Devi Sri Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే దర్శకుడు రాసిన కథ తో పాటు అతను దానిని తెరమీద ఎలా ఆవిష్కరించారు అనేది కూడా కీలక పాత్ర వహిస్తుంది. ఇక వీటితోపాటుగా దీనికి ప్రేక్షకుడిలో ఒక ఎమోషన్ రేకెత్తించడానికి ఆ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. అందుకే సంగీత దర్శకులను తీసుకునేటప్పుడు డైరెక్టర్స్ బాగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే గత 26 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగొందుతున్న దేవి శ్రీ ప్రసాద్ ని ఈ మధ్యకాలంలో చాలా మంది దర్శకులు పక్కన పెడుతున్నారు. ముఖ్యంగా అతనితో సాంగ్స్ చేయించుకొని బ్యా గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో ఇతర సంగీత దర్శకుల వైపు వెళ్తున్నారు.
Also Read: రేవంత్ రెడ్డి మూడు ముక్కలాట..!
కారణమేంటి దేవి శ్రీ ప్రసాద్ అంత పర్ఫెక్ట్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని ఇవ్వలేకపోతున్నాడా? లేదంటే మిగతా వాళ్ళు బాగా ఇస్తారనే కాన్ఫిడెంట్ దర్శకులకు ఉందా? అనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఇక ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా విషయంలో కూడా దేవిశ్రీప్రసాద్ ను పక్కనపెట్టి తమన్ చేత బ్యాగ్రౌండ్ స్కోర్ చేయిస్తున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ మరోసారి హరీష్ శంకర్ తో సినిమా చేసే అవకాశాలైతే లేకుండా పోయాయి… నిజానికి తమన్ కంటే కూడా దేవిశ్రీప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇస్తాడు. ఆయన మ్యూజిక్ అందించిన చాలా సినిమాలు సక్సెస్ ఫుల్ గా మారాయి. తమన్ మ్యూజిక్ మొత్తం కాపీ అయినప్పటికి ఎందుకని దర్శక నిర్మాతలు అతని వెంట పడుతున్నారో ఎవరికి అర్థం కావడం లేదు…
దేవిశ్రీప్రసాద్ సైతం ఇప్పుడు ఎల్లమ్మ సినిమాతో హీరోగా మారుతున్నాడు. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయంటూ పలువురు సినిమా మేధావులు సైతం కామెంట్స్ చేస్తున్నారు…చూడాలి మరి దేవి హీరోగా ఏ మేరకు రాణిస్తాడు అనేది…
