Bigg Boss 10 Telugu: ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసి మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కృష్ణుడు, ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఒక కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమాల్లో ఈయన అమాయకత్వం చూసి నిజ జీవితం లో కూడా అమాయకుడు అని అంతా అనుకున్నారు. కానీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన త్రిగున్ మాటలకు ప్రభావితమై , రోహిత్ ని టార్గెట్ చేయడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఈయన చాలా అమాయకుడు , మంచోడు అనుకున్నామే , చూస్తే ఇలా ఉన్నాడేంటి , పైగా రోహిత్ పై పగ పెంచేసుకున్నాడు అని అంతా అనుకున్నారు. ఈరోజు కూడా కృష్ణుడు చరణ్ ని ఎలిమినేట్ చేసే ప్రక్రియ లో భాగంగా పెట్టిన కొన్ని పాయింట్స్ బాగా వైరల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇదంతా పక్కన పెడితే కృష్ణుడు కి పెళ్ళై ఒక పాప కూడా ఉందనే విషయం మనకి గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ రోజున తెలిసింది. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు తన కుటుంబం తో కలిసి దిగిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో లో కృష్ణుడు కూతురిని చూసిన నెటిజెన్స్ , ఈ అమ్మాయి చాలా క్యూట్ గా ఉంది, సినీ రంగం లోకి వస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. అంతే కాదు కృష్ణుడు సతీమణి కూడా చూసేందుకు చాలా క్లాస్ గా ఉంది. వీళ్ళ ఫ్యామిలీ ని చూస్తుంటే చాలా క్యూట్ ఫీలింగ్ కలిగింది. అంతటి క్యూట్ ఫ్యామిలీ ని పెట్టుకొని కృష్ణుడు అనవసరం గా బిగ్ బాస్ హౌస్ కి వచ్చాడని అనిపిస్తోంది అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
ఎందుకంటే ‘బిగ్ బాస్‘ షో ద్వారా ఒక కంటెస్టెంట్ కి పాజిటివిటీ మాత్రమే కాదు , నెగెటివిటీ కూడా భారీ రేంజ్ లో ఉంటుంది. పైగా కృష్ణుడు ప్రస్తుతం నెగెటివ్ గేమ్ ఆడుతున్నాడు. ఇతని ప్రవర్తన పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సమయం లో కృష్ణుడు ఫ్యామిలీ ఫోటోలపై ఆకతాయిలు నెగెటివ్ కామెంట్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ వీకెండ్ లో ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే కచ్చితంగా కృష్ణుడు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.
View this post on Instagram