spot_img
Homeఆంధ్రప్రదేశ్‌JanaSena Party Formation: జనసేన ఆవిర్భావం.. వారికి అంకితం చేసిన పవన్

JanaSena Party Formation: జనసేన ఆవిర్భావం.. వారికి అంకితం చేసిన పవన్

JanaSena Party Formation: ఒక అధికార పార్టీ ఆవిర్భావ సభ అంటే ఎలా ఉండాలి? భారీగా జన సమీకరణ చేయాలి. ధూమ్ ధామ్ గా సందడి ఉండాలి. భారీగా ఖర్చు చేయాలి. జనాన్ని తరలించాలి. భారీ బహిరంగ సభ పెట్టాలి. అంతా ఉత్సాహపూరిత వాతావరణంలో ఆ వేడుక జరగాలి. కానీ ఏపీలో అధికారంలో ఉన్న జనసేన పార్టీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. మనుషులంతా ఒక్కటే అన్న నినాదంతో ముందుకు సాగుతుంటారు పవన్ కళ్యాణ్. అందుకే ఈసారి గిరిజనుల సమక్షంలో పూర్తి నిరాడంబరతతో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు పవన్. తనకు ఇష్టమైన అల్లూరి జిల్లా గిరిజనుల మధ్య ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు.

Also Read: రేవంత్ రెడ్డి మూడు ముక్కలాట..!

* అల్లూరి జిల్లాలో..
అల్లూరి జిల్లాలో( Alluri district ) గిరిజన ప్రాంతాల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు పవన్ కళ్యాణ్. ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. అయితే గిరిజనులతో మాటా మంతీ పేరుతో ఒక వినూత్న కార్యక్రమం రూపొందించారు పవన్ కళ్యాణ్. ఆదివాసీలతో మమేకం కావడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. తమ పార్టీ ఆశయాలు, విధానాలు ఎవరికోసమో చాటి చెప్పే విధంగా.. ఆచరణాత్మకంగా చేసి చూపించాలని పవన్ కళ్యాణ్. అందుకే గిరిజన ప్రాంతాల్లో ఆవిర్భావ దినోత్సవ నిర్వహించి.. జనసేన ఆశయంతో పాటు సంకల్పాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేశారు.

* గిరిజనులు అంటే ఇష్టం..
పవన్ కళ్యాణ్ కు( deputy CM Pawan Kalyan) గిరిజనులు అంటే చాలా ఇష్టం. గ్రామీణ ప్రాంతాలన్నా చాలా అభిమానం. అందుకే పెద్ద పెద్ద మంత్రి పదవులు వదులుకొని.. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ పర్యావరణ శాఖలు తీసుకున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ప్రజలతో మమేకం అయ్యేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. వారికి అనేక రకమైన బహుమానాలు పంపేవారు. అయితే ఇప్పుడు జనసేన ఆవిర్భావం నాడు.. తమ పార్టీ ఆశయాలను, సిద్ధాంతాలను గుర్తిండి పోయేలా చేస్తున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం హోదాలో చాలాసార్లు పర్యటించారు పవన్ కళ్యాణ్. అక్కడ రోడ్ల నిర్మాణానికి సంబంధించి భారీగా నిధులు కేటాయించారు. గిరిజన ప్రాంతాల్లో గ్రామసభలను నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవం నాడు గిరిజనులతో మాటామంతీ పేరుతో మాట్లాడనున్నారు. గిరిజనులకు జనసేన ఆవిర్భావ దినాన్ని అంకితం ఇవ్వడం ద్వారా పవన్ తన నిబద్ధతను చాటుకుంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ మన్యప్రాంతంలో పర్యటన నేపథ్యంలో యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న పవన్ అక్కడి నుంచి హెలికాప్టర్లో అల్లూరి జిల్లాకు బయలుదేరారు..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular