారీ ఉద్యమంతో అల్లకల్లోలం నెలకొంది. దీంతో ప్రజలు తిరుగుబాటుతో షేక్‌ హసీనా పదవికి రాజీనామా చేసి దేశం వీడారు. తాజాగా మళ్లీ బంగ్లాదేశ్‌ మండుతోంది.
బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై ఇంటర్నేషనల్‌ క్రై మ్స్‌ ట్రైబ్యునల్‌ (ఐసీటీ) విధించిన మరణశిక్ష దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ ప్రకంపనలు రేపింది. ఆమె మద్దతుదారులు వీధులపైకి వచ్చి నిరసనలు ప్రారంభించడంతో ఢాకా సహా పలు నగరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనల్లో ఇద్దరు మరణించగా పలువురు గాయపడ్డారు. పోలీసులు నిరసనకారులను చెదరగొట్టేందుకు సౌండ్‌ గ్రెనేడ్లు, టియర్‌ గ్యాస్‌ వినియోగించాల్సి వచ్చింది. ధన్మొండి 32 ప్రాంతంలో హసీనా తండ్రి ముజిబుర్‌ రెహమాన్‌ నివాసం సమీపంలో అల్లర్లు ఎక్కువయ్యాయన్న సమాచారం అధికారులు« ధ్రువీకరించారు.

Also Read: షేక్ హసీనా పై ఇంతటి ప్రతీకారమా? మరణ శిక్ష వెనక అసలు కారణమిదే!

అవామీ లీగ్‌ పిలుపుతో దేశ బంద్‌
హసీనా మద్దతుదారుల పార్టీ అవామీ లీగ్‌ ప్రభుత్వం కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రెండు రోజుల బంద్‌ ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శులు ఈ చర్యను ‘ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం‘గా అభివర్ణించారు. మరోవైపు తాత్కాలిక ప్రభుత్వం నాయకుడు మహ్మద్‌ యూనస్‌ పోలీసులను, సైనిక బలగాలను సున్నిత ప్రాంతాల్లో మోహరించారు. వాణిజ్య కేంద్రాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. రవాణా నిలిచిపోయింది. ప్రజల్లో అసహనం పెరుగుతూ బంగ్లాదేశ్‌ మళ్లీ రాజకీయంగా అస్థిర దిశలో వెళ్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రవాసంలోనూ హసీనా పోరాట నినాదం..
విద్యార్థి నిరసనల నడుమ గత ఏడాది ఆగస్టులో షేక్‌ హసీనా పదవి వీడి భారత్‌ చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె ఢిల్లీలోని రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. స్వదేశంలో ఆందోళనల సమయంలో హత్యలు, అణచివేత చర్యలకు ఆమెనే కారణమని ఐసీటీ అభియోగం మోపింది. హసీనా ఈ తీర్పును ‘‘పాలిటికల్‌ రివెంజ్‌’’గా అభివర్ణిస్తూ ఖండించారు. ‘ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ కుట్ర ఫలితమే ఈ తీర్పు,‘ అని ఆమె పేర్కొన్నారు. తన మద్దతుదారులను నిరాశ చెందవద్దని, ప్రజాస్వామ్యం పునరుద్ధరించే వరకు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.

Also Read: బంగ్లాదేశ్‌లో మరో తిరుగుబాటు.. ఈసారి ఎవరిపై అంటే!?

రాజకీయ ప్రతీకారం?
మాజీ ప్రధానికి మరణశిక్ష విధించడం బంగ్లాదేశ్‌ న్యాయ, రాజకీయ వ్యవస్థను రెండు భాగాలుగా విడదీసింది. ఒకవైపు మానవ హక్కుల ఉల్లంఘనలకు బాధ్యత నెరవేర్చే ప్రయత్నమని తాత్కాలిక ప్రభుత్వ వాదన ఉండగా, మరోవైపు ఇది ప్రతిపక్షాలపై వ్యవస్థాపిత ప్రతీకార చర్యగా ఉందని హసీనా అనుచరులు అంటున్నారు. విదేశీ విశ్లేషకులు దీనిని ‘‘బాంగ్లా డెమోక్రసీ క్రాస్రోడ్స్‌’’గా నిర్వచిస్తున్నారు. తీర్పు నేపథ్యంతో అంతర్జాతీయ సమాజం స్పందన కూడా కీలకంగా మారబోతోంది.

హసీనాకు మరణ శిక్ష తీర్పు తరువాతి దశలు బంగ్లాదేశ్‌ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఒకవైపు తాత్కాలిక ప్రభుత్వం చట్టస్ఫూర్తి పేరుతో వ్యవహరించగా, మరోవైపు ప్రజల్లో భావోద్వేగాలు ఉవ్వెత్తున ఎగశాయి. ఈ వాతావరణంలో రాజకీయ చర్చలు సజావుగా సాగడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular