spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Amaravati : అమరావతికి కొత్త రైల్వే లైన్.. ఆ రూట్ లోనే.. భూ సేకరణకు రెడీ!

Amaravati : అమరావతికి కొత్త రైల్వే లైన్.. ఆ రూట్ లోనే.. భూ సేకరణకు రెడీ!

Amaravati : అమరావతి రాజధాని నిర్మాణం పై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గత అనుభవాల దృష్ట్యా పనులు వీలైనంత వేగంగా పూర్తి చేయాలని భావిస్తోంది. మరోవైపు రోడ్డు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం కూడా తన వంతు సహకారాన్ని అందిస్తోంది. ఇప్పటికే బడ్జెట్లో అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్రం. ఇంకోవైపు రహదారులతో పాటు రైల్వే లైన్ ఏర్పాట్లపై కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా కొత్త రైల్వే లైన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎర్రుపాలెం- నంబూరుల మధ్య నిర్మిస్తున్న అమరావతి రైల్వే లైన్ భూసేకరణ పనులకు తాజాగా ముందడుగు పడింది. ఈ మేరకు కేంద్రం భూసేకరణకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి కృష్ణాజిల్లా నందిగామ రెవిన్యూ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో మొత్తం 297 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. దీనిపై అభ్యంతరాలు జనవరి 16 లోపు తెలియజేయాల్సి ఉంటుంది. సలహాలు సూచనలు సైతం స్వీకరిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ నెల రోజుల్లో లిఖితపూర్వకంగా నందిగామ ఆర్డీవోను కలిసి అందిస్తే పరిగణలోకి తీసుకుంటామని చెప్పుకొస్తున్నారు. అందరి వాదనలు విన్న తరువాతే తగిన విధంగా నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు.

* కేంద్రం గ్రీన్ సిగ్నల్
అమరావతికి తెలంగాణ నుంచి అనుసంధించాలన్న ఉద్దేశంతోనే ఈ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నూతన రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలో భూసేకరణ చేపట్టాల్సి ఉంది. మొత్తం 297 ఎకరాలకు సంబంధించి భూ సేకరణ చేయాల్సి ఉంది. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కంచికర్ల మండలం పరిటాలలో 72.42 ఎకరాలు, వీరులపాడు మండలం పెద్దాపురంలో 50.92 ఎకరాలు, కంచికర్ల మండలం గొట్టుముక్కల లో 50.49 ఎకరాలు, అల్లూరులో 43.15 ఎకరాలు, జుజ్జూరులో 28.89 ఎకరాలు, చెన్నారావుపాలెంలో 26.45 ఎకరాలు, నరసింహారావు పాలెం లో 17.4 ఎకరాలు, గూడెం మాధవరం లో 7.71 ఎకరాలు చొప్పున భూసేకరణ కోసం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.

* ప్రైవేట్ భూములు అధికం
అయితే గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన భూముల్లో.. 99 శాతం ప్రైవేట్ భూములే. ఈ మార్గంలో ప్రభుత్వ భూములు చాలా తక్కువ కూడా. దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు కూడా ఉన్నాయి. మరికొన్ని భూములకు సంబంధించి కోర్టు కేసులు నడుస్తున్నాయి. అవి పరిష్కారం అయితే తప్ప సేకరించేందుకు వీలు లేదు. అయితే అభ్యంతరాలు స్వీకరిస్తున్న నేపథ్యంలో దీనిపై పెద్ద ఎత్తున దరఖాస్తులు దాఖలయ్యే అవకాశం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
Oktelugu Epaper