Homeఆంధ్రప్రదేశ్‌Mahesh Kumar Goud: పవన్ కళ్యాణ్ కాదట కమల కళ్యాణ్ అట.. పీసీసీ చీఫ్ మహేష్...

Mahesh Kumar Goud: పవన్ కళ్యాణ్ కాదట కమల కళ్యాణ్ అట.. పీసీసీ చీఫ్ మహేష్ కు ఎందుకింత ఆగ్రహం..

Mahesh Kumar Goud: పవన్ కళ్యాణ్ విషయంలో కాంగ్రెస్ నేతలు ఆగడం లేదు. తమ స్థాయికి మించి విమర్శలు చేస్తున్నారు. మందుల సామ్యూల్.. అనిరుద్ రెడ్డి.. పొన్నం ప్రభాకర్.. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్.. పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగుపెడితే చాలు వీరికి విపరీతమైన కోపం వస్తోంది. సమయం, దొరికినప్పుడల్లా సందర్భం లేకుండానే తిట్టేస్తున్నారు. పైగా ఆ తిట్టే విధానంలో కూడా పరుష పదజాలం ఉపయోగిస్తున్నారు.

తెలంగాణలో పార్టీ కార్యాలయం ఏర్పాటు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. ఇది జరగగానే వెంటనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెరపైకి వచ్చారు. ఈసారి విమర్శల దాడిని మరింత పెంచారు. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఊగిపోయారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉంది. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ రాహుల్ గాంధీ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కూడా రాహుల్ గాంధీ పై మండిపడ్డారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ పవన్ కళ్యాణ్ పై ఊగిపోయారు. పవన్ కళ్యాణ్ పేరు కమల కళ్యాణ్ అంటూ ఆరోపించారు. కమల కళ్యాణ్ తో మాకు ఎటువంటి ఇబ్బంది లేదని.. తెలంగాణకు వచ్చి ఏదో సాధిస్తానని అనుకోవడం పగటి కల అని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. బిజెపికి అనేక రెక్కలు ఉన్నాయని.. అందులో పవన్ కళ్యాణ్ ఒకడు అని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఇంటికి వస్తే భోజనం పెడతానని.. ఇక్కడ రాజకీయాలు చేస్తానంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటలను పట్టించుకోవడంలేదని.. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో ఎలా సీరియస్ గా స్పందిస్తారని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయాలు చేయబోనని.. ఇంతకుముందే చెప్పారు. తెలంగాణలో ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తూనే ఉంటానని ఆయన అన్నారు. అలాంటప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ స్థాయిలో ఎందుకు స్పందిస్తున్నారు.. తెలంగాణలో తెలంగాణ బిడ్డలు మాత్రమే రాజకీయాలు చేస్తారని పవన్ కళ్యాణ్ అన్నప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఎందుకంత ఆవేశపడుతున్నారు.. కెసిఆర్ మాటలను తెలంగాణ ప్రజలు పట్టించుకున్నప్పుడు.. పవన్ కళ్యాణ్ కు మాత్రం ఎందుకంత పొలిటికల్ స్పేస్ ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ అనుకుంటున్నారు.. తనకు ఆంధ్రప్రదేశ్లోనే దిక్కు లేదని.. తెలంగాణలో ఏం అవకాశం ఉంటుందని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు. అలాంటప్పుడు పీసీసీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఎందుకు బూచిగా చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పేరు చెప్తేనే మహేష్ కుమార్ గౌడ్ కు మనుగడ ఉంటుందా.. ఇదే మహేష్ కుమార్ గౌడ్ మీద బిగ్ టీవీ ఒక సిరీస్ స్టోరీలను పబ్లిష్ చేసింది. ఆ చానల్ కూడా అధికార పార్టీ నాయకుడిది. ఆ ఛానల్ మీద ఇంతవరకు కనీసం చర్యలు కూడా తీసుకోలేదు. ఆ ఛానల్ అపాలజీ కూడా చెప్పలేదు. అలాంటప్పుడు మహేష్ కుమార్ గౌడ్ తనను తాను ఎందుకు అంత గొప్పగా ఊహించుకుంటున్నారని జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారని.. పవన్ కళ్యాణ్ తెలంగాణ జనసేన పార్టీకి తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తికి మాత్రమే బాధ్యతలు అప్పగించారని.. తెలంగాణ ప్రాంతానికి చెందినవారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తారని జనసేన నాయకులు అంటున్నారు.. ఈ విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ మర్చిపోవడం దారుణమని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular